IT returns : మధ్యాహ్నం 1 గంట వరకు 19.5లక్షల ఐటీ రిటర్నులు దాఖలు
31 July 2022, 15:28 IST
- IT returns : ఐటీ రిటర్నుల దాఖలుకు నేడే చివరి రోజు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం 1 గంట వరకు 19.5లక్షలకుపైగా ఐటీ రిటర్నులు దాఖలయ్యాయి.
మధ్యాహ్నం 1 గంట వరకు 19.5లక్షల ఐటీ రిటర్నులు దాఖలు
IT returns : ఐటీ రిటర్నుల దాఖలుకు నేడే చివరి రోజు కావడంతో జోరుగా ఫైలింగ్స్ జరుగుతున్నాయి! మధ్యాహ్నం 1గంట వరకు 19,53,581 ఐటీ రిటర్నులు దాఖలయ్యాయి.
మధ్యాహ్నం 12-1గంట మధ్యలో.. అంటే ఒక్క గంట వ్యవధిలో ఏకంగా 4,67,902 ఐటీ రిటర్నులు దాఖలయ్యాయి. ఈ విషయాన్ని ఆదాయపు పన్నుశాఖ ట్వీట్ చేసింది.
ఐటీఆర్ దాఖలలో సహాయం కోసం 1800 103 0025 లేదా 1800 419 0025 కు కాల్ చేయవచ్చని ట్వీట్లో పేర్కొంది.
ఇక శనివారం వరకు 5.10కోట్లకుపైగా ఐటీ రిటర్నులు దాఖలయ్యాయి. జులై 30న ఒక్కరోజే.. 57.51లక్షల ఐటీ రిటర్నులు నమోదుకావడం విశేషం.
ఐటీ రిటర్నుల దాఖల గడువును పెంచాలని అనేకమంది విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ గడువు పెంచే ప్రసక్తే లేదని ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ గడువు దాటితే.. జరిమానా కట్టి ఐటీ రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది.
2020-21 ఆర్థిక ఏడాది.. 5.89కోట్ల ఐటీ రిటర్నులు దాఖలయ్యాయి. అప్పుడు.. గడువును 2021 డిసెంబర్ 31వరకు పెంచింది ప్రభుత్వం. ఈసారి.. ఐటీ రిటర్నుల సంఖ్య ఇప్పటికే మెరుగ్గా ఉండటంతో.. చివరి నిమిషంలో గడువును ప్రభుత్వం పెంచకపోవచ్చని తెలుస్తోంది.