Sai Pallavi Dance: ఫుల్ జోష్‍తో పబ్‍లో సాయిపల్లవి డ్యాన్స్.. వైరల్ అవుతున్న వీడియో-sai pallavi dances with full josh at ek din japan schedule wrap up party ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sai Pallavi Dance: ఫుల్ జోష్‍తో పబ్‍లో సాయిపల్లవి డ్యాన్స్.. వైరల్ అవుతున్న వీడియో

Sai Pallavi Dance: ఫుల్ జోష్‍తో పబ్‍లో సాయిపల్లవి డ్యాన్స్.. వైరల్ అవుతున్న వీడియో

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 09, 2024 05:57 PM IST

Sai Pallavi Dance Video: హీరోయిన్ సాయి పల్లవి చాలా ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. జపాన్‍లోని ఓ పబ్‍లో ఆమె చిందేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Sai Pallavi Dance: ఫుల్ జోష్‍తో పబ్‍లోసాయి పల్లవి డ్యాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
Sai Pallavi Dance: ఫుల్ జోష్‍తో పబ్‍లోసాయి పల్లవి డ్యాన్స్.. వైరల్ అవుతున్న వీడియో

Sai Pallavi: లేడీ పవర్ స్టార్, హీరోయిన్ సాయి పల్లవి మళ్లీ సినిమాల్లో ఫుల్ బిజీ అవుతున్నారు. గార్గి తర్వాత కాస్త బ్రేక్ తీసుకున్న ఆమె వరుసగా చిత్రాలు చేస్తున్నారు. తెలుగులో నాగచైతన్యతో తండేల్, తమిళంలో శివకార్తికేయన్‍తో అమరన్ చిత్రాలు చేస్తున్నారు డ్యాన్స్ క్వీన్ సాయిపల్లవి. అలాగే, బాలీవుడ్‍లోనూ ఆమె ఎంట్రీ ఇవ్వనున్నారు. స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్న చిత్రంతో పల్లవి బాలీవుడ్‍లో అడుగుపెడుతున్నారు.

జునైద్, సాయిపల్లవి కలిసి నటిస్తున్న మూవీ షూటింగ్ సాగుతోంది. ఈ సినిమా చిత్రీకరణలో తాజాగా జపాన్‍ షెడ్యూల్‍ ముగిసింది. జపాన్‍లో షూటింగ్ పూర్తయిన సందర్భంగా మూవీ టీమ్ ఓ పబ్‍లో పార్టీ చేసుకుంది. ఈ సందర్భంగా హీరోయిన్ సాయిపల్లవి డ్యాన్స్‌తో అదరగొట్టారు.

ఉత్సాహంగా స్టెప్స్

ఊపున్న మ్యూజిక్ ప్లే అవుతుండగా సాయిపల్లవి ఫుల్ జోష్‍తో డ్యాన్స్ చేశారు. మూవీ టీమ్ మెంబర్స్ అరుస్తూ ఎంకరేజ్ చేయగా.. ఆమె చాలా గ్రేస్‍తో, ఉత్సాహంగా చిందేశారు. సంతోషంగా నవ్వుతూ.. కేకలు వేస్తూ స్టెప్‍లు వేశారు.

సాయిపల్లవి డ్యాన్స్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పల్లవి ఎనర్జీ సూపర్ అంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. ఆమె గ్రేస్, జోష్ అదిరిపోయిందని అభిప్రాయపడుతున్నారు.

ఫిబ్రవరి నుంచి జపాన్‍లోనే జునైద్ - సాయి పల్లవి మూవీ షూటింగ్ జరిగింది. సపోరో స్నో ఫెస్టివల్‍లోనూ చిత్రీకరణ జరిగింది. అప్పుడు ఆ ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ సమయంలో రోజుకు 12 గంటల పాటు కూడా షూటింగ్ చేసిందట చిత్ర యూనిట్. ఈ చిత్రానికి ఏక్ దిన్ అనే టైటిల్ ఖరారు చేసినట్టు తెలుస్తోంది.

సాయిపల్లవి తదుపరి చిత్రాలు

నాగచైతన్య సరసన తండేల్ సినిమాలో హీరోయిన్‍గా నటిస్తున్నారు సాయిపల్లవి. సముద్రం బ్యాక్‍డ్రాప్‍లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. పాకిస్థాన్ జైలులో కొన్ని నెలల పాటు చిత్ర హింసలు అనుభవించి.. తిరిగి స్వదేశానికి వచ్చిన శ్రీకాకుళం జాలర్ల కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. తండేల్‍లో మత్య్సకారుడు రాజు పాత్రను నాగచైతన్య పోషిస్తున్నారు. అతడి ప్రేయసి బుజ్జితల్లి క్యారెక్టర్ చేస్తున్నారు సాయిపల్లవి. దేశభక్తితో పాటు ప్రేమకథ కూడా తండేల్ చిత్రంలో ప్రధానంగా ఉండనుంది.

తెలుగులో చివరగా 2022లో విరాట పర్వం సినిమా చేశారు సాయిపల్లవి. ఆ తర్వాత తమిళ మూవీ గార్గిలో నటించారు. అనంతరం గ్యాప్ తీసుకున్నారు. 2023లో సాయి పల్లవి నటించిన ఒక్క చిత్రం కూడా రాలేదు. దీంతో తండేల్ సినిమాలో సాయిపల్లవిని చూసేందుకు తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది అక్టోబర్‌లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

తమిళంలో ప్రస్తుతం అమరన్ సినిమా కూడా చేస్తున్నారు సాయిపల్లవి. శివకార్తికేయన్ సరసన ఈ మూవీలో హీరోయిన్‍గా నటిస్తున్నారు. యాక్షన్ వార్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు రాజ్ కుమార్ పెరియస్వామి. దిగ్గజ నటుడు, సీనియర్ హీరో కమల్ హాసన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఏడాదిలోనే అమరన్ మూవీ రిలీజ్ కానుంది.