Queen Elizabeth funeral : క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలకు ఇంత భారీగా ఖర్చు చేశారా!
Cost of Queen Elizabeth funeral : క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలు సోమవారం జరిగాయి. ఆమెకు దేశాధినేతలు నివాళులర్పించారు. కాగా.. ఈ అంత్యక్రియల కోసం బ్రిటన్.. రూ. 90కోట్ల కన్నా ఎక్కువ ఖర్చు చేసినట్టు అంచనాలు వెలువడుతున్నాయి.
Cost of Queen Elizabeth funeral : క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియల కోసం ఎంత ఖర్చు చేశారు? ఈ ఖర్చుల భారం బ్రిటన్ ట్యాక్స్పేయర్స్దేనా? లేక రాజ కుటుంబం ఏమైనా చెల్లిస్తుందా? ఈ ప్రశ్నలకు ప్రస్తుతం ఎవరి దగ్గర సమాధానం లేదు. వీటిపై బ్రిటన్ ప్రభుత్వం ఇంకా స్పందించనూ లేదు. అయితే.. క్వీన్ ఎలిజబెత్ 11 రోజుల అంత్యక్రియల కార్యకలాపాల కోసం 10మిలియన్ పౌండ్ల ఖర్చు జరిగి ఉంటుందని అంచనాలు వెలువడుతున్నాయి. ఇండియా కరెన్సీతో పోల్చుకుంటే అది.. రూ. 90,72,05,300
ఎందుకింత ఖర్చు?
క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియల కోసం ప్రపంచవ్యాప్తంగా దేశాధినేతలు బ్రిటన్కు వెళ్లారు. వారందరు ఆమెకు నివాళుల్పించారు. ఇండియా నుంచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం యూకేకు వెళ్లారు. వీరితో పాటు అనేకమంది ప్రముఖులు బ్రిటన్కు వెళ్లి రాజ కుటుంబానికి సానుభూతి తెలిపారు. క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియల్లోని కార్యక్రమాలకు అయ్యే ఖర్చులు ఒక ఎత్తు అయితే.. వీరందరికి వసతి, భద్రతను కల్పించేందుకు అయ్యే డబ్బు మరో ఎత్తు. అందుకే అంత భారీగా ఖర్చు అయ్యుంటుందని అంచనాలు వెలువడుతున్నాయి.
Queen Elizabeth funeral : బ్రిటన్లో ఓ వ్యక్తికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతుండటం.. 60ఏళ్లల్లో ఇదే తొలిసారి! చివరిగా 1965లో విన్స్టన్ చర్చిల్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి.
అయితే.. 2002లో క్వీన్ ఎలిజబెత్ తల్లి అంత్యక్రియలు నిర్వహించారు. అప్పుడు 5.4మిలియన్ పౌండ్ల ఖర్చు అయ్యింది. ఆ ఖర్చులో సగం క్వీన్ ఎలిజబెత్ ఇచ్చారు. ఈసారి అలా జరగకపోవచ్చు ని బ్రిటన్ మీడియా సంస్థలు భావిస్తున్నాయి. క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలకు అయ్యే ఖర్చులన్నీ బ్రిటన్లోని పన్నుచెల్లింపుదారులే పెట్టుకుంటారని అభిప్రాయపడుతున్నాయి.
ఇంత భారీ ఖర్చుల గురించి పట్టించుకోవద్దని పలువురు బ్రిటన్వాసులు అభిప్రాయపడుతుండటం గమనార్హం. తమ రాణి అంత్యక్రియలకు ఎంతైనా ఖర్చు చేస్తామని వారు చెబుతున్నారు. ఇది దేశ గౌరవానికి సంబంధించిన విషయమని అంటున్నారు.
Queen Elizabeth funeral time : కాగా.. క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలకు అయ్యే ఖర్చులపై ఓ మాజీ రాయల్ సెక్యూరిటీ ఆఫీసర్ స్పందించారు. 7.5మిలియన్ డాలర్లు (రూ.59,78,58,000) ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఇదే నిజమైతే.. బ్రిటన్ చరిత్రలోనే అతి భారీ, అత్యంత ఖరీదైన కార్యక్రమం ఇదే అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
"2011లో ప్రిన్స్ ఆఫ్ వేల్స్ వివాహం జరిగింది. చాలా ఖర్చు చేశారు. కానీ క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలతో పోల్చుకుంటే.. ఆ ఖర్చులు చాలా తక్కువ," అని ఆ అధికారులు అన్నారు.
Queen Elizabeth death : కాగా.. క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలకు అయ్యే ఖర్చుల గురించి ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. భవిష్యత్తులో వివరణ ఇస్తుంది అని ఎవరికి నమ్మకం లేదు.
సంబంధిత కథనం