JEE Mains Final answer key: జేఈఈ మెయిన్ ఆన్సర్ కీని ఇలా చెక్ చేసుకోండి..-jee mains 2023 final provisional answer key released at jeemain nta nic in get link ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Jee Mains Final Answer Key: జేఈఈ మెయిన్ ఆన్సర్ కీని ఇలా చెక్ చేసుకోండి..

JEE Mains Final answer key: జేఈఈ మెయిన్ ఆన్సర్ కీని ఇలా చెక్ చేసుకోండి..

HT Telugu Desk HT Telugu

JEE Mains Final answer key: జేఈఈ మెయిన్స్ 2023 సెషన్ 2 ఫైనల్ ప్రొవిజనల్ ఆన్సర్ కీ (JEE Mains 2023 Final Provisional answer key) ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది.

ప్రతీకాత్మక చిత్రం

JEE Mains Final answer key: జేఈఈ మెయిన్స్ 2023 సెషన్ 2 ఫైనల్ ప్రొవిజనల్ ఆన్సర్ కీ (JEE Mains 2023 Final Provisional answer key) ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది.

JEE Mains Final answer key: చెక్ చేసుకోవడం ఎలా?

జేఈఈ మెయిన్స్ 2023 సెషన్ 2 ఫైనల్ ప్రొవిజనల్ ఆన్సర్ కీ (JEE Mains 2023 Final Provisional answer key) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అధికారిక వెబ్ సైట్ jeemain.nta.nic.in లో ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఈ ప్రవేశ పరీక్ష రాసిన విద్యార్థులు jeemain.nta.nic.in లో తమ వివరాలు నమోదు చేసి ఫైనల్ ఆన్సర్ కీని చెక్ చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్ష ఏప్రిల్ 6, 8, 10, 11, 12, 13, 15 తేదీల్లో దేశవ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరిగింది. ఈ పరీక్షకు సంబంధించి ఎన్టీఏ విడుదల చేసిన ఫైనల్ ప్రొవిజనల్ ఆన్సర్ కీలో 10 ప్రశ్నలకు ఎన్టీఏ (NTA) తొలిగించింది. ఈ క్రింది స్టెప్ట్ ఫాలో అవడం ద్వారా ఫైనల్ ఆన్సర్ కీ ని విద్యార్థులు పరిశీలించవచ్చు.

  • మొదట అధికారిక వెబ్ సైట్ jeemain.nta.nic.in ను ఓపెన్ చేయాలి.
  • హోం పేజీ పై కనిపించే జేఈఈ 2023 సెషన్ 2 ఫైనల్ ప్రొవిజనల్ ఆన్సర్ కీ (JEE – 2023 Session 2 Final Provisional Answer Key) ’ పై క్లిక్ చేయాలి.
  • ఒక కొత్త పీడీఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది.
  • మీ ఆన్సర్ కీతో సరిపోల్చుకుని, అవసరం అనుకుంటే డౌన్ లోడ్ చేసుకోవాలి.

Here's the direct link to download the answer keys

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.