JEE Main 2023 Paper 2 result: జేఈఈ మెయిన్ పేపర్ 2 ఫలితాల వెల్లడి; రిజల్ట్ ను ఇలా చెక్ చేసుకోండి..-jee main 2023 paper 2 result declared check direct link ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Jee Main 2023 Paper 2 Result Declared, Check Direct Link

JEE Main 2023 Paper 2 result: జేఈఈ మెయిన్ పేపర్ 2 ఫలితాల వెల్లడి; రిజల్ట్ ను ఇలా చెక్ చేసుకోండి..

HT Telugu Desk HT Telugu
May 25, 2023 03:39 PM IST

JEE Main 2023 Paper 2 result: జేఈఈ మెయిన్ 2023 పేపర్ 2 (JEE Main 2023 Paper 2) ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) గురువారం విడుదల చేసింది. అధికారిక వెబ్ సైట్ jeemain.nta.nic.in. ద్వారా ఈ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

JEE Main 2023 Paper 2 result: జేఈఈ మెయిన్ 2023 పేపర్ 2 (JEE Main 2023 Paper 2) ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) గురువారం విడుదల చేసింది. అధికారిక వెబ్ సైట్ jeemain.nta.nic.in. ద్వారా ఈ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్ 2023 పేపర్ 2 బీ ఆర్క్(BArch), బీ ప్లానింగ్ (BPlanning) కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన పరీక్ష.

ట్రెండింగ్ వార్తలు

ఏప్రిల్ 12న పరీక్ష

బీ ప్లానింగ్ (BPlanning) కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన జేఈఈ మెయిన్ 2023 పేపర్ 2 (JEE Main 2023 Paper 2) పరీక్షను ఏప్రిల్ 12వ తేదీన నిర్వహించారు. ఈ పరీక్ష ఫలితాలను గురువారం ఎన్టీఏ విడుదల చేసింది. ఈ పరీక్ష రాసిన విద్యార్థులు jeemain.nta.nic.in వెబ్ సైట్ లో తమ ఫలితాలను చూసుకోవచ్చు.

Check results: ఇలా చెక్ చేసుకోండి..

జేఈఈ మెయిన్ 2023 పేపర్ 2 పరీక్ష ఫలితాలను ఈ కింది స్టెప్స్ ఫాలో కావడం ద్వారా చూసుకోవచ్చు.

  • ముందుగా జేఈఈ అధికారిక వెబ్ సైట్ jeemain.nta.nic.in ను ఓపెన్ చేయాలి.
  • రిజల్ట్ (result) ట్యాబ్ పై క్లిక్ చేయాలి.
  • అడ్మిట్ కార్డ్ నెంబర్ వంటి వివరాలు ఫిల్ చేసి సబ్మిట్ బటన్ నొక్కాలి.
  • స్క్రీన్ పై జేఈఈ మెయిన్ 2023 పేపర్ 2 ఫలితాలు కనిపిస్తాయి. విద్యార్థులు తమ రిజల్ట్ చెక్ చేసుకుని, సంబంధిత పేజీని డౌన్ లోడ్ చేసుకుని సేవ్ చేసుకోవాలి.
  • భవిష్యత్ అవసరాల కోసం రిజల్ట్ ను ప్రింట్ తీసి పెట్టుకోవాలి.

Counselling details: కౌన్సెలింగ్ వివరాలు..

పేపర్ 2 ఫలితాల వెల్లడి ద్వారా, ఇప్పుడు జేఈఈ మెయిన్స్ 2023 పేపర్ 1, పేపర్ 2 రెండు సెషన్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. జేఈఈ మెయిన్ సెషన్ 2 పేపర్ 1 ఫలితాలను ఏప్రిల్ 29న విడుదల చేశారు. ఈ పరీక్షలో 43 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించారు. జేఈఈ మెయిన్ కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు ను జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ నిర్వహిస్తుంది. జేఈఈ మెయిన్స్ 2023 లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు సంబంధిత వివరాలను త్వరలో వ్యక్తిగతంగా పంపిస్తుంది.

WhatsApp channel