Driverless Cars: డ్రైవర్ రహిత కారును తయారు చేసిన ఐఐటీ హైదరాబాద్..టెస్ట్ డ్రైవింగ్‌లో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు-minister sridhar babu participated in the test driving of iit hyderabad which made a driverless car ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Driverless Cars: డ్రైవర్ రహిత కారును తయారు చేసిన ఐఐటీ హైదరాబాద్..టెస్ట్ డ్రైవింగ్‌లో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు

Driverless Cars: డ్రైవర్ రహిత కారును తయారు చేసిన ఐఐటీ హైదరాబాద్..టెస్ట్ డ్రైవింగ్‌లో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు

HT Telugu Desk HT Telugu
Aug 27, 2024 12:50 PM IST

Driverless Cars: శాస్త్ర, సాంకేతిక రంగాలలో నూతన ఆవిష్కరణలు మానవ జీవితాలలో ఊహించని మార్పులను తెచ్చిపెట్టనున్నాయి. డ్రైవర్ లేకుండా నడిచే కార్లను రూపొందించిన ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు, దేశంలో రోడ్డు ప్రయాణాన్ని సమూలంగా మార్చడానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు

హైదరాబాద్‌ ఐఐటీలో డ్రైవర్‌ రహిత కారులో మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్‌ ఐఐటీలో డ్రైవర్‌ రహిత కారులో మంత్రి శ్రీధర్ బాబు

Driverless Cars: శాస్త్ర, సాంకేతిక రంగాలలో నూతన ఆవిష్కరణలు మానవ జీవితాలలో ఊహించని మార్పులను తెచ్చిపెట్టనున్నాయి. డ్రైవర్ లేకుండా నడిచే కార్లను రూపొందించి సంగారెడ్డి జిల్లా కంది లో ఉన్న ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు, దేశంలో రోడ్డు ప్రయాణాన్ని సమూలంగా మార్చడానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు రూపొందించిన డ్రైవర్ రహిత కారులో మంత్రి శ్రీధర్ బాబు ప్రయాణించారు. ఆ ప్రయాణం అద్భుతమైన అనుభూతిని కలిగించిందని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఐఐటీ విద్యార్థులు రూపొందించిన డ్రైవర్ లెస్ కారు అద్భుతంగా ఉందని ప్రశంసించారు. డ్రైవర్ రహిత కారును రూపొందించిన హైదరాబాద్ ఐఐటీ దేశానికి గర్వకారణంగా నిలుస్తుందన్నారు.

ప్రయోగ దశలో ఉన్న ఈ టెక్నాలజీ త్వరలోనే ఆచరణలోకి రావాలని కోరుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సేవలను తెలంగాణ ప్రభుత్వంలోని అన్ని రంగాలలో ఉపయోగించుకుంటామని ఆయన వెల్లడించారు. ఇటీవల అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు శ్రీధర్ బాబు పర్యటించారు.

ఆ సమయంలో సిలికాన్ వ్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు డ్రైవర్ లెస్ ప్రయాణం చేశామన్నారు. అక్కడి ప్రయాణం కంటే ఐఐటీలో మన విద్యార్థులు రూపొందించిన కారులో చేసిన ప్రయాణం అద్భుతమైన అనుభూతిని కలిగించిందని మంత్రి పేర్కొన్నారు.

భారతదేశ ట్రాఫిక్ కు అనుగుణంగా.…

ఐఐటీ శాస్త్రవేత్తలు తయారు చేసిన డ్రైవర్ రహిత కారు ఇప్పటికే సిగ్నల్స్ను, ట్రాఫిక్ సింబల్స్ ను గుర్తు పట్టి తదననుగుణంగా కదులుతుందని శాస్త్రవేత్తలు వివరించారు.

ఈ వాహనాలు తమకు అడ్డుకు వచ్చిన అన్ని రకాల వాహనాలను, రోడ్డు పరిస్థితిలను గుర్తించాడని వీలుగా ఈ వాహన తయారుదారులు తెలంగాణ లో సుమారుగా 4,000 కిలోమీటర్లు ప్రయాణించి, ఫోటోగ్రాఫ్స్, వీడియోలు తీసి క్లౌడ్ లోకి అప్లోడ్ చేసారు. డ్రైవర్ రహిత కార్లు ఆ పరిస్థితులకు అనుగుణంగా రోడ్డుపై పరుగులు తీస్తాయని వారు తెలిపారు.

అమెరికా, చైనా, ఇతర దేశాలు వాహన తయారీ కంపెనీలు మన దేశంలోని ట్రాఫిక్ అనుగుణంగా తయారు చేయడంలేదని. అయితే, ఐఐటీ లో తయారు చేసే వాహనాలు మాత్రం పూర్తిగా భారతదేశం లోని పరిస్థితిలకు ఉపయోగపడే విధంగా తయారు చేయబడుతున్నాయని ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ బిఎస్ మూర్తి అన్నారు.

స్కిల్ యూనివర్సిటీ బోర్డు లో ఐఐటీ డైరెక్టర్…

శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఐఐటీ డ్రైవర్ రహిత వాహనాలు తయారు చేయటంలో తెలంగాణ ప్రభుత్వం అన్ని సహకారాలు తప్పకుండ ఇస్తుందని, ఐఐటీ లో డెవలప్ చేసిన టెక్నాలజీ కూడా ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే విధంగా వినియోగించుకుంటుదని అన్నారు.

త్వరలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే స్కిల్ యూనివర్సిటీ బోర్డు లో కూడా ఐఐటి డైరెక్టర్ ను తీసుకుంటామని అయన ప్రకటించారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే, హైదరాబాద్ లో 2008లో ఐఐటి ఏర్పాటు చేయటం జరిగిదని ఈ సందర్బంగా అయన గుర్తుచేసుకున్నారు.