CBSE results 2023: ‘ఈ వెబ్ సైట్స్ లో సీబీఎస్ఈ ఫలితాలని ఇలా చెక్ చేసుకోవచ్చు’
CBSE Class 10, 12 results 2023: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10వ తరగతి, 12వ తరగతి ఫైనల్ పరీక్షలు ముగిశాయి. త్వరలో ఫలితాలు వెలువడనున్నాయి. ఆ ఫలితాలు ఈ వెబ్ సైట్స్ లో అందుబాటులో ఉంటాయి.
CBSE Class 10, 12 results 2023: ఫిబ్రవరి 14 నుంచి ప్రారంభమైన సీబీఎస్ఈ (CBSE) 10వ తరగతి పరీక్షలు మొత్తం 76 సబ్జెక్టులకు మార్చి 21 వరకు జరిగాయి. అలాగే, సీబీఎస్ఈ (CBSE) 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 14 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 5 వరకు మొత్తం 115 సబ్జెక్టులకు జరిగాయి. త్వరలోనే ఈ పరీక్షల ఫలితాలు వెలువడనున్నాయి. సీబీఎస్ఈ (CBSE) అధికారిక వెబ్ సైట్ results.cbse.nic.in తో పాటు పలు ఇతర వెబ్ సైట్ల లోనూ ఈ ఫలితాలు అందుబాటులో ఉండనున్నాయి. 2023 సంవత్సరంలో 21,86,940 మంది విద్యార్థులు సీబీఎస్ఈ (CBSE) 10 వ తరగతి పరీక్షలను, 16,96,770 మంది విద్యార్థులు సీబీఎస్ఈ (CBSE) 12వ తరగతి పరీక్షలను రాశారు.
CBSE Class 10, 12 results 2023: ఏయే వెబ్ సైట్స్ లో..
సీబీఎస్ఈ (CBSE) 10వ తరగతి, సీబీఎస్ఈ (CBSE) 12వ తరగతి ఫైనల్ పరీక్ష ఫలితాలు సీబీఎస్ఈ అధికారిక వెబ్ సైట్ results.cbse.nic.in తో పాటు ఈ కింద పేర్కొన్న వెబ్ సైట్ల లోనూ అందుబాటులో ఉండనున్నాయి. అవి..
- digilocker.gov.in
- cbseresults.nic.in
- results.cbse.nic.in
- results.gov.in
- UMANG app
- DigiLocker app
CBSE Class 10, 12 results 2023: ఫలితాలు చెక్ చేసుకోవడం ఎలా?
- సీబీఎస్ఈ (CBSE) 10 వ తరగతి, సీబీఎస్ఈ (CBSE) 12వ తరగతి పరీక్షలను చెక్ చేసుకోవడానికి పైన పేర్కొన్న వెబ్ సైట్స్, లేదా యాప్స్ ను ఓపెన్ చేయాలి.
- ముందుగా రిజిస్టరై ఉంటే, లాగిన్ కావాలి. ఇప్పటికే రిజిస్టర్ చేసుకోని వారు ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి.
- హోం పేజీపై కనిపించే CBSE result లింక్ పై క్లిక్ చేయాలి.
- అనంతరం, ఓపెన్ అయ్యే కొత్త పేజీలో రోల్ నెంబర్, స్కూల్ నెంబర్, అడ్మిట్ కార్డ్ డిటైల్స్ వంటి అవసరమైన సమాచారాన్ని ఫిల్ చేసి, ఫలితాలను చెక్ చేసుకోవాలి.
CBSE Class 10, 12 results 2023: స్కోర్ కార్డ్ లో ఏ వివరాలుంటాయి?
సీబీఎస్ఈ 10, 12 తరగతి (CBSE Class 10, class 12) ఫైనల్ పరీక్షఫలితాలకు సంబంధించిన స్కోర్ కార్డులో విద్యార్థి పేరు, వ్యక్తిగత వివరాలు, చదివిన పాఠశాల వివరాలు ఉంటాయి. అలాగే, సబ్జెక్ట్ వారీగా టర్మ్ 1 (term 1) టర్మ్ 2 (term 2) మార్క్స్ లేదా గ్రేడ్స్ ఉంటాయి. ఫైనల్ రిజల్ట్ స్టేటస్ గా పాస్ లేదా ఫెయిల్ అనే వివరాలుంటాయి. సాధారణంగా సీబీఎస్ఈ (CBSE) 10వ తరగతి, 12వ తరగతి (CBSE Class 10, class 12) ఫైనల్ పరీక్ష ఫలితాలు మే నెల మొదటి వారంలో విడుదల అవుతాయి.