తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  King Charles Iii Coronation : లండన్​లో అట్టహాసంగా కింగ్​ ఛార్లెస్​ 3 పట్టాభిషేకం

King Charles III coronation : లండన్​లో అట్టహాసంగా కింగ్​ ఛార్లెస్​ 3 పట్టాభిషేకం

Sharath Chitturi HT Telugu

06 May 2023, 17:19 IST

google News
    • King Charles III coronation : లండన్​లో కింగ్​ ఛార్లెస్​ 3 పట్టాభిషేకం అట్టహాసంగా జరిగింది. 2300మంది అతిథులు ఈ వేడుకకు హాజరయ్యారు.
కింగ్​ ఛార్లెస్​ 3 పట్టాభిషేకం..
కింగ్​ ఛార్లెస్​ 3 పట్టాభిషేకం.. (AFP)

కింగ్​ ఛార్లెస్​ 3 పట్టాభిషేకం..

King Charles 3 coronation : బ్రిటన్​లో కింగ్​ ఛార్లెస్​ 3 పట్టాభిషేకం శనివారం అట్టహాసంగా జరిగింది. వేలాది మంది అతిథులు, లక్షలాది మంది బ్రిటన్​వాసులు వీక్షిస్తుండగా రాజ కిరీటాన్ని ధరించారు కింగ్​ ఛార్లెస్​ 3. 7 దశాబ్దాల్లోనే అతిపెద్ద ఈవెంట్​ను బ్రిటన్​వాసులు ఆద్యంతం వీక్షించారు. 1000ఏళ్ల నాటి ఈ ఆచారాన్ని.. 21వ శతాబ్దపు బ్రిటన్​ను​ ప్రతిబింబించే విధంగా ఈ వేడుకను తీర్చిదిద్దారు. తాజా వేడుకలతో లండన్​ వీధులు కిక్కిరిసిపోయాయి.

2300 మంది అతిథుల మధ్య..

లండన్​ వెస్ట్​మినిస్టర్​ అబేలో ఈ వేడుకలు జరిగాయి. విదేశీ నేతలు, ప్రముఖులు సహా దాదాపు 2,300 మంది అతిథులు ఈ ఈవెంట్​లో పాల్గొన్నారు. భారత దేశం తరపున ఉపరాష్ట్రపతి జగ్​దీప్​ ధన్​ఖడ్​, ఆయన సతీమణి ఈ వేడుకలకు హాజరయ్యారు. రాజ కుటుంబ నుంచి విడిపోయిన ప్రిన్స్​ హ్యారీ సైతం ఈ వేడుకలో పాలుపంచుకున్నారు. కాగా.. ఆయన భార్య, పిల్లలు వేడుకలకు దూరంగా ఉండిపోయారు.

కింగ్​ ఛార్లెస్​ 3

King Charles 3 coronation live updates : గతేడాది సెప్టెంబర్​లో​ క్వీన్​ ఎలిజబెత్​ 2 మరణంతో బ్రిటన్​ తదుపరి రాజుగా చరిత్రలో నిలిచారు 74ఏళ్ల ఛార్లెస్​. తాజాగా ఆయనకి పట్టాభిషేకం చేయడంతో.. ఛార్లెస్​ రెండో భార్య, 75ఏళ్ల కమీలియా.. 'రాణిగా' మారారు.

ఈ వేడుకలో బ్రిటన్​ ప్రధాని రిషి సునక్​.. బైబిల్​ని చదివారు. హిందువు అయిన సునక్​.. బైబిల్​ను చదవడం భిన్న మత విశ్వాసాలను రాజకుటుంబం ప్రోత్సహిస్తుందనడానికి నిదర్శనం అని అధికారులు చెప్పారు. 'ఇది మన చరిత్ర, సంస్కృతి, సంప్రదాయానికి గర్వకారణం,' అని ఛార్లెస్​ పట్టాభిషేకాన్ని అభివర్ణించారు రిషి సునక్​.

కింగ్​ ఛార్లెస్​ 3 పట్టాభిషేకం

King Charles 3 latest news : తాజా పట్టాభిషేకంతో.. బ్రిటన్​తో పాటు 14 కామెన్​వెల్త్​ దేశాలకు రాజు అయ్యారు ఛార్లేస్​ 3. మరోవైపు ఛార్లెస్​ 3కి కిరీటం ధరిస్తుండగా.. బ్రిటన్​వ్యాప్తంగా టపాసులు పేలాయి. గౌరవార్ధంగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి సెల్యూట్​ చేశారు.

మరోవైపు.. అనేకమంది రిపబ్లిక్​ యాక్టివిస్ట్​లు ఛార్లెస్​ 3 పట్టాభిషేకానికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు. ‘నాట్​ మై కింగ్​ (నా రాజు కాదు)..’ అంటూ నినాదాలు చేశారు. వీరిలో పలువురిని పోలీసులు అరెస్ట్​ చేశారు.

తదుపరి వ్యాసం