PM Modi speaks to King Charles: కింగ్ చార్లెస్ కి ప్రధాని మోదీ ఫోన్ కాల్-pm modi speaks with king charles iii of uk discusses climate action ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Pm Modi Speaks To King Charles: కింగ్ చార్లెస్ కి ప్రధాని మోదీ ఫోన్ కాల్

PM Modi speaks to King Charles: కింగ్ చార్లెస్ కి ప్రధాని మోదీ ఫోన్ కాల్

HT Telugu Desk HT Telugu
Jan 03, 2023 09:13 PM IST

PM Modi news: ఇటీవల బ్రిటన్ రాజ్యాధికారం చేపట్టిన కింగ్ చార్లెస్ III కి ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

ప్రధాని మోదీ, బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III
ప్రధాని మోదీ, బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III

ప్రధాని మోదీ, బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III మంగళవారం అంతర్జాతీయంగా ప్రాముఖ్యత కలిగిన పలు కీలక అంశాలపై చర్చించారు. రాజుగా బాధ్యతలు చేపట్టిన కింగ్ చార్లెస్ III కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

PM Modi speaks to King Charles: ఇదే మొదటి సారి..

కింగ్ చార్లెస్ III రాజుగా బాధ్యతలు చేపట్టిన తరువాత ప్రధాని మోదీతో మాట్లాడడం ఇదే ప్రథమం. ఈ సందర్భంగా ఇరువురు నేతల మధ్య పలు అంశాలపై చర్చ జరిగింది. అంతర్జాతీయ రాజకీయ పరిణామాలతో పాటు వాతావరణ మార్పు, బయోడైవర్సిటీ తదితర అంశాలపై వారు చర్చలు జరిపారు. ఈ అంశాలపై కింగ్ చార్లెస్ ఆసక్తిని, సంబంధిత సమస్యల పరిష్కారం కోసం ఆయన చూపే చొరవను ప్రధాని మోదీ కొనియాడారు. కామన్వెల్త్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఇరువురు నేతలు చర్చించారు. యకే లోని భారతీయులు ఇరు దేశాల మధ్య సుసంబంధాలకు సజీవ వారధులని వారు పేర్కొన్నారు.

PM Modi speaks to King Charles: జీ 20 బాధ్యతలు తీసుకున్న తరువాత..

ప్రస్తుతం జీ 20 (G20) అధ్యక్ష బాధ్యతలను భారత్ నిర్వర్తిస్తోన్న విషయం తెలిసిందే. జీ 20 కి సంబంధించి భారతదేశ ప్రాథమ్యాలను కింగ్ చార్లెస్ కు ప్రధాని మోదీ వివరించారు. ‘లైఫ్’(LiFE - Lifestyle for Environment) కోసం భారత్ చేస్తున్న కృషి ని వివరించారు.వాతావరణ అనుకూల జీవన విధానం అవలంబించడానికి ప్రపంచ ప్రజలను సమాయత్త పరిచే లక్ష్యంతో ఈ లైఫ్ (LiFE - Lifestyle for Environment) ను ప్రారంభించారు. భారత్, బ్రిటన్ ల మధ్య కీలక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్(Free Trade Agreement FTA) చర్చలు తుది దశకు వచ్చిన సందర్భంగా ఈ నాయకులిద్దరి మధ్య ఈ చర్చలు జరగడం గమనార్హం.

Whats_app_banner

టాపిక్