తెలుగు న్యూస్  /  National International  /  How To Check Income Tax Return Itr Refund Status Online

ITR refund status : ఆన్​లైన్​లో ఐటీఆర్​ రీఫండ్​ స్టేటస్​ చెక్​ చేసుకోండి ఇలా..

Sharath Chitturi HT Telugu

06 August 2022, 13:20 IST

    • ITR refund status : ఐటీ రిటర్నుల రీఫండ్​ స్టేటస్​ను ఆన్​లైన్​లో చెక్​ చేసుకోవడం చాలా సులభం.  ఆ వివరాలు మీకోసం..
ఆన్​లైన్​లో ఐటీ రిటర్నుల స్టేటస్​ చెక్​ చేసుకోండి ఇలా..
ఆన్​లైన్​లో ఐటీ రిటర్నుల స్టేటస్​ చెక్​ చేసుకోండి ఇలా.. (MINT)

ఆన్​లైన్​లో ఐటీ రిటర్నుల స్టేటస్​ చెక్​ చేసుకోండి ఇలా..

ITR refund status : 2022-23 ఆర్థిక ఏడాది ఐటీ రిటర్నుల ఫైలింగ్​ గడువు ముగిసింది. ఇక పన్నుచెల్లింపుదారులు ఇప్పుడు ఐటీఆర్​ రీఫండ్​ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ప్రక్రియ ఎక్కడి వరకు వచ్చింది? అనే విషయాన్ని ఆన్​లైన్​లో సులభంగా తెలుసుకోవచ్చు.

ఆన్​లైన్​లో ఐటీ రిటర్నుల స్టేటస్​ చెక్​ చేసుకోవడం ఎలా?

ఐటీ రిటర్నులు ఫైల్​ చేసిన 10 రోజులకు రీఫండ్​ స్టేటస్​ను చూసుకునే వెసులుబాటు కల్పిస్తోంది ఆదాయపు పన్నుశాఖ.

  • ముందుగా.. https://eportal.incometax.gov.in/iec/foservices/#/login లో లాగిన్​ అవ్వాలి.
  • యూజర్​ ఐడీ- పాస్​వర్డ్​ టైప్​ చేయాలి.
  • 'మై అకౌంట్​'కు వెళ్లి.. రీఫండ్​/ డిమాండ్​ స్టేటస్​ క్లిక్​ చేయాలి.
  • డ్రాప్​ డౌన్​ మెనూలోకి వెళ్లి.. 'Income Tax Returns' సెలక్ట్​ చేసుకుని 'సబ్మిట్​' బటన్​ ప్రెస్​ చేయాలి.
  • మీ అక్నాలెడ్జ్​ నెంబర్​ మీద క్లిక్​ చేయాల్సి ఉంటుంది.
  • కొత్త వెబ్​ పేజ్​ ఓపెన్​ అవుతుంది. మీ ఐటీఆర్​ వివరాలన్నీ అందులో కనిపిస్తాయి. అక్కడే రీఫండ్​ డేట్​ కూడా ఉంటుంది.

పాన్​ నెంబర్​తో ఐటీఆర్​ రీఫండ్​ చెక్​ చేసుకోవడం ఎలా?

  • https://tin.tin.nsdl.com/oltas/servlet/RefundStatusTrack లోకి వెళ్లాలి.
  • పాన్​ కార్డు నెంబర్​ టైప్​ చేయాలి
  • అసెస్​మెంట్​ ఇయర్​ 2022-23గా సెలక్ట్​ చేసుకోవాలి.
  • సబ్మిట్​ బటన్​ ప్రెస్​ చేయాలి.
  • మీ రీఫండ్​ స్టేటస్​ కనిపిస్తుంది.