India Covid Vaccination : శభాష్ ఇండియా.. వ్యాక్సినేషన్ @200కోట్లు!
17 July 2022, 14:25 IST
- India Covid Vaccination drive : ఇండియా @200కోట్లు..! 2021 జనవరిలో కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను మొదలుపెట్టిన ఇండియా.. ఆదివారంతో 200కోట్ల మార్క్‌ను అందుకుంది.
శభాష్ ఇండియా.. వ్యాక్సినేషన్ @200కోట్లు!
India Covid Vaccination drive : కొవిడ్ 19పై యుద్ధంలో భారత దేశం దూసుకెళుతోంది. తాజాగా.. టీకా పంపిణీ ప్రక్రియలో సరికొత్త మైలురాయిని అందుకుంది. ఆదివారం నాటికి దేశవ్యాప్తంగా 200కోట్ల(2బిలియన్) వ్యాక్సిన్లను పంపిణీ జరిగింది.
కొవిడ్‌పై యుద్ధంలో భాగంగా 2021 జనవరి 16న దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైంది. శనివారం నాటికి 199.97కోట్ల కొవిడ్ టీకాల పంపిణీ జరిగింది. ఆదివారం 200కోట్ల మైలురాయి దాటింది. ఇదే కాకుండా.. ఇప్పటివరకు 5.48కోట్ల ప్రికాషనరీ డోసులు కూడా పంపిణీ చేశారు.
200కోట్ల కొవిడ్ టీకాల మార్క్‌ను ఇండియా అందుకున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.
"ఇండియా చరిత్ర సృష్టించింది. 200కోట్ల టీకాలు సరఫరా చేసిన సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు. శరవేగంగా వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను నిర్వహిస్తున్న వారందరిని చూస్తే గర్వంగా ఉంది. అంతర్జాతీయంగా కొవిడ్‌పై సాగుతున్న యుద్ధాన్ని భారత దేశం మరింత బలపరిచింది," అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్లో పేర్కొన్నారు.
కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్..
- కొవిన్ ప్రకారం.. దేశవ్యాప్తంగా 14వేల టీకా కేంద్రాలు ఉన్నాయి.
- వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను మొదలుపెట్టిన 277రోజులకు 100కోట్ల మైలురాయిని అందుకుంది ఇండియా. ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా.. గతేడాది సెప్టెంబర్ 17న.. ఒక్కరోజే 2.5కోట్లమందికి టీకా పంపిణీ చేశారు. ఇదొక రికార్డు!
- 200 crore vaccination : కేంద్ర ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం.. దేశంలోని 98మంది వయోజన జనాభా.. కనీసం ఒక్క డోసు టీకా తీసుకుంది. 90శాతం జనాభా పూర్తిగా టీకాలు పొందింది.
- గ్రామీణ ప్రాంతాల్లోని వ్యాక్సిన్ కేంద్రాల్లోనే 71శాతం టీకాల పంపిణీ జరిగింది. పట్టణ ప్రాంతాల్లో అది 29శాతంగా ఉంది. టీకా రెండు డోసులు పొందిన మహిళలు 48.9శాతం. పురుషుల్లో అది 51.5శాతంగా ఉంది.
- టీకా రెండో డోసుకు.. ప్రికాషనరీ డోసుకు తొలుత.. 9నెలల వ్యవధిని పెట్టిన కేంద్రం.. గత వారం ఆ వ్యవధిని తొమ్మిది నుంచి 6నెలలకు మార్చింది.
- ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,43,449 కొవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. భారత్‌లో ఇప్పటివరకు వెలుగు చూసిన కొవిడ్ కేసుల్లో ఇది 0.33శాతం.