తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Lumpy Skin Disease : ఆందోళనకరంగా లంపీ చర్మ వ్యాధి.. 7000కుపైగా జంతువులు బలి!

Lumpy skin disease : ఆందోళనకరంగా లంపీ చర్మ వ్యాధి.. 7000కుపైగా జంతువులు బలి!

Sharath Chitturi HT Telugu

21 August 2022, 14:48 IST

google News
    • Lumpy skin disease : లంపీ చర్మ వ్యాధి సోకి.. ఇప్పటికే 7వేలకుపైగా జంతువులు ప్రాణాలు కోల్పోయాయి. పంజాబ్​లో పరిస్థితులు అత్యంత ఆందోళనకరంగా ఉన్నాయి.
ఆందోళనకరంగా లంపీ చర్మ వ్యాధి
ఆందోళనకరంగా లంపీ చర్మ వ్యాధి (AFP)

ఆందోళనకరంగా లంపీ చర్మ వ్యాధి

Lumpy skin disease : లంపీ చర్మ వ్యాధి.. దేశవ్యాప్తంగా ఆందోళకరంగా మారింది. ఈ వ్యాధి సోకి.. ఒక కేంద్ర పాలిత ప్రాంతం సహ 8 రాష్ట్రాల్లోని 7,300 జంతువులు మరణించాయి. అయితే.. పశువులకు సోకుతున్న ఈ లంపీ చర్మ వ్యాధిని కట్టడి చేసేందుకు తగిన చర్యలు చేపట్టినట్టు అధికారులు చెబుతున్నారు.

పంజాబ్​లో..

లంపీ చర్మ వ్యాధీకి బలైన 7,300 జంతువుల్లో 3,359.. పంజాబ్​కు చెందినవే. రాజస్థాన్​లో 2111, గుజరాత్​లో 1679, జమ్ముకశ్మీర్​లో 62, హిమాచల్​ ప్రదేశ్​లో 38, ఉత్తరాఖండ్​లో 36, అండమాన్​ అండ్​ నికోబార్​లో 29 జంతువులు.. ఈ లంపీ స్కిన్​ వ్యాధితో బాధపడి ప్రాణాలు కోల్పోయాయి.

Lumpy skin disease in telugu : 2019లో తొలిసారిగా బంగ్లాదేశ్​లో ఈ వ్యాధిని గుర్తించారు. అనంతరం ఇది ఇండియాకు కూడా పాకింది. ఇండియాతో పాటు ఆసియా, మధ్యప్రాచ్యం, యూరోప్​లోని జంతువులకు కూడా ఈ లంపీ చర్మ వ్యాధి సోకినట్టు తెలుస్తోంది.

లంపీ చర్మ వ్యాధికి సంబంధించి.. 2019లోనే ఇండియాలో తొలి కేసు నమోదైంది. పశ్చిమ బెంగాల్​ సహా ఒడిశాలోని పశువులకు ఈ వ్యాధి వ్యాపించింది. అక్కడి నుంచి ఉత్తర, పశ్చిమ ప్రాంతాలకు ఈ లంపీ స్కిన్​ వ్యాధి పాకింది.

"లంపీ చర్మ వ్యాధి తీవ్రత తొలుత.. గుజరాత్​లో ఎక్కువగా కనిపించింది. ఇక ఇప్పుడు 8 రాష్ట్రాలకు సోకింది. ఈ వ్యాధితో 1.85లక్షల పశువులు ప్రభావితమయ్యాయి. జులై నుంచి 7,300 జంతువులు మరణించాయి," అని అధికారులు పీటీఐ వార్తా సంస్థకు వెల్లడించారు.

వ్యాక్సిన్​తో చెక్​..!

Lumpy skin disease in cows : పంజాబ్​లో 74,325 జంతువులకు లంపీ స్కిన్​ వ్యాధి సోకింది. గుజరాత్​లో 58,546, రాజస్థాన్​లో 43962, జమ్ముకశ్మీర్​లో 6385, ఉత్తరాఖండ్​లో 1300, హిమాచల్​ ప్రదేశ్​లో 532, అండమాన్​ నికోబార్​లోని 260 పశువులు ఈ వ్యాధి బారిన పడ్డాయి.

జంతువుల రక్తాన్ని పీల్చే పురుగుల నుంచి ఈ లంపీ చర్మ వ్యాధి వ్యాపిస్తోంది. దోమలు, కీటకాలు.. వ్యాధి వ్యాప్తికి కారణమవుతున్నాయి. ఒక పశువు నుంచి మరో పశువును కుట్టడంతో అనేక జంతువులు ఈ వ్యాధి బారిన పడుతున్నాయి. విపరీతమైన దద్దుర్లు, జ్వరం ఈ వ్యాధి లక్షణాలు. ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉండటం ఆందోళనకరం.

అయితే.. లంపీ చర్మ వ్యాధిని కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. కొవిడ్​లాగానే.. వ్యాక్సినేషన్​ డ్రైవ్​ నిర్వహిస్తున్నాయి. ఆవులతో పాటు ఇతర జంతువులకు టీకాలు ఇస్తున్నాయి. వ్యాధితో మరణించిన జంతువుల మృతదేహాలను సత్వరమే భూమిలో పూడ్చిపెట్టాలని అధికారులు సూచిస్తున్నారు.

తదుపరి వ్యాసం