JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ వాయిదా- పూర్తి వివరాలు..
21 April 2024, 11:08 IST
- JEE Advanced 2024 registration date : జేఈఈ అడ్వాన్స్డ్ 2024 అభ్యర్థులకు అలర్ట్. జేఈఈ అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ వాయిదా పడింది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
జేఈఈ అడ్వాన్స్డ్ అభ్యర్థులకు అలర్ట్..
JEE Advanced 2024 registration : జేఈఈ అడ్వాన్స్డ్ 2024 రిజిస్ట్రేషన్ ప్రక్రియను వాయిదా వేసింది ఐఐటీ మద్రాస్. ఏప్రిల్ 21న ప్రారంభం కావాల్సిన ఐఐటీ జేఈఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ వాయిదా పడగా.. 2024 ఏప్రిల్ 27న ప్రారంభం కానుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు jeeadv.ac.in జేఈఈ అడ్వాన్స్డ్ అధికారిక వెబ్‌సైట్‌ని చూడవచ్చు.
జేఈఈ అడ్వాన్స్ 2024 వివరాలు..
ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను పూర్తి చేసేందుకు చివరి తేదీ.. 7 మే 2024. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు.. ఫీజు చెల్లించడానికి చివరి తేదీ మే 10, 2024.
జేఈఈ అడ్వాన్స్డ్ అడ్మిట్ కార్డును మే 17న విడుదల చేస్తామని, మే 26, 2024 వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది ఐఐటీ మద్రాస్.
JEE Advanced 2024 apply online : జేఈఈ అడ్వాన్స్ డ్ 2024 పరీక్షను మే 26న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్ 2ను మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండు షిఫ్టుల్లో నిర్వహిస్తారు.
ఐఐటీ జేఈఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి జేఈఈ (మెయిన్) 2024 బీఈ/బీటెక్ పేపర్లో టాప్ 2,50,000 మంది (అన్ని కేటగిరీలతో సహా) అభ్యర్థుల్లో ఒకరుగా ఉండాలి. అభ్యర్థులు అక్టోబర్ 1, 1999 తర్వాత జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఐదేళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది. అంటే ఈ అభ్యర్థులు 1994 అక్టోబర్ 1 లేదా ఆ తర్వాత జన్మించి ఉండాలి.
ఇదీ చూడండి:- UGC NET June 2024: యూజీసీ నెట్ జూన్ సెషన్ కు రిజిస్ట్రేషన్స్ ప్రారంభం; లాస్ట్ డేట్ ఎప్పుడంటే..?
జేఈఈ అడ్వాన్స్ డ్ 2024: ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
JEE Advanced 2024 registration fee : ఐఐటీ జేఈఈ అడ్వాన్స్డ్ 2024కి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులైన అభ్యర్థులందరూ ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వొచ్చు.
- స్టెప్ 1:- jeeadv.ac.in జేఈఈ అడ్వాన్స్డ్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
- స్టెప్ 2:- హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న జేఈఈ అడ్వాన్స్డ్ 2024 రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.
- స్టెప్ 3:- రిజిస్ట్రేషన్ వివరాలు ఎంటర్ చేసి సబ్మీట్ బటన్‌పై క్లిక్ చేయాలి.
- JEE Advanced 2024 : స్టెప్ 4:- ఇప్పుడు అకౌంట్లోకి లాగిన్ అయి అప్లికేషన్ ఫామ్ నింపాలి.
- స్టెప్ 5:- అప్లికేషన్ ఫీజు చెల్లించి సబ్మిట్పై క్లిక్ చేయాలి.
- స్టెప్ 6:- పేజీని డౌన్లోడ్ చేయండి, తదుపరి ఉపయోగం కోసం దాని హార్డ్ కాపీని ఉంచండి.
How to apply for JEE Advanced 2024 registration : మహిళా అభ్యర్థులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.1600, ఇతర అభ్యర్థులు భారతీయులు రూ.3200. ఆన్లైన్ ఫీజు చెల్లించాలి. మరిన్ని వివరాలకు అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్డ్ అధికారిక వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు.. ఎప్పటికప్పుడు సైట్‌ని ఫాలో అవుతూ ఉండాలి.