Delhi rape case : బాలికపై గ్యాంగ్ రేప్.. నిందితుల్లో 3 మైనర్లు- ఆ మహిళ సాయంతో నేరం!
Delhi rape case : దిల్లీలో ఓ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. నలుగురు నిందితులు.. ఆమెను గ్యాంగ్ రేప్ చేశారు. వారిలో ముగ్గురు మైనర్లు ఉన్నారు. అంతేకాకుండా.. బాలికపై నేరానికి నిందితులకు ఓ మహిళ సాయం చేసింది!
Delhi rape case : దిల్లీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 12ఏళ్ల బాలికపై నలుగురు గ్యాంగ్ రేప్ చేశారు. వీరిలో ముగ్గురు మైనర్లు ఉన్నారు. కాగా.. ఈ నేరంలో నిందితులకు ఓ మహిళ సాయం చేయడం గమనార్హం!
ఇదీ జరిగింది..
దిల్లీలోని సదర బజార్‌కు సమీపంలో జరిగింది ఈ ఘటన. ఆ ప్రాంతంలో ఓ వ్యక్తి టీ స్టాల్ నడుపుకుంటున్నాడు. అతని దగ్గరు ముగ్గురు మైనర్లు పనిచేస్తున్నారు. వారి వయస్సు 12, 14, 15. కాగా.. చెత్త ఏరుకునే ఓ మహిళ, తరచూ అక్కడ టీ తాగుతుంది. అలా.. ఆ మహిళ, టీ స్టాల్ ఓనర్‌కు పరిచయం పెరిగింది. కాగా.. న్యూ ఇయర్ సందర్భంగా, జనవరి 1న.. ఆ వ్యక్తి, ఆ మహిళతో మాట్లాడాడు. "న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకునేందుకు మాకు ఒక అమ్మాయి కావాలి. అరేంజ్ చెయ్యి," అని అన్నాడు. ఆమె సరే అని అక్కడికి వెళ్లిపోయింది.
Delhi gang rape case : మరోవైపు.. సదర్ బజార్లో ఓ సీల్ చేసిన భవనం ఉంది. చాలా సంవత్సరాలుగా అది ఖాళీగానే ఉంది. న్యూ ఇయర్ వేడుకల కోసం.. ఆ టీ స్టాల్ ఓనర్, ఆ భవనంలో కొన్ని తాత్కాలిక ఏర్పాట్లు చేశాడు. రాత్రంతా అక్కడ పార్టీ చేసుకున్నాడు.
మరుసటి రోజు, జనవరి 2న.. ఆ మహిళకు ఓ బాలిక కనిపించింది. ఆ బాలిక కూడా చెత్త ఏరుకుంటూ జీవిస్తుంది. ఆమె దగ్గరకు వెళ్లిన మహిళ.. ఖుర్షీద్ మార్కెట్ దగ్గర చెత్త ఉందని, దానిని తీసుకురమ్మని చెప్పి పంపించింది. ఆ మహిళ మాటలు విన్న ఆ బాలిక.. అక్కడికి బయలుదేరింది. ఇంతలో.. టీ స్టాల్ ఓనర్‌కు సమాచారం అందించింది ఆ మహిళ.
బాలిక ఆ ప్రాంతానికి వెళ్లేసరికి.. అక్కడ, నలుగురు ఆమె కోసం ఎదురుచూశారు. ఆమె వచ్చిన వెంటనే.. భవనంపైకి లాక్కెళ్లి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఒకరి తర్వాత ఒకరు రేప్ చేశారు. ఈ విషయం ఎవరికైనా చెబితే, చంపేస్తామని బెదిరించారు. ఆ బాలిక అక్కడి నుంచి వెళ్లిపోయింది.
Delhi crime news : కొన్ని రోజుల పాటు మౌనంగా ఉండిపోయిన బాలికను చూసి ఆమె బంధువుకు అనుమానం వచ్చింది. ఏం జరిగింది? అని ప్రశ్నించగా.. తనకు జరిగినదంతా వివరించింది ఆ బాలిక. ఆ బంధువు.. బాలిక తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పాడు. ఆమె తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేశారు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని నిందుతుల కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టారు. కొన్ని గంటల్లోనే నలుగురిని అరెస్ట్ చేశారు. మహిళను కూడా అరెస్ట్ చేశారు.
సంబంధిత కథనం