తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Crime News: ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చిన విదేశీ మహిళపై అత్యాచారం, నిందితుడి అరెస్ట్

Crime news: ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చిన విదేశీ మహిళపై అత్యాచారం, నిందితుడి అరెస్ట్

HT Telugu Desk HT Telugu

16 July 2024, 20:42 IST

google News
  • Crime news: ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చిన ఒక విదేశీ మహిళపై ఆ ఆసుపత్రిలో ఉద్యోగి గా ఉన్న వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. చికిత్స లో భాగంగా మత్తు టాబ్లెట్ వేసుకుని పడుకున్న ఆ 50 ఏళ్ల మహిళపై అత్యచారానికి తెగబడ్డాడు. ప్రస్తుతం కటకటాల పాలయ్యాడు.

కజకిస్తాన్ మహిళపై అత్యాచారం
కజకిస్తాన్ మహిళపై అత్యాచారం

కజకిస్తాన్ మహిళపై అత్యాచారం

Crime news: మోకాలి శస్త్రచికిత్స అనంతరం చికిత్స పొందుతున్న కజకిస్థాన్ కు చెందిన 50 ఏళ్ల మహిళపై అత్యాచారానికి పాల్పడిన గురుగ్రామ్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి ఉద్యోగిని గురుగ్రామ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం ఉదయం ఆర్టెమిస్ ఆసుపత్రిలో ఈ అత్యాచారం ఘటన జరిగిందని, అదే రోజు నిందితుడు ఠాకూర్ ను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. నిందితుడు ఠాకూర్ రాజస్థాన్ లోని తిజారా జిల్లా ఖైర్తాల్ కు చెందిన వాడని వెల్లడించారు.

మోకాలి శస్త్రచికిత్స కోసం వచ్చి..

మోకాలి శస్త్రచికిత్స కోసం జూలై 9న ఆ మహిళ ఆసుపత్రిలో చేరినట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. జూలై 13న ఆమెకు శస్త్రచికిత్స చేయగా ఆమె ఆసుపత్రిలోని గదిలో ఒంటరిగా ఉంది. తెల్లవారుజామున మత్తులో ఉన్న ఆమెపై అదే ఆసుపత్రిలో అటెండర్ పని చేస్తున్న ఠాకూర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ మహిళ కేకలు వేయడంతో పారిపోయాడు. అనంతరం తన కూతురికి విషయం చెప్పగా వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

నిందితుడి అరెస్ట్

సెక్టార్ 50 పోలీస్ స్టేషన్ కు చెందిన ఒక బృందం సంఘటనా స్థలానికి చేరుకుని, మహిళ వాంగ్మూలాన్ని నమోదు చేసిందని, బీఎన్ఎస్ సెక్షన్ 64 (2) (ఇ) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆర్టెమిస్ హాస్పిటల్ ఎల్లప్పుడూ తమ రోగుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తుందని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. విచారణ పూర్తయ్యేంత వరకు నిందితుడు విధులకు దూరంగా ఉంటారని తెలిపింది.

తదుపరి వ్యాసం