Queen Elizabeth death : క్వీన్​ ఎలిజబెత్​ 2 కన్నుమూత-queen elizabeth death at 96 after 70 years on the throne ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Queen Elizabeth Death At 96 After 70 Years On The Throne

Queen Elizabeth death : క్వీన్​ ఎలిజబెత్​ 2 కన్నుమూత

Sharath Chitturi HT Telugu
Sep 09, 2022 05:51 AM IST

Queen Elizabeth death : క్వీన్​ ఎలిజబెత్​ 2 తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం కారణంగా ఆమె మరణించారు.

క్వీన్​ ఎలిజబెత్​
క్వీన్​ ఎలిజబెత్​

Queen Elizabeth death : క్వీన్​ ఎలిజబెత్​ 2 కన్నుమూశారు. 96ఏళ్ల వయస్సులో ఆమె తుదిశ్వాస విడిచారు. వయస్సు రిత్యా వచ్చిన అనారోగ్యం కారణంగా బ్రిటన్​ కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం ఆమె మరణించినట్టు బకింగ్​హమ్​ ప్యాలెస్​ ఓ ప్రకటన విడుదల చేసింది.

రాణి ఎలిజబెత్​ 2 మరణంతో ఆమె పెద్ద కుమారుడు 73ఏళ్ల చార్లెస్​.. కింగ్​ చార్లెస్​ 3గా సింహాసనాన్ని అధిష్టించారు.

బ్రిటన్​ చరిత్రలో సుదీర్ఘకాలం రాణిగా కొనసాగారు ఎలిజబెత్​ 2. రాణి ఎలిజబెత్​ 2 ఆరోగ్యంపై గురువారం వార్తలు వెలువడిన కొన్ని గంటలకే.. ఆమె మరణవార్తపై బకింగ్​హమ్​ ప్యాలెస్​ ప్రకటన చేసింది.

Queen Elizabeth death in telugu : గతేడాది అక్టోబర్​ నుంచి క్వీన్​ ఎలిజబెత్​ 2 ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అప్పటి నుంచి.. నడవడం, నిలబడే సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

క్వీన్​ ఎలిజబెత్​.. తన ప్రవర్తన, తన మనస్తత్వంతో ఎందరికో చేరువయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలను పొందారు.

ప్రపంచ నేతల నివాళులు..

రాణి ఎలిజబెత్​ 2 మరణ వార్తపై ప్రపంచ దేశాధినేతలు స్పందించారు. ఆమె మరణానికి నివాళులర్పించారు.

Queen elizabeth death news : "వేగంగా మారిపోతున్న ప్రపంచంలో.. ఆమె(క్వీన్​ ఎలిజబెత్​ 2) స్థిరంగా తన ఉనికిని కొనసాగించారు. బ్రిటన్​వాసుల్లో కొన్ని తరాల వారికి ఆమె గౌరవంగా నిలించారు. ఆమె తప్ప ఇతర రాజులు, రాణులు తెలియనివారు.. ఆమెను చూసి గర్వించారు. బ్రిటన్​ చరిత్రలో ఆమెకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రపంచ కథలో ఆమెకు ప్రత్యేక స్థానం ఉంటుంది," అని అమెరికా అధ్యక్షుడు, ప్రథమ మహిళ జో బైడెన్​- జిల్​ బైడెన్​ ఓ ప్రకటన చేశారు.

"ప్రపంచవ్యాప్తంగా రాణి ఎలిజబెత్​కు ప్రేమ, గౌరవం దక్కింది. వాటిని ఆమె సంపాదించుకున్నారు. ఈ గడ్డు పరిస్థితులను ఎదుర్కొనేందుకు క్వీన్​ ఎలిజబెత్​ కుటుంబానికి ధైర్యాన్ని ప్రసాదించాలని నేను ప్రార్థిస్తున్నాను. ఆమె కుటుంబసభ్యులు, బ్రిటన్​ ప్రజలకు నా ప్రగాఢ సానుభూతి," అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​ పేర్కొన్నారు.

"మన కాలంలో మెజెస్టీ క్వీన్​ ఎలిజబెత్​ 2 ఒక దిగ్గజంగా నిలిచిపోతారు. తన జాతికి, తన ప్రజలకు ఆమె స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ప్రజల జీవితాలను మెరుగుపరిచారు. ఆమె మరణవార్త విని బాధ కలిగింది. ఆమె కుటుంబసభ్యులు, బ్రిటన్​ ప్రజలకు నా సానుభూతి," అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం