తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Ssc Supplementary Exams : టెన్త్ ఫెయిల్ అయిన విద్యార్థులకు అలర్ట్.. సప్లిమెంటరీ ఎగ్జామ్స్ తేదీలివే

AP SSC Supplementary Exams : టెన్త్ ఫెయిల్ అయిన విద్యార్థులకు అలర్ట్.. సప్లిమెంటరీ ఎగ్జామ్స్ తేదీలివే

HT Telugu Desk HT Telugu

06 May 2023, 12:33 IST

google News
    • AP SSC Supplementary Exam dates 2023: ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. అయితే ఫెయిల్ అయిన విద్యార్థులకు కీలక అలర్ట్ ఇచ్చింది విద్యాశాఖ. సప్లిమెంటరీ పరీక్షల ఫీజు తేదీలను ప్రకటించింది.
ఏపీ సప్లిమెంటరీ పరీక్షలు
ఏపీ సప్లిమెంటరీ పరీక్షలు

ఏపీ సప్లిమెంటరీ పరీక్షలు

AP SSC Supplementary Exams 2023: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన... సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. జూన్ 2 నుంచి జూన్ 10 వరకు సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని తెలిపారు.ఈ పరీక్షలకు హాజరయ్యే వారు మే 17వ తేదీలోపు ఫీజు చెల్లించుకోవాలని స్పష్టం చేశారు.

సప్లిమెంటరీ పరీక్షలు:

జూన్ 2 నుంచి జూన్ 10 వరకు సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయి.

ఈ పరీక్షలకు హాజరయ్యే వారు మే 17వ తేదీలోపు ఫీజు చెల్లించుకోవాలి.

అపరాద రుసుంతో మే 22 వరకు కూడా చెల్లించవచ్చు.

రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం ఈ నెల 13వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి.

సప్లిమెంటరీ విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు.

AP SSC Results 2023 Updates: ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఫలితాలను www.bse.ap.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. ఈ ఏడాది మార్చిలో జరిగిన పదో తరగతి పరీక్షలకు 6.40 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. వీరిలో 6,05,052 మంది పరీక్ష­లకు హాజర­య్యారు. వీరిలో బాలికలు 2,95,807 మంది, బాలురు 3,09,245 మంది ఉన్నారు.

ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో 72.26 మంది ఉత్తీర్ణత

ఈసారి పది ఫలితాల్లో బాలికలదే పైచేయి

933 పాఠశాలల్లో వంద శాతం మంది పాస్ అయ్యారు.

38 పాఠశాలల్లో ఒక్కరు కూడా పాస్ కాలేదు.

పార్వతీపురం మన్యం జిల్లా - మొదటి ప్లేస్ లో నిలిచింది.

60.30 శాతంతో నంద్యాల జిల్లా చివరి స్థానంలో నిలిచింది.

ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లలో 95.25 శాతం మంది ఉత్తీర్ణతసాధించారు.

గత సంవత్సరం కంటే ఈ ఏడాది ఐదు శాతం ఉత్తీర్ణతపెరిగింది.

ఇలా చెక్ చేసుకోండి…

విద్యార్థులు మొదటగా bse.ap.gov.in లోకి వెళ్లండి.

హోమ్ పేజీలోని AP SSC ఫలితాల లింక్‌పై క్లిక్ చేయండి.

మీ హాల్ టికెట్ నంబర్ ని ఎంటర్ చేయండి.

సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.

ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.

తదుపరి వ్యాసం