IIT Madras: ఐఐటీ మద్రాస్ లో ‘డేటా సైన్స్’ అడ్మిషన్స్; అర్హత ఇంటర్మీడియెట్; వెంటనే అప్లై చేసుకోండి
31 August 2024, 17:48 IST
- IIT Madras: ఐఐటీ మద్రాస్ డేటా సైన్స్ అడ్మిషన్ 2024 రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇంటర్మీడియెట్ పూర్తయిన, ఇంటర్మీడియెట్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ కోర్సుకు అప్లై చేసుకోవడానికి అర్హులు. పూర్తి వివరాలు ఈ కింద చూడండి.
ఐఐటీ మద్రాస్ లో ‘డేటా సైన్స్’ అడ్మిషన్స్
IIT Madras: ప్రతిష్టాత్మక విద్యాసంస్థ ఐఐటీ మద్రాస్ లో డేటా సైన్స్ కోర్సులో అడ్మిషన్స్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ కోర్సుకు అప్లై చేసుకోవడానికి ఆఖరు తేదీ సెప్టెంబర్ 15, 2024. ప్రస్తుతం సెప్టెంబర్ 2024 బ్యాచ్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు ఐఐటిఎం బిఎస్ డిగ్రీ కోర్సు ఫర్ డేటా సైన్స్ అండ్ అప్లికేషన్స్ (IITM BS degree course for Data Science and Applications) కోసం ఐఐటి మద్రాస్ అధికారిక వెబ్సైట్ iitm.ac.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
అక్టోబర్ 27న ఎంట్రన్స్ టెస్ట్
దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు క్వాలిఫయర్ పరీక్షను 2024 అక్టోబర్ 27న నిర్వహిస్తారు. ఆ పరీక్ష ఫలితాలను 2024 నవంబర్ 1న ప్రకటిస్తారు.
అర్హత ప్రమాణాలు
ఐఐటీ మద్రాసులో డేటా సైన్స్ కోర్సులో అడ్మిషన్ పొందాలనుకునే విద్యార్థులు 12 వ తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. విద్యార్థులు వయస్సు లేదా విద్యా నేపథ్యంతో సంబంధం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత సాధించిన వారు వెంటనే ఈ కార్యక్రమంలో చేరవచ్చు. 11వ తరగతి ఫైనల్ పరీక్షలకు హాజరైన పాఠశాల విద్యార్థులు గ్రూప్/స్ట్రీమ్/బోర్డుతో సంబంధం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో అర్హత సాధించిన వారు 12వ తరగతి ఉత్తీర్ణత తర్వాత ఈ ప్రోగ్రామ్ లో చేరవచ్చు.
ఇలా అప్లై చేయండి..
ఐఐటీ మద్రాసులో డేటా సైన్స్ కోర్సులో అడ్మిషన్ పొందడానికి ఈ క్రింది స్టెప్స్ ఫాలో కావడం ద్వారా అప్లై చేసుకోవచ్చు.
- ఐఐటి మద్రాస్ అధికారిక వెబ్సైట్ ను iitm.ac.in సందర్శించండి.
- హోమ్ పేజీలోని టిక్కర్ లో ఉన్న ఐఐటీఎం లింక్ పై క్లిక్ చేయండి.
- కొత్త డ్రాప్ డౌన్ బాక్స్ ఓపెన్ అవుతుంది, అక్కడ అభ్యర్థులు నాన్-క్యాంపస్ బిఎస్ డిగ్రీపై క్లిక్ చేయాలి.
- డేటా సైన్స్ కోర్సుపై క్లిక్ చేస్తే మళ్లీ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
- ఇప్పుడు రిజిస్ట్రేషన్ లింక్ పై క్లిక్ చేసి వివరాలు నింపాలి.
- ఆ తర్వాత అకౌంట్లోకి లాగిన్ అయి అప్లికేషన్ ఫామ్ నింపాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.
- పేజీని డౌన్ లోడ్ చేసుకుని, తదుపరి అవసరానికి దాని హార్డ్ కాపీని భద్రపర్చుకోవాలి.
దరఖాస్తు ఫీజు
ఐఐటీ మద్రాసులో డేటా సైన్స్ కోర్సులో అడ్మిషన్ పొందడానికి దరఖాస్తు చేసుకునే విద్యార్థుల్లో జనరల్ కేటగిరీ/ ఓబీసీ వారు రూ.3000, ఎస్సీ/ ఎస్టీ / దివ్యాంగులకు ఫీజులో రాయితీ ఉంటుంది. భారతదేశం వెలుపల ఉన్న పరీక్షా కేంద్రంలో క్వాలిఫయర్ పరీక్ష రాయడానికి ఎంచుకునే విద్యార్థులు అదనంగా పరీక్ష ఫెసిలిటేషన్ ఫీజు చెల్లించాలి. ఆన్లైన్ విధానంలో చెల్లింపులు జరపాలి. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఐఐటీ మద్రాస్ అధికారిక వెబ్సైట్ చూడవచ్చు.