Exam preparation tips for students : ఈ టిప్స్​ పాటించి ప్రిపేర్​ అయితే.. పరీక్షల్లో సక్సెస్​ మీదే!-best exam preparation tips for students in telugu for maximum results ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Exam Preparation Tips For Students : ఈ టిప్స్​ పాటించి ప్రిపేర్​ అయితే.. పరీక్షల్లో సక్సెస్​ మీదే!

Exam preparation tips for students : ఈ టిప్స్​ పాటించి ప్రిపేర్​ అయితే.. పరీక్షల్లో సక్సెస్​ మీదే!

Sharath Chitturi HT Telugu
Feb 25, 2024 10:00 AM IST

Tips for exams preparation : ఎగ్జామ్స్​ కోసం కష్టపడుతున్నారా? సిలబస్​ని ఫినీష్​ చేయలేకపోతున్నారని బాధపడుతున్నారా? స్ట్రెస్​ తీసుకోకండి! కొన్ని సింపుల్​ టిప్స్​ పాటిస్తే.. సులభంగా ప్రిపేర్​ అవ్వొచ్చు. ఆ టిప్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

ఈ టిప్స్​ పాటించి ప్రిపేర్​ అయితే.. పరీక్షల్లో సక్సెస్​ మీదే!
ఈ టిప్స్​ పాటించి ప్రిపేర్​ అయితే.. పరీక్షల్లో సక్సెస్​ మీదే!

Exam preparation tips in Telugu : దేశంలో ఎగ్జామ్స్​ సీజన్​​ మొదలైపోయింది! సీబీఎస్​ఈ క్లాస్​ 10, 12 పరీక్షలు ఇప్పటికే మొదలైపోయాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో 10, ఇంటర్​ పరీక్షలు ఇంకొన్ని రోజుల్లో మొదలవ్వనున్నాయి. ఆ తర్వాత ఎంసెట్​ వంటి పోటీపరీక్షలు ఎలాగో ఉంటాయి. పరీక్షలంటే చాలు.. చాలా మంది విద్యార్థులు భయపడిపోతూ ఉంటారు. ఎలా మొదలుపెట్టాలి, ఎక్కడి నుంచి ప్రారంభించాలి? అని తెగ ఆలోచిస్తూ ఉండిపోతారు. ఇలా.. ఇంకాస్త సమయం వృథా అయిపోతుంది. పరీక్షల సీజన్​లో విద్యార్థులు మెరుగైన ప్రదర్శన చేయాలంటే.. కొన్ని టిప్స్​ పాటించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఆ టిప్స్​తో.. మీ మీద ఒత్తిడి కూడా తగ్గిపోతుంది! అవేంటంటే..

పరీక్షల కోసం ఇలా సిద్ధమవ్వండి..!

వెంటనే మొదలుపెట్టండి:- పరీక్షల ప్రిపరేషన్​.. ఎంత తొందరగా మొదలుపెడితే అంత మంచిది! సిలబస్​ రివిజన్​కి ఇంకా టైమ్​ మిగులుతుంది. బద్ధకాన్ని వీడితే.. చివరి నిమిషంలో టెన్షన్​ పడాల్సిన అవసరం ఉండదు. కొందరు.. రోజుకు కొన్ని గంటల పాటు చదువుతారు. ఇంకొందరు.. వీకెండ్స్​ మొత్తం చదువుతారు. మీకు ఏ స్టడీ రొటీన్​ సెట్​ అవుతుందో చూసుకోండి. ఈ రొటీన్​కి స్టిక్​ అవ్వడం చాలా అవసరం. అప్పుడే.. ప్రాసెస్​ని ఎంజాయ్​ చేస్తారు.

Study Tips for Exam Preparation in Telugu : స్టడీ ప్లాన్​ క్రియేట్​ చేసుకోండి:- పరీక్షల కోసం సిద్ధమవ్వాలంటే.. స్టడీ ప్లాన్​ ఉండాల్సిందే! టైమ్​ చాలా ముఖ్యమైనది. మీ ప్రయారిటీలను సెట్​ చేసుకుని, ప్రతి సబ్జెక్ట్​కి తగినంత టైమ్​ని ఇవ్వండి. ఏ టాపిక్​పై మీకు పట్టు ఉంది? ఏ టాపిక్​లో వీక్​గా ఉన్నారు? అన్నింటినీ పేపర్​లో రాసుకోండి. దేనికి ఎంత సమయం పడుతుంది? అన్న విషయంపై రియలిస్టిక్​గా ప్లాన్​ చేయండి. ఇలా చేస్తే.. మీకు స్ట్రెస్​ ఫీలింగ్​ ఉండదు.

యాక్టివ్​ లెర్నింగ్​ టెక్నిక్స్​ పాటించండి:- టాపిక్​ని సమ్మరీగా రాసుకోవడం, ముఖ్యమైన పాయింట్స్​ని నోట్​ చేసుకోవడం వంటివి కొన్ని లెర్నింగ్​ టెక్నిక్స్​. మీకు కూడా అవి ఉపయోగపడతాయి. ఇంకొందరికి.. ఇతరలకు నేర్పిస్తూ ఉంటే, వాళ్లు కూడా పర్ఫెక్ట్​ అవుతారు. ఒకవేళ మీకు కూడా అలానే ఉంటే.. మీ స్నేహితులకు నేర్పించండి. మీరు పర్ఫెక్ట్​ అవుతారు. కీ పాయింట్స్​ని గుర్తు చేసుకోవడం కోసం.. మైండ్​ మ్యాప్స్​ని యూజ్​ చేయండి.

క్వశ్చన్​ పేపర్స్​ని ప్రాక్టీస్​ చేయాల్సిందే:- ఎగ్జామ్స్​ ప్రిపరేషన్​లో క్వశ్చన్​ బ్యాంక్స్​ కచ్చితంగా ఉండాల్సిందే! గత కొన్నేళ్లుగా రిపీట్​ అవుతున్న టాపిక్స్​, కాన్సెప్ట్స్​ కొన్ని ఉంటాయి. ముందు వాటిపై పట్టు సాధించాలి. అప్పుడు.. పని ఈజీ అయిపోతుంది. ఆ తర్వాత.. కఠినంగా ఉన్న క్వశ్చన్స్​పై ఫోకస్​ చేయాలి. వాటికంటూ కాస్త ఎక్కువ టైమ్​ని కేటాయించాలి. ఇలా చేస్తే.. పరీక్షల్లో నిజంగా ఆ ప్రశ్న వచ్చిందంటే, మీకు పని సులభమైపోతుంది కదా! అంతేకాకుండా.. పాత క్వశ్చన్​ పేపర్స్​ని రిఫర్​ చేస్తే.. ఎగ్జామ్​ పాటర్న్​ ఎలా ఉంది? అన్న అంశంపై మీకు అవగాహన వస్తుంది.

Simple tips for exam preparation : టైమ్​ మేనేజ్​మెంట్​ చాలా ముఖ్యం:- ఎంత చదివినా, ఎంత కష్టపడినా.. చివరికి.. పరీక్షల్లో టైమ్​ మేనేజ్​మెంట్​ అనేది చాలా కీలకం. తక్కువ టైమ్​లో ఎక్కువ ప్రశ్నలను ఎఫీషియెంట్​గా రాసే సత్తా మీలో ఉండాలి. అందుకోసం చదువుకుంటున్నప్పుడే ఒక ప్లాన్​ వేసుకోవాలి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. టైమర్​ పెట్టుకుని, ఎంత సేపటిలో ప్రశ్నలను పూర్తి చేస్తున్నారో అసెస్​ చేసుకోండి. కాంపిటీటివ్​ పరీక్షల్లో ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది.

సోషల్​ మీడియాకు కొంత కాలం దూరంగా ఉండటం చాలా అవసరం. రోజులు 10, 20 నిమిషాలు వాటిని చూస్తే పర్లేదు కానీ.. మిమ్మల్ని అవి డిస్ట్రాక్ట్​ చేస్తుంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి! సోషల్​ మీడియా యాప్స్​ని వెంటనే డిలీట్​ చేసయండి.

స్ట్రెస్​ మేనేజ్​మెంట్​పై ఫోకస్​ చేయండి:- పరీక్షల సీజన్​ అంటే.. స్ట్రెస్​ సాధారణంగా ఉంటుంది. కొంతమంది.. స్ట్రెస్​లో అద్భుతాలు సృష్టిస్తారు. ఇంకొందరు.. వీక్​ అయిపోతారు. స్ట్రెస్​ని తీసుకోవడం కష్టంగా అనిపిస్తుంటే.. మీరు ఎప్పటికప్పుడు బ్రేక్​ తీసుకోవడం మంచిది. పొమొడోరా 25/5 రూల్​ని పాటించాలి అంటే.. ప్రతి 25 నిమిషాలకు ఒక 5 నిమిషాల బ్రేక్​ తీసుకోండి. అలా.. 4సార్లు తర్వాత.. 15- 30 నిమిషాల లాంగ్​ బ్రేక్​ తీసుకోండి. అలా వాకింగ్​కి వెళ్లండి. చల్లగాలి పీల్చుకోండి. రెగ్యులర్​గా వ్యాయామాలు చేసినా స్ట్రెస్​ని తగ్గించుకోవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. మెడిటేషన్​, డీప్​ బ్రీతింగ్​ కూడా ఉపయోగపడతాయి ట్రై చేయండి.

Important tips for exam preparation : హెల్తీగా తినండి:- పరీక్షల సీజన్​లో ఎంత ఫిట్​గా ఉంటే అంత మంచిది! ఆరోగ్యం కొంచెం కూడా దెబ్బతినకూడదు. అందుకోసం.. సరైన, ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవాలి. శరీరానికి సరైన పోషకాలు అందితే.. బ్రెయిన్​ ఇంకా ఎఫెక్టివ్​గా, వేగంగా పనిచేస్తుంది. కొన్ని రోజులు జంక్​ఫుడ్​కి దూరంగా ఉండండి. బాడీని ఎప్పుడు హైడ్రేటెడ్​గా ఉండండి. లాంగ్​ స్టడీ సెషన్స్​లోనూ మీరు చురుకుగా ఉంటారు.

పైన చెప్పిన టిప్స్​ పాటిస్తే.. మీ సక్సెస్​ రేట్​ మరింత పెరుగుతుంది. చాలా మంది టాపర్స్​ పాటించే టిప్స్​ ఇవే! వీటిని తెలుసుకుని, మీరు కూడా మంచి ప్రదర్శన చేస్తారని ఆశిస్తూ.. ఆల్​ ది బెస్ట్​..

Whats_app_banner

సంబంధిత కథనం