తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Crime News : డ్యాన్స్​ చేస్తుంటే మ్యూజిక్​ ఆపేశాడని.. అన్నని గొడ్డలితో నరికి చంపిన తమ్ముడు!

Crime news : డ్యాన్స్​ చేస్తుంటే మ్యూజిక్​ ఆపేశాడని.. అన్నని గొడ్డలితో నరికి చంపిన తమ్ముడు!

Sharath Chitturi HT Telugu

10 March 2024, 17:30 IST

google News
  • Man kill brother : మధ్యప్రదేశ్​లో జరిగిన ఓ షాకింగ్​ ఘటన ఇప్పుడు వార్తలకెక్కింది. తాను డ్యాన్స్​ చేస్తుంటే, మ్యూజిక్​ ఆపేశాడన్న కోపంతో.. ఓ వ్యక్తి, తన అన్నను చంపేశాడు!

అన్నని కిరాతకంగా చంపిన తమ్ముడు!
అన్నని కిరాతకంగా చంపిన తమ్ముడు!

అన్నని కిరాతకంగా చంపిన తమ్ముడు!

Madhya Pradesh crime news : మధ్యప్రదేశ్​లో షాకింగ్​ ఘటన వెలుగులోకి వచ్చింది! చిన్న విషయానికే ఇద్దరు సోదరుల మధ్య గొడవ జరిగింది. కోపంతో ఊగిపోయిన తమ్ముడు.. అన్నను గొడ్డలితో నరికి చంపేశాడు. తమ్ముడు కోపానికి కారణం.. తాను డ్యాన్స్​ చేస్తుంటే.. అన్న వచ్చి మ్యూజిక్​ ఆపేయడం!

ఇదీ జరిగింది..

మధ్యప్రదేశ్​ మౌహర్​ గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగింది ఈ ఘటన. బాధితుడి పేరు రాకేశ్​​. అతని వయస్సు 35. నిందితుడు రాజ్​కుమార్​ కోల్​ వయస్సు 30. వాళ్లిద్దరు అన్నదమ్ములు.

కాగా.. శుక్రవారం రాత్రి.. తన ఇంట్లో ఓ ఫ్యామిలీ ఫంక్షన్​ని ఏర్పాటు చేశాడు రాకేశ్​. ఆ ఫంక్షన్​కి రాజ్​కూమార్​ వెళ్లాడు. అందరితో కలిసి మ్యూజిక్​కి డ్యాన్స్​ చేయడం మొదలుపెట్టాడు. కొంతసేపటికి.. రాకేశ్​ వచ్చి.. మ్యూజిక్​ సిస్టెమ్​ని ఆపేశాడు.

రాజ్​కుమార్​కి కోపం వచ్చింది. తనకి ఇంకా డ్యాన్స్​ చేయాలని ఉందని అన్నకు చెప్పాడు. కానీ రాకేశ్​ ఒప్పుకోలేదు. ఇదే విషయంపై గొడవ మొదలైంది. కుటుంబసభ్యులు చూస్తుండగా.. గొడవ మరింత పెరిగింది. చివరికి.. కోపంతో ఊగిపోయిన రాజ్​కుమార్​.. గొడ్డలి తీసుకుని సొంత అన్నని అతి కిరాతకంగా చంపేశాడు! అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.

ఇదీ చూడండి:- Kota suicide case : ‘నాన్నా.. నా వల్ల కావట్లేదు’- కోటాలో విద్యార్థి ఆత్మహత్య- ఏడాదిలో 6వ కేసు!

Man kills brother in Madhya Pradesh : ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందింది. ఘటనాస్థలానికి వెళ్లగా.. బాధితుడు మరణించాడని పోలీసులు తెలుసుకున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడు రాజ్​కుమార్​.. కొన్ని గంటల్లోనే పోలీసులకు దొరికిపోయాడు.

నిందితుడిని అరెస్ట్​ చేసినట్టు, నేరం కోసం వాడిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.

అన్నదమ్ములు తీవ్రంగా గొడవపడుతున్న సమయంలో కుటుంబసభ్యులు ఏం చేస్తున్నారు? వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారా? వంటి వివరాలపై స్పష్టత లేదు.

Man kills brother : కాగా.. మ్యూజిక్​ ఆపేశాడన్న కారణంతో.. అన్నను సొంత తమ్ముడు గొడ్డలితో నరికి చంపాడన్న వార్త.. స్థానికంగా కలకలం సృష్టించింది. రాజ్​కుమార్​ చేసిన పని గురించి తెలుసుకుంటున్న వారందరు.. షాక్​కు గురవుతున్నారు. ఇంత చిన్న విషయానికి చంపేయడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు!

తదుపరి వ్యాసం