IMD heatwave alert : అమ్మో ఎండలు.. హీట్‌వేవ్ ఎఫెక్ట్‌తో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
17 April 2023, 7:36 IST
- IMD heatwave alert : దేశవ్యాప్తంగా పగటి పూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో హీట్‌వేవ్ పరిస్థితులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
ఈ రాష్ట్రాలకు హీట్‌వేవ్ అలర్ట్ జారీ..
IMD heatwave alert : దేశంలో భానుడి భగభగలు రోజురోజుకు పెరుగుతున్నాయి. హీట్‌వేవ్ పరిస్థితులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇదే విషయంపై భారత వాతావరణశాఖ (ఐఎండీ).. తాజాగా 5 రాష్ట్రాలకు అలర్ట్ జారీ చేసింది. ప్రజలు నిత్యం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. ప్రభుత్వాలు కూడా తగిన చర్యలు తీసుకుంటున్నాయి.
పశ్చిమ్ బంగాల్..
పశ్చిమ్ బంగాల్లోని కొన్ని ప్రాంతాల్లో గత 5 రోజులుగా హీట్‌వేవ్ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించడంతో ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టింది. సోమవారం నుంచి వారం రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
పశ్చిమ్ బంగాల్ రాష్ట్రానికి ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఒడిశా..
heatwave in Odisha : ఒడిశాలో ఉష్ణోగ్రతలు భారీగానే నమోదవుతున్నాయి! గత గురువారం పగటి ఉష్ణోగ్రతలు పలు ప్రాంతాల్లో దాదాపు 44 డిగ్రీలకు చేరాయి.
"బరపదాలో రికార్డు స్థాయిలో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నెలలో ఇది రికార్డు. ఏప్రిల్ 10 భువనేశ్వర్‌లో 37.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది," అని ఐఎండీ పేర్కొంది.
వర్షాలు పడటం తగ్గడంతో రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.
ఢిల్లీ..
Delhi Heatwave 2023 : ఢిల్లీలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. రానున్న రెండు రోజుల పాటు హీట్‌వేవ్ పరిస్థితులు ఉంటాయని ఐఎండీ పేర్కొంది. సాధారణంగా కన్నా ఉష్ణోగ్రతలు 4-4.5 డిగ్రీలు పెరగొచ్చని స్పష్టం చేసింది.
బిహార్..
India Heatwave 2023 : బిహార్‌లోని అనేక జిల్లాల్లో హీట్‌వేవ్ పరిస్థితులు కొనసాగుతున్నాయి. గత 4-5 రోజులుగా భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. స్థానిక వాతావరణశాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని ఈశాన్య ప్రాంతాల్లో సోమ- మంగళవారాలు.. దక్షిణ ప్రాంతాల్లో బుధ, గురువారాలు హీట్‌వేవ్ పరిస్థితులు ఉంటాయని స్పష్టం చేసింది.
మహారాష్ట్ర..
Heatwave in Maharashtra 2023 : ఐఎండీ రిపోర్టు ప్రకారం.. ఈ నెల మధ్య వారం నాటికి రాష్ట్రంలోని 10కిపైగా జిల్లాల్లో సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి! చంద్రపూర్‌లో అత్యధికంగా 43.2 డిగ్రీల సెల్సియెస్ ఉష్ణోగ్రత రికార్డైంది. కాగా.. దక్షిణ ముంబైలో మాత్రం వాతావరణ చల్లగానే ఉంది. 31.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
హీట్‌వేవ్ నేపథ్యంలో రాష్ట్రంలోని అనేక విద్యాసంస్థలు పని వేళలను తగ్గించాయి. మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయట తిరగ వద్దని స్థానిక ఆరోగ్యశాఖ అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.