Hero Motocorp price hike : పెరిగిన ద్విచక్ర వాహనాల ధరలు.. పండుగ సీజన్లో షాక్!
23 September 2022, 7:28 IST
Hero Motocorp price hike : ద్విచక్ర వాహనాల ధరలను పెంచుతున్నట్టు హీరో మోటాకార్ప్ ప్రకటించింది. పండుగ సీజన్‌ని కూడా లెక్కచేయకుండా.. ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
పండుగ సీజన్లో షాక్.. పెరిగిన ద్విచక్ర వాహనాల ధరలు!
Hero Motocorp price increase : పండుగ సీజన్లో వినియోగదారులకు షాక్ ఇచ్చింది.. దిగ్గజ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్. తమ ద్విచక్ర వాహనాల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.
మోటార్‌సైకిళ్లు, స్కూటర్లపై రూ. 1000 వరకు ధరలను పెంచుతున్నట్టు హీరో మోటోకార్ప్ తెలిపింది. ఈ మేరకు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ద్విచక్ర వాహనాల ధరల పెంపు.. గురువారం నుంచే అమల్లోకి వచ్చేసింది.
Hero Motocorp price hike news : పండుగ సీజన్లో..!
"ద్రవ్యోల్బణం కారణంగా ఖర్చులు పెరిగాయి. ఫలితంగా ధరల పెంపు నిర్ణయం తీసుకున్నాము. మోడల్, మార్కెట్‌కి తగ్గట్టు పెంచిన ధరలు అమల్లోకి వచ్చాయి. గరిష్ఠంగా రూ. 1000 పెంచాము," అని హీరో మోటోకార్ప్ ఓ ప్రకటనలో వెల్లడించింది.
హీరో మోటోకార్ప్ వివిధ ద్విచక్ర వాహనాలను తయారీ చేస్తుంది. రూ. 55,450 ఉన్న హెచ్ఎఫ్ 100 నుంచి రూ. 1.36లక్షలు ఉన్న ఎక్స్‌పల్స్ 200 4వీ వరకు అనేక మోడల్స్.. ఈ సంస్థ సొంతం.
సాధారణంగా పండుగ సీజన్లో గిరాకీ ఎక్కువ ఉంటుంది. వాహనాల తయారీ సంస్థలకు పండుగ సీజన్ అత్యంత కీలకం. ఆ సమయంలో ధరల పెంపు ఉండదు. కానీ ఈసారి మాత్రం ద్విచక్ర వాహనాల ధరలను పెంచుతున్నట్టు హీరో మోటోకార్ప్ ప్రకటించడం వినియోగదారులకు షాక్‌కు గురిచేసింది.
Vehicles price hike : వాహనాల ధరల పెంపు షురూ..!
హీరో మోటోకార్ప్ ఒక్కటే కాదు.. ఇతర వాహనాల తయారీ సంస్థలు కూడా ధరల పెంపును మొదలుపెట్టాయి.! బొలేరో, బొలేరో నియో వాహనాల ధరలను పెంచుతున్నట్టు మహీంద్రా అండ్ మహీంద్రా ఇటీవలే ప్రకటించింది. రానున్న రోజుల్లో మరిన్ని సంస్థలు కూడా వాహనాల ధరల పెంపుపై నిర్ణయం తీసుకోవచ్చు!
టాపిక్