JEE Advanced 2023 admit card : జేఈఈ అడ్వాన్స్డ్ అడ్మిట్ కార్డులను ఇలా డౌన్లోడ్ చేసుకోండి..
28 May 2023, 9:26 IST
- JEE Advanced 2023 admit card : జేఈఈ అడ్వాన్స్డ్ 2023 పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు సోమవారం విడుదలకానన్నాయి. వాటిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.
జేఈఈ అడ్వాన్స్డ్ అడ్మిట్ కార్డులను ఇలా డౌన్లోడ్ చేసుకోండి..
JEE Advanced 2023 admit card : జేఈఈ (జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్) అడ్వాన్స్డ్ 2023 అడ్మిట్ కార్డులను సోమవారం విడుదల చేయనుంది ఐఐటీ గువాహటి. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను జేఈఈ అధికారిక వెబ్సైట్ jeeadv.ac.in లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష జూన్ 4న జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 5:30 గంటల వరకు పేపర్ 2 పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థుల రెస్పాన్స్ కాపీలను జూన్ 9 వెబ్సైట్లో ఉంచుతుంది. ఆన్సర్ కీ జూన్ 11న విడుదలవుతుంది.
జేఈఈ అడ్వాన్స్డ్ 2023 అడ్మిట్ కార్డులను ఇలా డౌన్లోడ్ చేసుకోండి..
స్టెప్ 1:- జేఈఈ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లండి.
స్టెప్ 1:- హోం పేజ్‌పై 'అడ్మిట్ కార్డు' లింక్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి.
ఇదీ చూడండి:- JEE Main 2023 Paper 2 result: జేఈఈ మెయిన్ పేపర్ 2 ఫలితాల వెల్లడి; రిజల్ట్ ను ఇలా చెక్ చేసుకోండి..
స్టెప్ 1:- మీ లాగిన్ వివరాలు సబ్మీట్ చేయండి.
స్టెప్ 1:- స్క్రీన్‌పై మీ అడ్మిట్ కార్డు డిస్ప్లే అవుతుంది.
స్టెప్ 1:- అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకుని ప్రింటౌట్ తీసుకోండి.