Monkeypox A.2 : వేరియంట్స్ మారుస్తున్న మంకీపాక్స్.. ముందు రెండు కేసులు అవే..-monkeypox a 2 strain detain in inidia here is the symptoms ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Monkeypox A.2 Strain Detain In Inidia Here Is The Symptoms

Monkeypox A.2 : వేరియంట్స్ మారుస్తున్న మంకీపాక్స్.. ముందు రెండు కేసులు అవే..

Geddam Vijaya Madhuri HT Telugu
Aug 10, 2022 08:30 AM IST

Monkeypox A.2 Strain : మంకీపాక్స్ వైరస్ కేసుల తాజా అప్‌డేట్‌లో భాగంగా.. ICMR, NIV విశ్లేషణను నిర్వహించింది. దీనిలో భాగంగా భారతదేశంలో నిర్ధారణ అయిన మొదటి రెండు మంకీపాక్స్ కేసులు A.2 వైరస్ జాతికి చెందినవిగా గుర్తించారు. ఇండియాలో ఇప్పటివరకు తొమ్మిది మంకీపాక్స్ కేసులు నమోదుకాగా.. వైరల్ జూనోసిస్ ఇన్ఫెక్షన్​తో ఒకరు మృతి చెందారు.

monkey pox A.2 లక్షణాలు
monkey pox A.2 లక్షణాలు

Monkeypox A.2 Strain : ప్రపంచం ఇప్పుడిప్పుడే కొవిడ్ నుంచి కోలుకుంటుంది. ఈలోగా మంకీపాక్స్ కూడా వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. 80కి పైగా దేశాల్లో ఇప్పటి వరకు మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ఇండియాలో కూడా ఇప్పటికే తొమ్మిది కేసులు నమోదయ్యాయి. దీనిలో భాగంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) ఈ కేసులపై విశ్లేషణ నిర్వహించింది. ఈ విశ్లేషణలో భారతదేశంలో నిర్ధారణ అయిన మొదటి రెండు మంకీపాక్స్ కేసులు A.2 వైరస్ స్ట్రెయిన్‌తో సంక్రమించాయని వారు కనుగొన్నారు.

జూలై 23వ తేదీన ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్‌ ప్రపంచవ్యాప్త వ్యాప్తిని పరిగణనలోకి తీసుకుని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ముప్పు పొంచి ఉన్నందున కేంద్రం అప్రమత్తతను పెంచింది. అలాగే సవరించిన మార్గదర్శకాలను జారీ చేసింది.

మంకీపాక్స్ వైరస్ అంటే ఏమిటి?

ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 80కి పైగా దేశాల్లో 25,000 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. మంకీపాక్స్ అనేది ఒక వైరల్ వ్యాధి. దీనిని 1958లో కనుగొన్నారు. ఇవి కోతులనుంచి మనుషులకు సంక్రమించినట్లు కనుగొన్నారు. WHO ప్రకారం.. 1970లో 9 నెలల బాలుడిలో మంకీపాక్స్ లక్షణాలు గుర్తించారు. ఇదే మానవ సంక్రమణకు సంబంధించిన మొదటి కేసు. మంకీపాక్స్ అనేది పోక్స్విరిడే కుటుంబానికి చెందిన డబుల్ స్టాండర్డ్ DNA ఆర్థోపాక్స్ వైరస్. మంకీ వైరస్ అనేది వైరల్ జోప్నోసిస్. ఇది జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. మంకీపాక్స్ వైరస్ లక్షణాలు తలనొప్పి, జ్వరం, ముక్కు దిబ్బడ, శరీర నొప్పులు, పాక్స్ అని పిలిచే దద్దుర్లు.

మంకీపాక్స్ స్ట్రెయిన్ A.2 లక్షణాలు

ప్రస్తుత వ్యాప్తి మంకీపాక్స్ వైరస్ B.1 జాతి ద్వారా జరుగుతుంది. అయితే మంకీపాక్స్ A.2 స్ట్రెయిన్ జ్వరసంబంధమైన వ్యాధి. అంతేకాకుండా శోషరస కణుపుల వాపు, తలనొప్పి, వెసిక్యులర్ లేదా పస్టులర్ దద్దుర్లు. 5-13 రోజుల తర్వాత వ్యాధికి సంబంధించిన ప్రారంభ లక్షణాలు కనిపిస్తాయి.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. దద్దుర్లు ముఖం, జననేంద్రియ లేదా పెరియానల్ ప్రాంతం నుంచి మొదలవుతాయి. తరువాత శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తాయి.

మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలంటే..

* మీకు వీలైనంత వరకు బహిరంగ ప్రదేశాలను ఉపయోగించడం మానేయండి. లేదా ఉపయోగించే ముందు సరిగ్గా శుభ్రం చేయండి.

* వైరస్ సోకే అవకాశం ఉన్న వారితో చర్మ సంపర్కాన్ని నివారించండి. అంటే షేక్ హ్యాండ్ ఇవ్వడం, కలిసి తిరగడం వంటివి మానేయండి.

* వ్యక్తిగత విషయాలను పంచుకోవడం మానేయండి.

* మీ చేతులను ఎప్పటికప్పుడు కడగడం, శుభ్రం చేయడం ప్రారంభించండి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్