JEE Main Result 2023 Live : జేఈఈ మెయిన్​ సెషన్​ 2 ఫలితాలు విడుదల-jee main result 2023 live nta jee session 2 results out direct link here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Jee Main Result 2023 Live : Nta Jee Session 2 Results Out, Direct Link Here

JEE Main Result 2023 Live : జేఈఈ మెయిన్​ సెషన్​ 2 ఫలితాలు విడుదల

Sharath Chitturi HT Telugu
Apr 29, 2023 08:06 AM IST

JEE Main Result 2023 Live : జేఈఈ మెయిన్​ సెషన్​ 2 ఫలితాలు విడుదలయ్యాయి. రిజల్ట్​ లింక్​తో పాటు పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

జేఈఈ మెయిన్​ సెషన్​ 2 ఫలితాలు విడుదల
జేఈఈ మెయిన్​ సెషన్​ 2 ఫలితాలు విడుదల

JEE Main Result 2023 Live : 2023 జేఈఈ మెయిన్​ ఫలితాలను విడుదల చేసింది ఎన్​టీఏ (నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ). ఎన్​టీఏ జేఈఈ అధికారిక వెబ్​సైట్​ jeemain.nta.nic.in లో ఫలితాలను చెక్​ చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్​ 2023 సెషన్​ 2 పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ స్కోర్​కార్డును వెబ్​సైట్​లో చూసుకోవచ్చు.

జేఈఈ మెయిన్​ రిజల్ట్​ 2023 డైరక్ట్​ లింక్​ పొందేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

JEE Main session 2 Results 2023 : ఈ ఏడాది సుమారు 9లక్షల మంది జేఈఈ మెయిన్​ సెషన్​ 2 రాశారు. ఫలితాలతో పాటు ఫైనల్​ ఆన్సర్​ కీ, టాపర్స్​ లిస్ట్​, ఆల్​ ఇండియా ర్యాంక్​ లిస్ట్​, కటాఫ్​, పర్సెంటైల్​, ఇతర వివరాలు ఎన్​టీఐ జేఈఈ వెబ్​సైట్​లో విడుదలవుతాయి.

జేఈఈ మెయిన్​ సెషన్​ 2 పరీక్షలు ఏప్రిల్​ 6, 8, 10, 11, 12, 13, 15 తేదీల్లో జరిగాయి. ప్రొవిజనల్​ ఆన్సర్​ కీ ఏప్రిల్​ 19న బయటకొచ్చింది. ఏప్రిల్​ 21లోపు అభ్యంతరాలు చెప్పొచ్చని ఎన్​టీఏ పేర్కొంది. తుది కీ ఏప్రిల్​ 24న విడుదలైంది.

జేఈఈ మెయిన్​ సెషన్​ 2 ఫలితాలు ఇలా చెక్​ చేసుకోండి..

JEE Main session 2 Results link : స్టెప్​ 1:- jeemain.nta.nic.in. వెబ్​సైట్​లోకి వెళ్లండి.

స్టెప్​ 2:- JEE Mains Result 2023 for Session 2 link మీద క్లిక్​ చేయండి.

స్టెప్​ 3:- కొత్త పేజ్​ ఓపెన్​ అవుతుంది. అభ్యర్థులు తమ వివరాలు వెల్లడించాలి

స్టెప్​ 4:- సబ్మీట్​ బటన్​ క్లిక్​ చేస్తే.. ఫలితాలు డిస్​ప్లే అవుతాయి.

JEE Main session 2 Results : స్టెప్​ 5:- రిజల్ట్​ చూసుకుని పేజ్​ని డౌన్​లోడ్​ చేసుకోండి.

ఫలితాలను చెక్​ చేసుకునేందుకు మొత్తం 3 లింక్స్​ను కేటాయించింది ఎన్​టీఏ.

IPL_Entry_Point

సంబంధిత కథనం