తెలుగు న్యూస్  /  Lifestyle  /  China Langya Virus Symptoms And Treatment And Unknown Facts

Langya Virus : కరోనా కంటే.. లాంగ్యాతో మరణాల రేటు ఎక్కువట.. లక్షణాలు ఇవే..

11 August 2022, 10:35 IST

    • Langya Virus : చైనాలో మరో ప్రమాదకరమైన వైరస్ ఉద్భవించింది. ఈ కరోనా సంగతే తేలలేదురా అంటే.. మరో ఉపద్రవాన్ని రెడీ చేస్తుంది. కరోనా, మంకీపాక్స్​లతో ప్రపంచం అల్లాడిపోతుంటే.. ఈ చైనా లాంగ్యా అంటూ కొత్తవైరస్​ను తెరపైకి తెచ్చింది. ఇప్పటికే చైనాలో ఈ వైరస్ 35మందికి సోకింది. ఇది కూడా జంతువుల నుంచే మనుషులకు సోకినట్లు గుర్తించారు.
లాంగ్యా హెనిపావైరస్
లాంగ్యా హెనిపావైరస్

లాంగ్యా హెనిపావైరస్

Langya Virus : మొన్న కరోనా.. నిన్న మంకీపాక్స్.. రేపు లాంగ్యా అన్నట్లు అయిపోయింది పరిస్థితి. కరోనా నుంచి కాస్త తేరుకుని.. కాస్త జనాలు బయట తిరుగుతున్నారు అనేసరికి మంకీపాక్స్ వచ్చేసింది. దీనికే ప్రపంచ దేశాలు తలలు పట్టుకుంటే.. చైనా మాత్రం మరో కొత్తవైరస్​ను తీసుకువచ్చింది. ఈ వైరస్​ కూడా ప్రమాదకరమైనదే అంటున్నారు నిపుణులు.లాంగ్యా హెనిపావైరస్​ కూడా.. కొవిడ్​ 19, నిఫా వంటి జూనోటిక్ వైరస్​ లాంటిదేనని వెల్లడించారు. ఈ వైరస్ చైనాలో ఇప్పటికే 35మందికి సోకినట్లు నివేదికలు చెప్తున్నాయి.

లాంగ్యా హెనిపా వైరస్ కాలేయం, మూత్రపిండాల సంక్రమణకు దారితీస్తుందనే ఆందోళనలు ఉన్నాయి. వైరస్ గురించిన వివరాలపై వెలుగునిస్తూ న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ (NEJM)లో చైనీస్, సింగపూర్ శాస్త్రవేత్తలు ఓ కథనాన్ని ప్రచురించారు.

ఈ వైరస్​ను ఎలా గుర్తించారు..

జ్వరం ఉన్న రోగుల గొంతులో LayVని గుర్తించారు. ఈ రోగులకు జంతువులకు ఇటీవలి చరిత్ర ఉన్నట్లు గుర్తించారు. ప్రాథమిక గుర్తింపు తర్వాత జరిపిన విచారణలో.. చైనాలోని రెండు ప్రావిన్సుల్లో లాంగ్యా వైరస్ సోకిన 35 మంది వ్యక్తులు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో 26 మంది రోగులకు లేవి ఇన్ఫెక్షన్ మాత్రమే ఉంది. ఇతర వ్యాధికారక కారకాలు లేవు. ఈ రోగుల నుంచి లాంగ్యా వైరస్ ప్రముఖ లక్షణాలను గుర్తించారు. ఈ వైరస్ హెనిపావైరస్ జాతికి చెందినది. ఇది హెండ్రా వైరస్ (HeV), నిఫా వైరస్ (NiV) వలె ఒకే కుటుంబానికి చెందినది.

రోగులలో గుర్తించిన లక్షణాలు ఇవే

* జ్వరం: 100 శాతం మంది రోగులలో

* అలసట: 54 శాతం

* దగ్గు: 50 శాతం

* అనోరెక్సియా: 50 శాతం

* మైయాల్జియా: 46 శాతం

* వికారం: 38 శాతం

* తలనొప్పి: 35 శాతం

* వాంతులు: 35 శాతం

* థ్రోంబోసైటోపెనియా అసాధారణతలు: 35 శాతం

* ల్యూకోపెనియా: 54 శాతం

* బలహీనమైన కాలేయం: 35 శాతం

* బలహీనమైన మూత్రపిండాలు: 8 శాతం

లాంగ్యా వైరస్ మనుషుల నుంచి మనిషికి వ్యాపిస్తుందా?

మానవ జనాభాలో లాంగ్యా వైరస్ ఇన్‌ఫెక్షన్ అప్పుడప్పుడు ఉన్నట్లు సూచిస్తుంది. ఏది ఏమైనప్పటికీ వైరస్ మానవుని నుంచి మానవునికి సంక్రమించే లోపానికి బలమైన సాక్ష్యాలేవి లేవు అంటున్నారు పరిశోధకులు. ఇది ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుందని మునుపటి నివేదికలు సూచించగా.. మనిషి నుంచి మనిషికి వ్యాపిస్తుందని ఇప్పటి వరకు రుజువు కాలేదు.

ఇది ఎంత ప్రమాదకరమైనది?

హెనిపావైరస్ జంతువులు, మానవులలో తీవ్రమైన వ్యాధిని కలిగిస్తాయి. అవి బయోసేఫ్టీ లెవల్ 4 వైరస్‌లుగా వర్గీకరించబడ్డాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డేటా ప్రకారం మరణాల రేట్లు 40-75 శాతం మధ్య ఉన్నాయి. ఇది కరోనావైరస్ కంటే చాలా ఎక్కువ.

చికిత్స అందుబాటులో ఉందా?

ప్రస్తుతం హెనిపావైరస్‌కు వ్యాక్సిన్ లేదా చికిత్స లేదు.

టాపిక్