తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Covid Cases : దేశంలో కొవిడ్​ కేసుల పెరుగుదలకు అసలు కారణం ఇదే!

Covid cases : దేశంలో కొవిడ్​ కేసుల పెరుగుదలకు అసలు కారణం ఇదే!

Sharath Chitturi HT Telugu

08 July 2022, 13:43 IST

    • Covid cases surge in India : దేశంలో కొవిడ్​ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇవి నాలుగో వేవ్​కు సంకేతాలా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ వ్యవహారంపై వైద్య నిపుణులు స్పందించారు.
దేశంలో కొవిడ్​ కేసుల పెరుగుదలకు అసలు కారణం ఇదే!
దేశంలో కొవిడ్​ కేసుల పెరుగుదలకు అసలు కారణం ఇదే! (AP)

దేశంలో కొవిడ్​ కేసుల పెరుగుదలకు అసలు కారణం ఇదే!

Covid cases surge in India : ఇండియాలో కొవిడ కేసులు పెరుగుతున్నాయి. అయితే ఇది కొత్త వేవ్​కు సంకేతం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొవిడ్​ కేసుల పెరుగుదల స్వల్ప కాలమేనని, కొవిడ్​ నాలుగో వేవ్​ వల్ల కాదని స్పష్టం చేస్తున్నారు. కొవిడ్​ కేసులు.. దేశవ్యాప్తంగా పెరగడం లేదని, కొన్ని ప్రాంతాల్లో అధికంగా నమోదవుతున్నాయని గుర్తుచేస్తున్నారు.

కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్​ భూషణ్​ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. ఆర్​టీ-పీసీఆర్​ టెస్టులు పెంచాలని చెప్పారు. కొవిడ్​పై నిఘా పెంచాలని, టీకాల పంపిణీని సైతం వేగవంతం చేయాలని సూచించారు.

"48-72గంటల్లోనే రోగుల ఆరోగ్యం మెరుగుపడటాన్ని చూస్తున్నాము. రెమ్​డిసివిర్​ అవసరం లేకుండానే కొవిడ్​ తగ్గిపోతోంది. రోగుల్లో చాలా మందికి తీవ్ర అనారోగ్య పరిస్థితులు లేవు. అంటే.. టీకాలు పనిచేస్తున్నాయని స్పష్టమవుతోంది. కేసులు పెరుగుతున్నప్పటికీ.. కొవిడ్​ వేవ్​ తీవ్రత తక్కువ ఉండటం మంచి పరిణామాం. కేసులు తగ్గుతాయి. అదే సమయంలో కొవిడ్​ తీవ్రత కూడా దిగొస్తోంది. అందువల్ల ఎవరు భయపడాల్సిన అవసరం లేదు," అని ముంబైలోని గ్లోబల్​ హాస్పిటల్​కు చెందిన డా. మంజుష అగర్వాల్​ వెల్లడించారు.

ప్రజలు మాస్కులు ధరించాలని, కొవిడ్​ బూస్టర్​ డోసు వేసుకోవాలని.. అప్పుడే కేసుల పెరుగదల నాలుగో వేవ్​కు దారితీయదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

దేశంలో శుక్రవారం 18,815 కొవిడ్​ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఫలితంగా యాక్టివ్​ కేసుల సంఖ్య 1,22,335కు చేరింది.

ఇండియాలో కొత్త వేరియంట్​?

India covid fourth wave : ఒమిక్రాన్​కు చెందిన కొత్త సబ్​వేరియంట్​ బీఏ.2.75.. ఇండియాతో పాటు అనేక దేశాల్లో గుర్తించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

"అమెరికా- యూరోప్​లో బీఏ.4, బీఏ.5 వల్ల కొవిడ్​ కేసులు పెరుగుతున్నాయి. ఇండియా వంటి దేశాల్లో బీఏ.2.75 సబ్​ వేరియంట్​ వల్ల కేసులు పెరుగుతున్నాయి," అని డబ్ల్యూహెచ్​ఓ చీఫ్​ టెడ్రోస్​ అథనోట్​ స్పష్టం చేశారు.

టాపిక్

తదుపరి వ్యాసం