దేశవ్యాప్తంగా భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్​-in pics monsoon arrives in northern western parts of country imd issues alert ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  దేశవ్యాప్తంగా భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్​

దేశవ్యాప్తంగా భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్​

Jun 27, 2023, 10:28 AM IST Sharath Chitturi
Jun 27, 2023, 10:28 AM , IST

  • దేశంలోని 80శాతం ప్రాంతాలను రుతుపవనాలు తాకినట్టు ఐఎండీ వెల్లడించింది. ఈ ఏడాది రుతుపవనాల కదలికలో కొత్త పాటర్న్​ ఏర్పడిందని పేర్కొంది.

దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అలర్ట్​ జారీ చేసింది ఐఎండీ. దేశంలోని ఉత్తర, వాయువ్య ప్రాంతాలకు కూడా రుతుపవనాలు చేరాయని స్పష్టం చేసింది.

(1 / 6)

దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అలర్ట్​ జారీ చేసింది ఐఎండీ. దేశంలోని ఉత్తర, వాయువ్య ప్రాంతాలకు కూడా రుతుపవనాలు చేరాయని స్పష్టం చేసింది.(PTI)

"తూర్పు- మధ్య, వాయువ్య, ఉత్తర భారతంలో రుతుపవనాలతో జోరుగా వర్షాలు పడొచ్చు. మరోవైపు గుజరాత్​, పంజాబ్​, హరియాణాల్లోని మరికొన్ని ప్రాంతాలకు 4-5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు చేరుతాయి," అని ఐఎండీ వెల్లడించింది.

(2 / 6)

"తూర్పు- మధ్య, వాయువ్య, ఉత్తర భారతంలో రుతుపవనాలతో జోరుగా వర్షాలు పడొచ్చు. మరోవైపు గుజరాత్​, పంజాబ్​, హరియాణాల్లోని మరికొన్ని ప్రాంతాలకు 4-5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు చేరుతాయి," అని ఐఎండీ వెల్లడించింది.(PTI)

. "నైరుతి రుతుపవనాలు.. ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్​లోని కొన్ని ప్రాంతాలు, రాజస్థాన్​, హరియాణా, పంజాబ్​, జమ్ముకశ్మీర్​లోని కొన్ని ప్రాంతాలను తాకంది," అని ఐఎండీ స్పష్టం చేసింది.

(3 / 6)

. "నైరుతి రుతుపవనాలు.. ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్​లోని కొన్ని ప్రాంతాలు, రాజస్థాన్​, హరియాణా, పంజాబ్​, జమ్ముకశ్మీర్​లోని కొన్ని ప్రాంతాలను తాకంది," అని ఐఎండీ స్పష్టం చేసింది.(PTI)

ఐఎండీ ప్రకారం.. తూర్పు, ఈశాన్య భారతంలోని అనేక ప్రాంతాల్లో 5 రోజుల పాటు మోస్తారు వర్షాలు కురుస్తాయి. కొన్ని చోట్ల మాత్రం ఉరుములతో కూడిన వానలు పడతాయి. ఈ నెల 30 వరకు అసోం, మేఘాలయ, అరుణాచల్​ప్రదేశ్​లో అతి భారీ వర్షాలు పడతాయి.

(4 / 6)

ఐఎండీ ప్రకారం.. తూర్పు, ఈశాన్య భారతంలోని అనేక ప్రాంతాల్లో 5 రోజుల పాటు మోస్తారు వర్షాలు కురుస్తాయి. కొన్ని చోట్ల మాత్రం ఉరుములతో కూడిన వానలు పడతాయి. ఈ నెల 30 వరకు అసోం, మేఘాలయ, అరుణాచల్​ప్రదేశ్​లో అతి భారీ వర్షాలు పడతాయి.(PTI)

హిమాచల్​ ప్రదేశ్​లోనూ వర్షాలు కురుస్తున్నాయి. అనేక రహదారులు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో పర్యాటకులు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.

(5 / 6)

హిమాచల్​ ప్రదేశ్​లోనూ వర్షాలు కురుస్తున్నాయి. అనేక రహదారులు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో పర్యాటకులు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.(PTI)

భారీ వర్షాల నేపథ్యంలో ఆదివారం రాత్రి మండీ జిల్లాలోని మనాలీ- చంఢీగఢ్​ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. దాదాపు 20 గంటల పాటు శ్రమించిన అధికారులు.. రహదారిని పునరుద్ధరించారు. అప్పటివరకు వందలాది మంది పర్యాటకులు ఇబ్బందిపడ్డారు.

(6 / 6)

భారీ వర్షాల నేపథ్యంలో ఆదివారం రాత్రి మండీ జిల్లాలోని మనాలీ- చంఢీగఢ్​ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. దాదాపు 20 గంటల పాటు శ్రమించిన అధికారులు.. రహదారిని పునరుద్ధరించారు. అప్పటివరకు వందలాది మంది పర్యాటకులు ఇబ్బందిపడ్డారు.(HT Photo/Ravi Kumar)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు