Monkey Pox : వైరస్ సోకిన వ్యక్తి నుంచి పెట్స్​కి సంక్రమిస్తున్న మంకీపాక్స్..!-monkey pox in first suspected human to pet transmission ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Monkey Pox In First Suspected Human To Pet Transmission

Monkey Pox : వైరస్ సోకిన వ్యక్తి నుంచి పెట్స్​కి సంక్రమిస్తున్న మంకీపాక్స్..!

Geddam Vijaya Madhuri HT Telugu
Aug 16, 2022 10:01 AM IST

మంకీపాక్స్​తో పెంపుడు జంతువులకు ప్రమాదముందని.. కొత్త కేస్​ స్టడీలు తెలుపుతున్నాయి. వైరస్​తో బాధపడుతున్న వ్యక్తినుంచి.. అతను పెంచుకుంటున్న శునకానికి మంకీపాక్స్ సోకినట్లు గుర్తించారు. అందువల్ల వైరస్ సోకిన వ్యక్తులు వారి పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలని U.S. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ సూచిస్తుంది.

పెంపుడు జంతువులకు సోకుతున్న మంకీపాక్స్
పెంపుడు జంతువులకు సోకుతున్న మంకీపాక్స్

Monkey Pox : మంకీపాక్స్ వైరస్.. మనిషి నుంచి పెంపుడు జంతువుకు సంక్రమించిన మొదటి అనుమానిత కేసుకు సంబంధించిన సాక్ష్యాలను మెడికల్ జర్నల్ ప్రచురించింది. లాన్సెట్ ప్రకారం.. ఫ్రాన్స్‌లో ఇద్దరు వ్యక్తులకు మంకీపాక్స్ సోకింది. ఇద్దరు వ్యక్తులు తమ పెట్​ను దూరంగా ఉంచినా.. వారి మంచం మీద డాగ్​తో కలిసి పడుకున్నారు. వారితో పాటు నివసిస్తున్న శునకానికి 12 రోజుల తర్వాత మంకీపాక్స్ లక్షణాలు కనిపించడం ప్రారంభించాయి. వాటి పొత్తికడుపుపై ​​గాయాలు వంటి లక్షణాలను చూసిన తర్వాత టెస్ట్​లు చేయగా.. పాజిటివ్‌గా గుర్తించారు. DNA పరీక్ష చేసి.. మంకీపాక్స్ అని నిర్ధారించారు.

"మా పరిశోధనలు మంకీపాక్స్ వైరస్-పాజిటివ్ వ్యక్తుల నుంచి పెంపుడు జంతువులను వేరుచేయవలసిన అవసరం ఉంది" అని నివేదిక పేర్కొంది.

"వైరస్ సోకిన జంతువులు మంకీపాక్స్ వైరస్​ను ప్రజలకు వ్యాప్తి చేయగలవు. వ్యాధి సోకిన వ్యక్తులు వాటిని దగ్గరకు తీసుకున్నప్పుడు జంతువులకు మంకీపాక్స్ వైరస్​ వ్యాప్తి చెందే అవకాశముంది." అని మార్గదర్శకత్వం చెప్తుంది.

వ్యాధి సోకిన వారు తమ పెంపుడు జంతువులను కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టుకోవడం, నిద్రించే ప్రదేశాలను పంచుకోవడం, ఆహారం పంచుకోవడం వంటి కార్యకలాపాలకు దూరంగా ఉండాలని నివేదిక సూచిస్తుంది.

పెంపుడు జంతువులలో మంకీపాక్స్ లక్షణాలు

"నీరసం, ఆకలి లేకపోవడం, దగ్గు, నాసికా స్రావాలు లేదా పొట్టు, ఉబ్బరం, జ్వరం /లేదా మొటిమలు లేదా పొక్కు వంటి చర్మపు దద్దుర్లు" వంటి అనారోగ్య సంకేతాలు ఉంటాయని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) హెచ్చరించింది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్