తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Jee Mains 2023 Updates: జేఈఈ మెయిన్స్ ఫలితాల పూర్తి వివరాలు ఇవే..

JEE Mains 2023 updates: జేఈఈ మెయిన్స్ ఫలితాల పూర్తి వివరాలు ఇవే..

HT Telugu Desk HT Telugu

27 April 2023, 17:44 IST

    • JEE Mains 2023 updates: జేఈఈ మెయిన్స్ సెషన్ 2 () ఫలితాలను ఎన్టీఏ త్వరలో విడుదల చేయనుంది. ఏప్రిల్ నెలాఖరులోగా ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

JEE Mains 2023 updates: జేఈఈ మెయిన్స్ 2023 (JEE Mains 2023) ఫలితాలను jeemain.nta.nic.in వెబ్ సైట్ లో, nta.ac.in. వెబ్ సైట్ లో విద్యార్థులు చెక్ చేసుకోవచ్చు. జేఈఈ పరీక్షలను ఎన్టీఏ (National Testing Agency, NTA) నిర్వహిస్తుంది. జేఈఈ మెయిన్స్ 2023 (JEE Mains 2023) ఫలితాలతో పాటు టాపర్స్ వివరాలను (toppers), కటాఫ్ మార్క్స్ (cut off marks) ను, పర్సంటైల్ (percentile) తదితర వివరాలను కూడా ఎన్టీఏ (NTA) వెల్లడిస్తుంది. జేఈఈ మెయిన్స్ ఫలితాల అనంతరం రీ వాల్యుయేషన్ కు అవకాశం ఉండదు. జేఈఈ మెయిన్స్ స్కోర్ కార్డ్ లో మేథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో సాధించిన స్కోర్స్ తో పాటు మొత్తం స్కోర్ ఉంటుంది. అలాగే, విద్యార్థి సాధించిన ఆల్ ఇండియా ర్యాంక్ కూడా స్కోర్ కార్డ్ పై ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు

Cricket ball : జననాంగాలకు క్రికెట్​ బాల్​ తాకి.. 11ఏళ్ల బాలుడు మృతి!

Houston floods : టెక్సాస్​- హూస్టన్​ని ముంచెత్తిన వరద.. భయం గుప్పిట్లో ప్రజలు

ICSE results 2024 : ఐసీఎస్​ఈ క్లాస్​ 10, ఐఎస్సీ క్లాస్​ 12 ఫలితాలు విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

JEE Mains 2023 updates: సెషన్ 2 వివరాలు..

జేఈఈ మెయిన్స్ 2023 సెషన్ 2 పరీక్షలు ఏప్రిల్ 6, 8, 10, 11, 12, 13, 15 తేదీల్లో జరిగాయి. ఏప్రిల్ 19న ఆన్సర్ కీ (answer key) ని, ఏప్రిల్ 24న ఫైనల్ ప్రొవిజనల్ ఆన్సర్ కీ (final provisional answer key)ని ఎన్టీఏ విడుదల చేసింది. ఫలితాలను చెక్ చేసుకున్న తరువాత జేఈఈ అడ్వాన్స్ డ్ కు నిర్ధారించిన కటాఫ్ మార్క్స్ ను పొందిన విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్ డ్ అనే ఐఐటీ అడ్మిషన్ టెస్ట్ కు అప్లై చేసుకోవచ్చు. అలాగే, జేఈఈ మెయిన్స్ 2023 ఫలితాల ఆధారంగా ఎన్ఐటీ (NIT), ఐఐఐటీ (IIIT) ల్లో అడ్మిషన్ కోరుకునే విద్యార్థులు JoSAA, CSAB కౌన్సెలింగ్ కు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. జేఈఈ అడ్వాన్స్ డ్ (JEE Advanced 2023) పరీక్ష ఫలితాలు వెలువడిన తరువాత ఐఐటీల్లో అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. జేఈఈ అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 30వ తేదీన ప్రారంభమవుతుంది. విద్యార్థులు jeeadv.ac.in. వెబ్ సైట్ ద్వారా జేఈఈ అడ్వాన్స్డ్ (JEE Advanced 2023) పరీక్షకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం జేఈఈ అడ్వాన్స్డ్ (JEE Advanced 2023) పరీక్షను ఐఐటీ గువాహటి నిర్వహిస్తోంది. (IIT Guwahati)