తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Isc Chemistry Paper Leak : చివరి నిమిషంలో ఐఎస్​సీ కెమిస్ట్రీ పరీక్ష వాయిదా.. అదే కారణమా?

ISC Chemistry paper leak : చివరి నిమిషంలో ఐఎస్​సీ కెమిస్ట్రీ పరీక్ష వాయిదా.. అదే కారణమా?

Sharath Chitturi HT Telugu

26 February 2024, 14:26 IST

google News
    • ISC Chemistry 2024 paper leak : ఐఎస్​సీ కెమిస్ట్రీ పరీక్ష చివరి నిమిషంలో వాయిదా పడింది. సోమవారం జరగాల్సిన పరీక్షను మార్చ్​ 21కి వాయిదా వేశారు.
చివరి నిమిషంలో ఐఎస్​సీ కెమిస్ట్రీ పరీక్ష వాయిదా..
చివరి నిమిషంలో ఐఎస్​సీ కెమిస్ట్రీ పరీక్ష వాయిదా..

చివరి నిమిషంలో ఐఎస్​సీ కెమిస్ట్రీ పరీక్ష వాయిదా..

ISC Chemistry Exam 2024 Postponed: సోమవారం మధ్యాహ్నం జరగాల్సిన కెమిస్ట్రీ పేపర్​ 1 (థియరీ) పరీక్షని చివరి నిమిషంలో వాయిదా వేసింది సీఐఐఎస్​సీ (కౌన్సిల్​ ఫర్​ ఇండియన్​ స్కూల్​ సర్టిఫికేట్​). ఫలితంగా దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.

కాగా.. ఐఎస్​సీ కెమిస్ట్రీ 2024 పరీక్ష వాయిదా పడటానికి.. పేపర్​ లీక్​ కారణమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి!

ఇదీ జరిగింది..

గత కొన్ని రోజులుగా.. ఐఎస్​సీ క్లాస్​ 12 పరీక్షలు జరుగుతున్నాయి. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు.. ఐఎస్​సీ కెమిస్ట్రీ పేపర్​ 1 పరీక్ష జరగాల్సి ఉంది. చాలా మంది అభ్యర్థులు.. ఎగ్జామ్​ సెంటర్లకు చేరుకున్నారు. పరీక్ష కోసం ప్రీపేర్​ అవుతుండగా.. ఎగ్జామ్​ వాయిదా పడిందని నోటిఫికేషన్​ విడుదలైంది.

ISC Chemistry Exam paper leak : ఐఎస్​సీ కౌన్సిల్​ డిప్యూటీ సెక్రటరీ సంగీత భతైమ్​.. నోటీసులను జారీ చేశారు. పరీక్షను వాయిదా వేయడానికి గల ఎలాంటి కారణాలు చెప్పలేదు. 'అనుకోని పరిస్థితులు' అంటూ నోటీసులో పేర్కొన్నారు. సోమవారం వాయిదా పడిన ఐఎస్​సీ కెమిస్ట్రీ పరీక్షను.. మార్చ్​ 21(గురువారం) మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహిస్తామని ఆ నోటిసులో ఉంది.

ఐఎస్​సీ కెమిస్ట్రీ పరీక్ష వాయిదా..

ISC Chemistry Exam cancelled : మరోవైపు.. చాలా మంది విద్యార్థులు ఎగ్జామ్​ సెంటర్లకు వెళ్లిన తర్వాతే.. పరీక్ష వాయిదా గురించి తెలిసింది! ఫలితంగా.. చివరి నిమిషంలో ఐఎస్​సీ పరీక్ష వాయిదా పడటంతో వేలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. కెమిస్ట్రీ పరీక్షను ఎందుకు వాయిదా వేశారో.. ఐఎస్​సీ కౌన్సిల్​ వెంటనే చెప్పాలని తల్లిదండ్రులు డిమాండ్​ చేస్తున్నారు.

కాగా.. ఐఎస్​సీ కెమిస్ట్రీ ఎగ్జామ్​ వాయిదా వెనుక పేపర్​ లీక్​ కారణం ఉండి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వార్తలు సోషల్​ మీడియాలో ఇప్పటికే వైరల్​గా మారాయి.

ISC Chemistry Exam 2024 postponed : "డియర్​ పేరెంట్స్​ అండ్​ స్టూడెంట్స్​, కౌన్సిల్​ నుంచి అందిన సర్క్యులర్​ ప్రకారం.. సోమవారం జరగాల్సిన ఐఎస్​సీ కెమిస్ట్రీ పేపర్​ 1ని.. అనుకోని పరిస్థితుల కారణంగా మార్చ్​ 21కి వాయిదా వేశారు," అని పలువురు విద్యార్థుల తల్లిదండ్రలకు.. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో మెసేజ్​ వెళ్లింది.

"ఎగ్జామ్​ సెంటర్​కి వెళ్లిన తర్వాత.. గేట్​ దగ్గర మాకు సమాచారం ఇచ్చారు. ఐఎస్​సీ కెమిస్ట్రీ పరీక్ష ఒక్కటే వాయిదా పడిందని, మిగిలిన పేపర్లు షెడ్యూల్​ ప్రకారమే జరుగుతాయని చెప్పారు," అని ఓ విద్యార్థి బంధువు మీడియాకు వివరించారు.

ISC chemistry exam 2024 leaked : మరి.. హడావుడిగా, ఉన్నట్టుండి.. ఐఎస్​సీ క్లాస్​ 12 కెమిస్ట్రీ పేపర్​ని కౌన్సిల్​ ఎందుకు వాయిదా వేసుంది? అన్న విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

తదుపరి వ్యాసం