తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Imd Alert : యెల్లో, ఆరెంజ్​, రెడ్​ అలర్ట్స్​కి అర్థాలు ఏంటి?

IMD alert : యెల్లో, ఆరెంజ్​, రెడ్​ అలర్ట్స్​కి అర్థాలు ఏంటి?

Sharath Chitturi HT Telugu

11 July 2023, 11:09 IST

google News
    • IMD alert meaning : సాధారణంగా వాతావరణాన్ని సూచించేందుకు వివిధ రంగుల్లో అలర్ట్స్​ను ఇస్తుంది ఐఎండీ. మరి వాటి అర్థాలేంటి? ఇక్కడ తెలుసుకోండి..
యెల్లో, ఆరెంజ్​, రెడ్​ అలర్ట్స్​కి అర్థాలు ఏంటి?
యెల్లో, ఆరెంజ్​, రెడ్​ అలర్ట్స్​కి అర్థాలు ఏంటి? (HT_PRINT)

యెల్లో, ఆరెంజ్​, రెడ్​ అలర్ట్స్​కి అర్థాలు ఏంటి?

IMD alert meaning : దేశవ్యాప్తంగా వర్షాల జోరు కొనసాగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతంలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న భారత వాతావరణశాఖ (ఐఎండీ).. ప్రజలు, అధికారులకు సూచనలు ఇస్తోంది. ఈ క్రమంలో పలు ప్రాంతాలకు ఆరెంజ్​ అలర్ట్​ ఇస్తుంటే.. ఇంకొన్ని ప్రాంతాలకు రెడ్​ అలర్ట్​ జారీ చేస్తోంది. అసలేంటి ఈ ఆరెంజ్​, రెడ్​ అలర్ట్స్​? ఇక్కడ తెలుసుకుందాము..

ఐఎండీ అలర్ట్​లు- వాటి అర్థాలు..

వాతావరణ పరిస్థితులను సూచించేందుకు.. సాధారణంగా నాలుగు కలర్​ కోడ్స్​ను జారీ చేస్తుంటుంది ఐఎండీ. అవి.. గ్రీన్​, యెల్లో, ఆరెంజ్​, రెడ్​. రానున్న రోజుల్లో వాతావరణం ఎలా ఉండనుంది? అని అంచనా వేసి, సంబంధిత కోడ్స్​ను జారీ చేస్తుంది. అత్యధికంగా ఈ హెచ్చరికలు 5 రోజులు అమల్లో ఉంటాయి.

IMD red alert meaning : 24గంటల వ్యవధిలో 64ఎంఎం వర్షపాతం నమోదైతే గ్రీన్​ అలర్ట్​ జారీ చేస్తుంది వాతావరణశాఖ. అదే వర్షపాతం 64.5ఎంఎం- 115.5ఎంఎం మధ్యలో ఉంటే యెల్లో అలర్ట్​ ఇస్తుంది. ఒక రోజులో వర్షపాతం 115.6- 204.4ఎంఎం మధ్యలో ఉంటే ఆరెంజ్​ అలర్ట్​ జారీ అవుతుంది. అదే 204.5 ఎంఎంకు మించి వర్షపాతం నమోదైతే మాత్రం రెడ్​ అలర్ట్​ అమల్లోకి వస్తుంది.

వర్షాల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నివాసముండే ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఈ హెచ్చరికలు జారీ చేస్తుంది ఐఎండీ.

ఇదీ చూడండి:- వానలే వానలు.. ఉత్తర భారతంలో భయం భయం!

రంగులు- వాటి అర్థాలు..

గ్రీన్​ అలర్ట్​:- వాతావరణానికి సంబంధించి అప్డేట్​ ఉండి, పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేనప్పుడు ఇచ్చేదే గ్రీన్​ అలర్ట్​.

యెల్లో అలర్ట్​:- వాతావరణం ప్రతికూలంగా ఉండి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ అలర్ట్​ సూచిస్తుంది.

IMD orange alert meaning : ఆరెంజ్​ అలర్ట్​:- వాతావరణం చాలా ప్రమాదకరంగా ఉందని, విద్యుత్​, రైలు, రోడ్డు, విమాన సేవలకు తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉంటే ఈ అలర్ట్​ అమల్లోకి వస్తుంది.

రెడ్​ అలర్ట్​:- చివరిది రెడ్​ అలర్ట్​. పరిస్థితులు అత్యంత ఆందోళకరంగా ఉన్నప్పుడు, ప్రజల జీవితాలను ముప్పు పొంచి ఉందని సూచించేందుకు ఈ అలర్ట్​ జారీ అవుతుంది.

తదుపరి వ్యాసం