Heavy rains : నేడు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ అలర్ట్​- స్కూళ్లకు సెలవు!-monsoon tracker extremely heavy rains in these states today see imd forecast ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Heavy Rains : నేడు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ అలర్ట్​- స్కూళ్లకు సెలవు!

Heavy rains : నేడు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ అలర్ట్​- స్కూళ్లకు సెలవు!

Sharath Chitturi HT Telugu
Jul 04, 2023 10:58 AM IST

IMD Heavy rain alert : ఐఎండీ ప్రకారం.. నేడు అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి. ఈ నేపథ్యంలో పలు చోట్ల స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి.

నేడు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ అలర్ట్​- స్కూళ్లకు సెలవు!
నేడు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ అలర్ట్​- స్కూళ్లకు సెలవు!

IMD Heavy rain alert : దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ఐఎండీ (భారత వాతావరణశాఖ) వెల్లడించింది. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాలకు అలర్ట్​ జారీ చేసింది. కేరళ, కర్ణాటక తీర- దక్షిణ ప్రాంతాల్లో ఈ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఇక్కడ స్కూళ్లకు సెలవు.. అక్కడ రెడ్​ అలర్ట్​..!

కర్ణాటకలోని వివిధ జిల్లాల్లో ఇప్పటికే జోరుగా వర్షాలు పడుతున్నాయి. ఇక ఇప్పుడు ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో కర్ణాటకలో అధికారులు అప్రమత్తమయ్యారు. మంగళూరు, ముల్కి, ఉల్లాల్​, మూద్​బిద్రి, బాంత్వాల్​ ప్రాంతాల్లోని స్కూళ్లు, కాలేజీలకు సెలవును ప్రకటించారు. అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు రావద్దని స్పష్టం చేశారు.

మరోవైపు కేరళలో భారీ వర్షాల నేపథ్యంలో రెండు జిల్లాలకు రెడ్​ అలర్ట్​ జారీ చేసింది భారత వాతావరణశాఖ. 11 జిల్లాలకు ఆరెంజ్​ అలర్ట్​ ఇచ్చింది. కన్నూర్​, ఇడుక్కి జిల్లాలకు రెడ్​ అలర్ట్​ అందగా.. పథనమ్​తిట్ట, అలప్పుజ, కొట్టాయం, ఇడుక్కి, త్రిశూర్​, పాలక్కడ్​, మలప్పురం, కోజికోడ్​, వయనాడ్​, కన్నూర్​, కసర్​గోడ్​ జిల్లాలు ఆరెంజ్​ అలర్ట్​లో ఉన్నాయి. తిరువనంతపురం, కొల్లం జిల్లాలకు యెల్లో అలర్ట్​ జారీ అయ్యింది.

ఇదీ చూడండి:- AP TS Rains : ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్, రానున్న రెండ్రోజులు భారీ వర్షాలు

ఇతర ప్రాంతాల్లో ఇలా..

Heavy rains in Karnataka : దిల్లీలో వాతావరణం చల్లగా మారింది. మంగళవారం ఇక్కడ తేలికపాటి వర్షం కురుస్తుందని ఐఎండీ వెల్లడించింది. ఇక ఒడిశాలో జులై 3 నుంచి 7 వరకు భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వెల్లడించింది వాతావరణశాఖ. ఈ నేపథ్యంలో 18 జిల్లాలకు యెల్లో అలర్ట్​ జారీ చేసింది. సుందర్​గఢ్​, మయూర్​బంజ్​, సోనిపుర్​, బౌధ్​, బలాన్గిర్​ వంటి ప్రాంతాల్లో మంగళవారం ఉదయం 8:30 నుంచి బుధవారం ఉదయం 8:30 గంటల వరకు ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందిని హెచ్చరించింది.

కోంకణ్​, గోవా, మధ్య మహారాష్ట్ర ఘాట్​ ప్రాంతాల్లో నాలుగు రోజుల పాటు, గుజరాత్​లో 6,7 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చు. పశ్చిమ్​ బెంగాల్​లోని హిమాలయ ప్రాంతం, సిక్కిం, అసోం, మేఘాలయ, అరుణాచల్​ప్రదేశ్​, నాగాలాండ్​, మణిపూర్​లో నాలుగు రోజుల పాటు జోరుగా వానలు పడతాయి. మేఘాలయలో మాత్రం మంగళవారం అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఝర్ఖండ్​లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది.

ఉత్తరాఖండ్​, తూర్పు ఉత్తర్​ ప్రదేశ్​, హిమాచల్​ ప్రదేశ్​లలో గురువారం వరకు వర్షాలు పడతాయని వాతావరణశాఖ వెల్లడించింది.

Whats_app_banner

సంబంధిత కథనం