తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Icse Board Result 2023 : ఐసీఎస్​ఈ క్లాస్​ 10, 12 పరీక్షల ఫలితాలను ఇలా చెక్​ చేసుకోండి..

ICSE Board Result 2023 : ఐసీఎస్​ఈ క్లాస్​ 10, 12 పరీక్షల ఫలితాలను ఇలా చెక్​ చేసుకోండి..

Sharath Chitturi HT Telugu

07 May 2023, 7:42 IST

google News
  • ICSE Board Result 2023 : ఐసీఎస్​ఈ క్లాస్​ 10,12 పరీక్షల ఫలితాలు వెలువడాల్సి ఉంది. ఫలితాలు ఎలా చెక్​ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి..

ఐసీఎస్​ఈ క్లాస్​ 10, 12 పరీక్షల ఫలితాలను ఇలా చెక్​ చేసుకోండి..
ఐసీఎస్​ఈ క్లాస్​ 10, 12 పరీక్షల ఫలితాలను ఇలా చెక్​ చేసుకోండి..

ఐసీఎస్​ఈ క్లాస్​ 10, 12 పరీక్షల ఫలితాలను ఇలా చెక్​ చేసుకోండి..

ICSE Board Result 2023 : 2023 ఐసీఎస్​ఈ క్లాస్​ 10, 12​ పరీక్షల ఫలితాలు త్వరలోనే వెలువడనున్నాయి. ఫలితాల తేదీపై ఇంకా సీఐఎస్​సీఈ (కౌన్సిల్​ ఫర్​ ది ఇండియన్​ స్కూల్​ సర్టిఫికేట్​ ఎగ్జామినేషన్​) అధికారిక ప్రకటన చేయలేదు. ఈ దఫా పరీక్షలకు హాజరైన అభ్యర్థులు.. తమ ఫలితాలను www.cisce.org వెబ్​సైట్​లో చూసుకోవచ్చు.

2023 ఐసీఎస్​ఈ 10వ తరగతి ఎగ్జామ్స్​ ఫిబ్రవరి 27 నుంచి మార్చ్​ 25 వరకు.. 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 13 నుంచి 31 మార్చ్​ వరకు జరిగాయి.

ఐసీఎస్​ఈ బోర్డు ఎగ్జామ్​ ఫలితాలను ఇలా చెక్​ చేసుకోండి..

స్టెప్​ 1:- www.cisce.org లోకి వెళ్లండి.

ICSE class 10 results : స్టెప్​ 2:- రిజల్ట్స్​ పేజ్​లోకి వెళ్లండి. ఐసీఎస్​ఈ బోర్డు ఎగ్జామ్స్​ రిజల్ట్స్​ 2023 లింక్​పై క్లిక్​ చేయండి.

స్టెప్​ 3:- కోర్స్​ కోడ్​ను ఐసీఎస్​ఈ/ ఐఎస్​సీగా సెలెక్ట్​ చేసి, ఐడెంటిఫికేషన్​ నెంబర్​, డేట్​ ఆఫ్​ బర్త్​ వంటి లాగిన్​ డిటైల్స్​ ఇవ్వండి.

స్టెప్​ 4:- స్క్రీన్​పై మీ రిజల్ట్స్​ కనిపిస్తాయి.

స్టెప్​ 5:- ఆ పేజ్​ని డౌన్​లోడ్​ చేసుకుని, ప్రింటౌట్​ తీసుకోండి.

ICSE class 12 results date : 2022లో 2,31,063 మంది విద్యార్థులు ఐసీఎస్​ఈ బోర్డు పరీక్షలు రాశారు. వీరిలో 99.98శాతం మంది పాస్​ అయ్యారు. అబ్బాయిల (99.97శాతం) కన్నా అమ్మాయిల్లోనే (99.98శాతం) పాస్​ పర్సెంటేజ్​ ఎక్కువగా ఉంది.

ఐఎస్​సీలో 96,940 మంది పరీక్ష రాయగా.. అందరు పాస్​ అయ్యారు! వీరిలో 18మంది విద్యార్థులకు అత్యధిక పర్సెంటేజ్​ (99.75శాతం) లభించింది.

సీబీఎస్​ఈ పరీక్షల ఫలితాలు..

CBSE board exam results 2023 : సీబీఎస్​ఈ క్లాస్​ 10, 12 పరీక్షల ఫలితాలు కూడా త్వరలోనే వెలుడనున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే.. రిజల్ట్స్​ వెలువడిన తర్వాత.. results.cbse.nic.in వెబ్​సైట్​లో చెక్​ చేసుకోవచ్చు.

ఫిబ్రవరి 14 నుంచి ప్రారంభమైన సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలు మొత్తం 76 సబ్జెక్టులకు మార్చి 21 వరకు జరిగాయి. ఇక సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 14 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 5 వరకు మొత్తం 115 సబ్జెక్టులకు జరిగాయి.

పరీక్షలను చెక్​ చేసుకోవడానికి లింక్స్​..

  • digilocker.gov.in
  • cbseresults.nic.in
  • results.cbse.nic.in
  • results.gov.in
  • UMANG app
  • DigiLocker app

2023 సంవత్సరంలో 21,86,940 మంది విద్యార్థులు సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలను, 16,96,770 మంది విద్యార్థులు సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను రాశారు.

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం