JEE Main Result 2023 Live : జేఈఈ మెయిన్ సెషన్ 2 ఫలితాలు విడుదల
29 April 2023, 8:06 IST
- JEE Main Result 2023 Live : జేఈఈ మెయిన్ సెషన్ 2 ఫలితాలు విడుదలయ్యాయి. రిజల్ట్ లింక్‌తో పాటు పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
జేఈఈ మెయిన్ సెషన్ 2 ఫలితాలు విడుదల
JEE Main Result 2023 Live : 2023 జేఈఈ మెయిన్ ఫలితాలను విడుదల చేసింది ఎన్టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ). ఎన్టీఏ జేఈఈ అధికారిక వెబ్సైట్ jeemain.nta.nic.in లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్ 2023 సెషన్ 2 పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ స్కోర్‌కార్డును వెబ్సైట్లో చూసుకోవచ్చు.
జేఈఈ మెయిన్ రిజల్ట్ 2023 డైరక్ట్ లింక్ పొందేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
JEE Main session 2 Results 2023 : ఈ ఏడాది సుమారు 9లక్షల మంది జేఈఈ మెయిన్ సెషన్ 2 రాశారు. ఫలితాలతో పాటు ఫైనల్ ఆన్సర్ కీ, టాపర్స్ లిస్ట్, ఆల్ ఇండియా ర్యాంక్ లిస్ట్, కటాఫ్, పర్సెంటైల్, ఇతర వివరాలు ఎన్టీఐ జేఈఈ వెబ్సైట్లో విడుదలవుతాయి.
జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్షలు ఏప్రిల్ 6, 8, 10, 11, 12, 13, 15 తేదీల్లో జరిగాయి. ప్రొవిజనల్ ఆన్సర్ కీ ఏప్రిల్ 19న బయటకొచ్చింది. ఏప్రిల్ 21లోపు అభ్యంతరాలు చెప్పొచ్చని ఎన్టీఏ పేర్కొంది. తుది కీ ఏప్రిల్ 24న విడుదలైంది.
జేఈఈ మెయిన్ సెషన్ 2 ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి..
JEE Main session 2 Results link : స్టెప్ 1:- jeemain.nta.nic.in. వెబ్సైట్లోకి వెళ్లండి.
స్టెప్ 2:- JEE Mains Result 2023 for Session 2 link మీద క్లిక్ చేయండి.
స్టెప్ 3:- కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. అభ్యర్థులు తమ వివరాలు వెల్లడించాలి
స్టెప్ 4:- సబ్మీట్ బటన్ క్లిక్ చేస్తే.. ఫలితాలు డిస్ప్లే అవుతాయి.
JEE Main session 2 Results : స్టెప్ 5:- రిజల్ట్ చూసుకుని పేజ్ని డౌన్లోడ్ చేసుకోండి.
ఫలితాలను చెక్ చేసుకునేందుకు మొత్తం 3 లింక్స్‌ను కేటాయించింది ఎన్టీఏ.