King Charles coronation: మే 6న కింగ్ చార్లెస్ పట్టాభిషేకం
11 October 2022, 23:25 IST
బ్రిటన్ మహారాజుగా కింగ్ చార్లెస్ 3 కి వచ్చే సంవత్సరం మే 6వ తేదీన పట్టాభిషేకం జరగనుంది.
కింగ్ చార్లెస్
King Charles coronation: క్వీన్ ఎలిజబెత్ మరణానంతరం, కింగ్ చార్లెస్ తదుపరి మహారాజుగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన మహారాజుగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే, లాంఛనంగా బ్రిటన్ మహారాజుగా కింగ్ చార్లెస్ కు పట్టాభిషేకం చేసే కార్యక్రమం మిగిలే ఉంది.
King Charles coronation: 2023,మే 6న..
బ్రిటన్ తదుపరి మహారాజుగా కింగ్ చార్లెస్ వచ్చే సంవత్సరం మే నెల 6వ తేదన పట్టాభిషక్తులు కానున్నారని బకింగ్ హమ్ ప్యాలెస్ మంగళవారం ప్రకటించింది. లండన్ లోని వెస్ మినిస్టర్ అబే లో ఈ కార్యక్రమం జరుగుతుందని వెల్లడించింది. ఆ రోజు కింగ్ చార్లెస్ కు ఆర్చ్ బిషప్ ఆఫ్ కాంటర్బరీ కిరీట ధారణ చేసి, ఆశీర్వదిస్తారని బకింగ్ హమ్ పాలెస్ ఒక ప్రకటనలో తెలిపింది. దాదాపు గత వెయ్యి సంవత్సరాలుగా కొనసాగుతున్న సంప్రదాయ విధానంలోనే పట్టాభిషేక కార్యక్రమం ఉంటుందని వెల్లడించింది. కింగ్ చార్లెస్ వయస్సు 73 ఏళ్లు. గత నెలలో క్వీన్ ఎలిజబెత్ మరణించే వరకు ఆయన ప్రిన్స్ చార్లెస్ గా ఉన్నారు.
King Charles coronation: 1953లో క్వీన్ ఎలిజబెత్..
1953 జూన్ లో క్వీన్ ఎలిజబెత్ 2 మహారాణిగా పట్టాభిషక్తులు అయ్యారు. ఈ కార్యక్రమానికి రాజ్యం, చర్చ్, పార్లమెంటు, కామన్వెల్త్ దేశాల ప్రతినిధులు హాజరయ్యారు.