Queen’s funeral: క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలకు హాజరు కానున్న రాష్ట్రపతి ముర్ము
President Murmu to join 500 world leaders at Queen’s funeral: దివంగత బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబెత్ II అంత్యక్రియలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరు కానున్నారు. భారత ప్రభుత్వం తరఫున ఆమె ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
President Murmu to join 500 world leaders at Queen’s funeral: దివంగత బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబెత్ II అంత్యక్రియలు సెప్టెంబర్ 19 సోమవారం జరగనున్నాయి. బ్రిటన్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రపంచం నలు మూలల నుంచి దాదాపు 500 మంది అత్యంత ప్రముఖులు హాజరు కానున్నారు. వారిలో దేశాధినేతలు, ప్రధానులు, మహారాజులు, మహారాణులు ఉన్నారు. బకింగ్ హమ్ పాలెస్ నుంచి వెస్ట్ మినిస్టర్ హాల్ కు బుధవారం క్వీన్ ఎలిజబెత్ పార్థివ దేహాన్ని అధికారిక లాంఛనాల మధ్య తరలించారు.
President Murmu to join 500 world leaders at Queen’s funeral: సోమవారం అంత్యక్రియలు
దివంగత బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబెత్ II అంత్యక్రియలు లండన్ లో సోమవారం ఉదయం 11 గంటలకు(స్థానిక కాలమానం ప్రకారం) జరగనున్నాయి. పూర్తి అధికారిక లాంఛనాలతో 57 ఏళ్ల తరువాత జరుగుతున్న మరో ఫ్యునరల్ కార్యక్రమం ఇది. యుద్ధ సమయంలో ప్రధానిగా ఉన్న విన్ స్టన్ చర్చిల్ అంత్యక్రియలు 1965లో పూర్తి అధికారిక లాంఛనాలతో జరిగాయి.
President Murmu to join 500 world leaders at Queen’s funeral: ద్రౌపది ముర్ము 3 రోజుల పర్యటన ష్కెడ్యూల్
క్వీన్ ఎలిజబెత్ II అంత్యక్రియలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరవుతున్నారని భారత విదేశాంగ శాఖ బుధవారం వెల్లడించింది. మూడు రోజుల పాటు ఆమె యూకేలో పర్యటిస్తారని తెలిపింది. ఈ సందర్భంగా, విదేశీ ప్రముఖుల కోసం బకింగ్ హమ్ పాలెస్ లో కింగ్ చార్లెస్ III ఆదివారం సాయంత్రం ఇచ్చే రిసెప్షన్ కార్యక్రమంలో ద్రౌపది ముర్ము పాల్గొంటారు. అంతకుముందు, బకింగ్ హమ్ పాలెస్ దగ్గరలోని లాంకాస్టర్ హౌజ్ లో ఉంచిన క్వీన్ ఎలిజబెత్ పార్థివ దేహాం వద్ద పుష్ప గుచ్ఛం ఉంచి, నివాళులర్పిస్తారు. అక్కడి సంతాప సందేశ పుస్తకంలో భారత ప్రభుత్వం తరఫున సంతాప సందేశం రాస్తారు. సోమవారం ఉదయం వెస్ట్ మినిస్టర్ ఆబీలో జరిగే క్వీన్ ఎలిజబెత్ ఫ్యునరల్ కార్యక్రమంలో పాల్గొంటారు.
President Murmu to join 500 world leaders at Queen’s funeral: రష్యాకు పిలుపు లేదు
దివంగత బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబెత్ II అంత్యక్రియల్లో పాల్గొనాలన్న ఆహ్వానం రష్యాకు అందలేదు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలోనే బ్రిటన్ ఈ నిర్ణయం తీసుకుంది. రష్యాతో పాటు బెలారస్, మయన్మార్ లకు ఈ ఆహ్వానం అందలేదు. అంగ్ సాన్ సూకీని సైనిక చర్య ద్వారా పదవీచ్యుతురాలిని చేసిన నాటి నుంచి మయన్మార్ తో దౌత్య సంబంధాలను బ్రిటన్ వదిలేసింది.
President Murmu to join 500 world leaders at Queen’s funeral: హాజరవుతున్న ప్రముఖులు
క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలకు హాజరయ్య ప్రముఖుల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, న్యూజీలాండ్ ,కెనడా, ఆస్ట్రేలియా ప్రధానులు తదితరులు ఉన్నారు. బెల్జియం రాజు కింగ్ ఫిలిప్, స్వీడన్ రాజు కింగ్ కార్ల్ XVI గుస్తాఫ్, నెదర్లాండ్స్ రాజు కింగ్ విలియమ్ అలెగ్జాండర్, స్పెయిన్ రాజు కింగ్ ఫిలిప్ కూడా సతీ సమేతంగా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు.