IT Returns : ఐటీఆర్ ఫైలింగ్ గడువు పెంపు లేదు.
31 July 2022, 5:35 IST
- ఐటీ రిటర్నులు దాఖలు చేయడానికి గడువు పొడిగించడం లేదని కేంద్రం స్పష్టం చేసింది. జులై 31లోపు రిటర్నులు దాఖలు చేయల్సిందేనని, దేశవ్యాప్తంగా ఆదివారం కూడా ఐటీ కార్యాలయాలు ప్రజలకు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది.
ఐటీ రిటర్నులను దాఖలు చేయడానికి గడువు పొడిగింపు లేదని కేంద్రం స్పష్టం చేసింది
ఇన్‌కం టాక్స్ రిటర్న్‌లు దాఖలు చేయడానికి గడువు పొడిగించడం ఆర్ధిక మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది. ఐటీ రిటర్నుల దాఖలు చేయడానికి గడువు తేదీని పలుమార్లు గడువు పొడిగించడంతో మారోసారి పొడిగిస్తారని విస్తృత ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఎలాంటి పొడిగింపు ఇవ్వట్లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
2022-23 ఆర్ధిక సంవత్సరాలలో ఇన్‌కం టాక్స్ అసెస్‌మెంట్ దాఖలు చేయడానికి గడువును పొడిగించడం లేదని కేంద్ర ఆర్ధిక శాఖ స్పష్టం చేసింది. 22-23 ఆర్ధిక సంవత్సరాలకు సంబంధించిన నాన్ ఆడిటబుల్ కేసులకు సంబంధించిన రిటర్నులను జులై 31లోపు సమర్పించాల్సిందేనని స్పష్టం చేసింది.
జులై 31 ఆదివారం సెలవు దినమైనా రిటర్నులు దాఖలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లను ఐటీ శాఖ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దేశవ్యాప్తంగా ఆస్క్ కేంద్రాలను ఆదివారం అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆర్ధిక శాక సర్క్యులర్ జారీ చేసింది. ఆదివారం పనివేళల్లో కూడా ఐటీ రిటర్నులను స్వీకరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు.
ఐటీ రిటర్నులను దాఖలు చేసే వారికి కౌంటర్ రిసిప్టులను ఇచ్చేందుకు అన్ని నగరాల్లో ఏర్పాట్లు చేస్తారు. అదనపు రద్దీని తట్టుకునేందుకు వీలుగా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తారు. టాక్స్ పేయర్లు రిటర్న్స్ దాఖలు చేసేలా ఆదివారం కూడా ఆదాయపన్ను శాఖ పని చేస్తుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ విభాగం ప్రకటించింది.,
టాపిక్