Kota student death 2024 : విద్యార్థుల సూసైడ్ పాయింట్‌గా మారిన రాజస్థాన్ కోటాలో మరో కలకలం! ఓ 16ఏళ్ల జేఈఈ విద్యార్థి.. తాజాగా సూసైడ్ చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. 'నానాన్న.. నా వల్ల కావట్లేదు,' అంటూ సూసైడ్ నోట్ రాసి మరణానికి పాల్పడ్డాడు. తాజా ఘటనతో.. ఈ ఏడాది కోటాలో సూసైడ్ చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఆరుకు చేరింది.
బిహార్‌కి చెందిన అభిషేక్ మండల్.. కోటాలోని ఓ కోచింగ్ సెంటర్లో జేఈఈకి ప్రిపేర్ అవుతున్నాడు. అతని వయస్సు 16ఏళ్లు. ఏడాదిగా ఓ పీజీలో ఉంటూ చదువుకుంటున్నాడు. కోటా విద్యార్థి ఆత్మహత్య లిస్ట్‌లో అతను పేరు ఉంటుందని ఎవరు ఊహించలేదు!
కాగా.. గురువారం రాత్రి నుంచి అతడితో మాట్లాడాలని కుటుంబసభ్యులు ప్రయత్నించారు. కానీ అభిషేక్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అనంతరం.. పీజీ యజమానికి కాల్ చేసి, అభిషేక్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని, ఒకసారి వెళ్లి చూడాలని కోరారు.
Kota student death : శుక్రవారం ఉదయం.. అభిషేక్ మండల్ గది దగ్గరికి వెళ్లిన యజమానీ.. కిటికీలో నుంచి చూసి షాక్ అయ్యాడు. అభిషేక్ స్పృహలో లేకుండా నేల మీద పడి ఉండటాన్ని గమనించాడు. వెంటనే డోర్లు బద్దలు కొట్టి.. అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. కానీ 16ఏళ్ల బాలుడు అప్పటికే మరణించాడని వైద్యులు ధ్రువీకరించారు. ఈ విషయాన్ని అతని కుటుంబసభ్యులతో పాటు పోలీసులకు కూడా సమాచారం ఇచ్చాడు యజమాని.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. ఈ విద్యార్థి రూమ్‌ని పరిశీలిచారు. పాయిజన్ బాటిల్ వారికి కనిపించింది. విద్యార్థి.. విషయం తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు ధ్రువీకరించారు. అదే సమయంలో.. వారికి ఒక సూసైడ్ నోట్ కూడా కనిపించింది.
Kota student death news : "నాన్నా.. నా వల్ల కావట్లేదు. జేఈఈ నా వల్ల అవ్వదు. సారీ. ఐ క్విట్," అని ఆ సూసైడ్ నోట్లో రాసి ఉంది.
ఫలితంగా.. కోటాలో విద్యార్థి ఆత్మహత్య వార్త మళ్లీ తెరపైకి వచ్చింది. సమాచారం అందుకున్న విద్యార్థి తల్లిదండ్రులు.. బిహార్ నుంచి కోటాకు బయలుదేరారు. వారు వచ్చిన తర్వాత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు.
కాగా.. అభిషేక్ మండల్.. జనవరి 29న జేఈఈ మెయిన్స్ పరీక్ష రాయాల్సి ఉంది. కానీ రాయలేదు! ఇందుకు కారణం తెలియలేదు.
Student deaths in Kota : విద్యార్థుల ఆత్మహత్యలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది కోటా! గతేడాది మొత్తం మీద కోటాలో విద్యార్థి ఆత్మహత్యల సంఖ్య 26గా ఉంది. ఇక ఈ ఏడాది మొదటి మూడు నెలల్లోనే ఆ సంఖ్య 6కు చేరింది. విద్యార్థులపై ఉన్న తీవ్రమైన ఒత్తిడే ఇందుకు కారణం అని నిపుణులు చెబుతున్నారు.
సంబంధిత కథనం