తెలుగు న్యూస్ / ఫోటో /
AP TS Rains : ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్, రానున్న రెండ్రోజులు భారీ వర్షాలు
- AP TS Rains : తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ వర్ష సూచన చెప్పింది. ఏపీ, తెలంగాణలో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది.
- AP TS Rains : తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ వర్ష సూచన చెప్పింది. ఏపీ, తెలంగాణలో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది.
(1 / 8)
తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ చేసింది. ఏపీ, తెలంగాణలో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
(2 / 8)
మంగళవారం నుంచి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. అక్కడక్కడా పిడుగులు కూడా పడే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తతో ఉండాలని సూచించారు.
(3 / 8)
ఏపీతో పాటు యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో వాయవ్య దిశగా గాలులు వీస్తున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉపరితల ఆవర్తనం నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 మీటర్ల మధ్యన కొనసాగుతుందని తెలిపింది.
(4 / 8)
ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయి.
(5 / 8)
తెలంగాణలో రానున్న రెండు రోజులపాటు అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
(6 / 8)
రాగల రెండు రోజుల్లో తెలంగాణలో పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
(7 / 8)
గాలులు దిగువ స్థాయిలో పశ్చిమ దిశ నుంచి తెలంగాణ మీదుగా వీయడంతో వర్ష ప్రభావం ఎక్కువగా కనిపించే అవకాశాలున్నట్లు వాతావరణ అధికారులు తెలిపారు.
ఇతర గ్యాలరీలు