IIT Delhi JAM 2025: ఐఐటీలు, నిట్ లలో పీజీ అడ్మిషన్ల కోసం ‘జామ్ 2025’ నోటిఫికేషన్ విడుదల
30 August 2024, 21:23 IST
దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT), నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) ల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ (JAM) నోటిఫికేషన్ వెలువడింది. దేశవ్యాప్తంగా 100 నగరాల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారు.
ఐఐటీ, నిట్ లలో పీజీ అడ్మిషన్ల కోసం ‘జామ్’ నోటిఫికేషన్ విడుదల
IIT Delhi JAM 2025: జామ్ జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్, 2025 (JAM) ను ఐఐటీ, ఢిల్లీ నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను సెప్టెంబర్ 3, 2024 నుండి ప్రారంభమవుతుంది. పరీక్ష రాయాలనుకునే అభ్యర్థులు ఐఐటీ ఢిల్లీ అధికారిక వెబ్సైట్ joaps.iitd.ac.in ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు.
జామ్ 2025 కోసం ముఖ్యమైన తేదీలు
- జామ్ 2025 కోసం రిజిస్ట్రేషన్లు సెప్టెంబర్ 3, 2024 నుండి ప్రారంభమవుతాయి.
- జామ్ 2025 రిజిస్ట్రేషన్లు అక్టోబర్ 11, 2024తో ముగుస్తాయి.
- జామ్ 2025 పరీక్షను 2025 ఫిబ్రవరి 2న నిర్వహించనున్నారు.
పరీక్ష విధానం, పరీక్ష వేదిక
బయోటెక్నాలజీ (BT), కెమిస్ట్రీ (CY), ఎకనామిక్స్ (EN), జియాలజీ (GG), మ్యాథమెటిక్స్ (MA), మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ (MS), ఫిజిక్స్ (PH) సహా ఏడు పరీక్ష పేపర్లలో (CBT) కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మోడ్ లో జామ్ 2025 నిర్వహిస్తారు. ఈ పరీక్షను దేశవ్యాప్తంగా 100 నగరాల్లో నిర్వహించనున్నారు.
అర్హతలు
- అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసిన లేదా ప్రస్తుతం అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాముల చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు జామ్ 2025 పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- వయో పరిమితి లేదు.
- అదనంగా, భారతీయ డిగ్రీ ఉన్న విదేశీయులు కూడా ఇన్స్టిట్యూట్ యొక్క విధివిధానాలకు లోబడి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏ కాలేజీల్లో పీజీ చేయొచ్చు?
జామ్ 2025లో అర్హత సాధించిన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లోని వివిధ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాముల్లో అడ్మిషన్ పొందవచ్చు. దేశవ్యాప్తంగా ఐఐటీల్లో సుమారు 3000 పీజీ సీట్లు ఉన్నాయి. అలాగే, ఐఐఎస్సీ, ఎన్ఐటీలు, ఐఐఎస్టీ షిబ్పూర్, ఎస్ఎల్ఐఈటీ, డీఐఏటీల్లో 2000 సీట్లలో కూడా జామ్ 2025 ద్వారా అడ్మిషన్ పొందవచ్చు. జామ్ ద్వారా M.Sc., M.Sc (టెక్), M.Sc.-M.Tech వంటి వివిధ మాస్టర్స్ ప్రోగ్రామ్ లకు ప్రవేశాలు ఉంటాయని ఐఐటీ ఢిల్లీ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపింది. వివిధ సంస్థల్లో డ్యూయల్ డిగ్రీ, ఎంఎస్ (రీసెర్చ్), జాయింట్ ఎమ్మెస్సీ-పీహెచ్డీ, ఎమ్మెస్సీ-పీహెచ్డీ డ్యూయల్ డిగ్రీ కూడా ఉంటుంది.
ఐఐటి జామ్ 2025: దరఖాస్తు ఎలా చేయాలి
- ముందుగా ఐఐటి జామ్ అధికారిక వెబ్సైట్ jam2025.iitd.ac.in ను సందర్శించండి.
- హోమ్ పేజీలో, ఐఐటి జామ్ 2025 (IIT JAM 2025) ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ లింక్ పై క్లిక్ చేయండి.
- రిజిస్ట్రేషన్ వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.
- తర్వాతి పేజీలోని అకౌంట్ లోకి లాగిన్ అవ్వండి.
- అప్లికేషన్ ఫామ్ నింపి అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- సబ్మిట్ పై క్లిక్ చేసి కన్ఫర్మేషన్ పేజీని డౌన్ లోడ్ చేసుకోండి.
- భవిష్యత్తు రిఫరెన్స్ కొరకు ప్రింటెడ్ కాపీని ఉంచండి.
- మరిన్ని వివరాలకు అభ్యర్థులు జామ్ 2025 అధికారిక వెబ్సైట్ jam2025.iitd.ac.in ను సందర్శించవచ్చు.