MP rape case : 200 మంది పోలీసులు, డ్రోన్‌తో 5 రోజుల వేట- చివరికి దొరికిన అత్యాచార నిందితుడు!
30 September 2024, 9:48 IST
- MP rape case : ఐదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన మధ్యప్రదేశ్‌కు చెందిన 22 ఏళ్ల యువకుడని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఆపరేష్లో 200మంది పోలీసులు, 500 మంది స్థానికులు పాల్గొన్నారు. నైట్ విజన్ టెక్నాలజీతో కూడిన డ్రోన్ సాయం కూడా తీసుకున్నారు.
మధ్యప్రదేశ్ రేప్ కేసు నిందితుడి అరెస్ట్..
మధ్యప్రదేశ్‌లో కలకలం సృష్టించిన 5ఏళ్ల చిన్నారి రేప్ కేసు నిందితుడు ఎట్టకేలకు దొరికాడు! 200మంది పోలీసులు, 500 మంది స్థానికులు, డ్రోన్లతో 5 రోజుల గాలింపు చర్యలు అనంతరం పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. పోలీసులకు దొరికే ముందు నిందితుడు అత్మహత్యకు విఫలయత్నం చేశాడు.
ఇదీ జరిగింది..
మధ్యప్రదేశ్‌లోని హర్డాలో ఈ ఘటన జరిగింది. ఐదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన 22 ఏళ్ల యువకుడిని పట్టుకునేందుకు పోలీసులు ఈ నెల 23 నుంచి ఐదు రోజుల పాటు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు.
గాలింపు చర్యల్లో సుమారు 200 మంది పోలీసులు, 500 మందికి పైగా స్థానికులు పాల్గొన్నారు. నైట్ విజన్ టెక్నాలజీతో కూడిన డ్రోన్ సైతం వారికి సాయం అందించింది. దుండగుడిని పట్టుకునేందుకు ఐదు రోజుల పాటు హర్దా, ఖాండ్వా, బేతుల్ సహా మూడు జిల్లాల్లో దాదాపు 250 చదరపు కిలోమీటర్ల మేర గాలింపు చేపట్టారు.
నిందితుడిని బేతుల్‌లోని మోహన్ పురా ప్రాంతాంలో ఆదివారం ఉదయం పట్టుకున్నట్టు తెలిపారు.
సెప్టెంబర్ 23న సిరాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ నది సమీపంలో ఐదేళ్ల బాధితురాలు కనిపించింది. వైద్య పరీక్షల్లో లైంగిక దాడి జరిగినట్లు నిర్ధారణ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు సునీల్ కోర్కు ఆచూకీ తెలిపిన వారికి రూ.10 వేల రివార్డు సైతం ప్రకటించారు. మధ్యప్రదేశ్‌లోని ఖల్వా ప్రాంతానికి చెందిన నిందితుడు మొక్కజొన్న పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆస్పత్రిలో చేరాడు.
అత్యాచార ఘటన కలకలం సృష్టించడంతో నిందితుడు తన ఫోన్‌ను విసిరేశాడు. నిరంతరం సంచరిస్తూ ఉండేవాడని ది హిందూ రిపోర్టు తెలిపింది. అతను మొదట ఖాండ్వాకు వెళ్లాడని, ఆ తర్వాత హర్దాకు తిరిగి వచ్చి బేతుల్కి పారిపోయాడని, అయితే జిల్లా సరిహద్దు సమీపంలో పట్టుబడ్డాడని పోలీసు అధికారి తెలిపారు. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు 250 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న పొలాలు, అడవుల్లో మూడు రోజుల పాటు నడిచాడు. అడవిలోని 33 గ్రామాల్లో ముగ్గురు పోలీసు అధికారులను మోహరించినట్టు తెలుస్తోంది.
అతడిని పట్టుకున్నప్పుడు అరెస్టు చేస్తారనే భయంతో పొలంలో దొరికిన బాటిల్ నుంచి పురుగుల మందు తాగినట్లు చెప్పాడని పోలీసు అధికారి తెలిపారు.
యూట్యూబ్ ఫేమ్‌పై రేప్ కేసు..
జగిత్యాలలో సోషల్ మీడియాలో ఫేమ్ అయిన యూట్యూబర్‌పై రేప్ కేసు నమోదైంది. జిల్లాలోని బుగ్గారం మండలం చిన్నాపూర్ గ్రామానికి చెందిన మల్లిక్ తేజ రైటర్ సాంస్కృతిక సారధి ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. యూట్యూబ్ ఫేమ్‌గా సుపరిచితుడు. అదే గ్రామానికి చెందిన యువతి ఫోక్ సాంగ్ సింగర్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరు ఫోక్ సాంగ్ సింగర్ లు కావడంతో పలు అల్బమ్ లు తీశారు. ఏమైందో ఏమో కానీ ఆ యువతి మల్లిక్ తేజ పై పోలీసులకు పిర్యాదు చేసింది. మాటలు చెప్పి లొంగ తీసుకొని అత్యాచారం చేశాడని పిర్యాదు లో పేర్కొంది. బ్లాక్ మెయిల్ చేస్తూ పలుమార్లు అత్యాచారం చేశాడని ఆరోపిస్తుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.