తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Itr Refund : ఐటీఆర్​ రీఫండ్ ఇంకా రాలేదా? కారణం ఇదే..!​

ITR refund : ఐటీఆర్​ రీఫండ్ ఇంకా రాలేదా? కారణం ఇదే..!​

Sharath Chitturi HT Telugu

17 September 2022, 11:13 IST

google News
    • ITR refund awaited : ఐటీఆర్​ రీఫండ్​ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఇది మీకోసమే. మీకు ఇంకా రీఫండ్​ రాకపోవడానికి గల కారణాలను ఇక్కడ తెలుసుకోండి.
ఐటీఆర్​ రీఫండ్ ఇంకా రాలేదా? కారణం ఇదే..!​
ఐటీఆర్​ రీఫండ్ ఇంకా రాలేదా? కారణం ఇదే..!​ (MINT_PRINT)

ఐటీఆర్​ రీఫండ్ ఇంకా రాలేదా? కారణం ఇదే..!​

ITR refund awaited : ఐటీఆర్​ ఫైల్​ చేసి నెలలు గడిచినా.. రీఫండ్​ కోసం ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారా? మీకు రీఫండ్​ పడకపోవడానికి పలు కారణాలు ఉండొచ్చు. అవేంటంటే..

ఐటీఆర్​ రీఫండ్​కి మీరు అర్హులేనా?

ముందుగా.. ఐటీఆర్​ రీఫండ్​కి మీరు అర్హులేనా అన్న విషయం తెలుసుకోవాలి. అందుకోసం మీ ఐటీఆర్​ని ఆదాయపు పన్నుశాఖ ప్రాసెస్​ చేసిందా లేదా చూడాలి. రీఫండ్​కి మీరు అర్హులు అని ఐటీశాఖ ధ్రువీకరిస్తేనే మీ బ్యాంకు ఖాతాలో డబ్బులుపడతాయి.

ఐటీఆర్​ రీఫండ్​ స్టేటస్​ చెక్​ చేసుకోండి..

ఎన్​ఎస్​డీఎల్​, ఆదాయపు పన్నుశాఖ ఈ ఫైలింగ్​ వెబ్​సైట్​ ద్వారా మీ ఐటీఆర్​ రీఫండ్​ స్టేటస్​ని చెక్​ చేసుకోవాలి. 'నో రికార్డ్స్​ రీఫండ్​' అని చూపిస్తుంటే.. ఆదాయాపు పన్నుశాఖ సంబంధిత వివరాలను ఇంకా పెట్టలేదని అర్థం.

ఐటీఆర్​ రీఫండ్​ రాకపోవడానికి మూడో కారణం..

రీఫండ్​ ఇష్యూ చేసినట్టు, మోడ్​ ఆఫ్​ పేమెంట్​, అమోంట్​, డేట్​ ఆఫ్​ క్లియరెన్స్​ ఆఫ్​ ఫండ్​ వంటి వివరాలు ఐటీఆర్​ స్టేటస్​లో కనిపిస్తాయి. వాటిని చూడాలి.

ITR refund status check : ఇంకొన్ని సందర్భాల్లో 'రీఫండ్​ ఫెయిల్డ్​' అని కనిపిస్తుంది. అందుకు తగ్గ కారణాలను కూడా వెల్లడిస్తారు. మీ మెయిల్​కి కూడా ఈ మెయిల్​ వస్తుంది. ఐటీఆర్​ రీఫండ్​ ఫెయిల్​ అయితే.. రీ- ఇష్యూ కోసం ఐటీశాఖకు మీరు విజ్ఞప్తి చేయాల్సి ఉంటుంది. ఆ ఆప్షన్​ కూడా ఈఫైలింగ్​ పోర్ట్​లో అందుబాటులో ఉంటుంది.

ఇంకోసారి 'రీఫండ్​ కెప్ట్​ ఆన్​ హోల్డ్​' అని కనిపిస్తుంది. ఇందుకు సంబంధించిన వివరాలు మీ మెయిల్​ ఐడీకి వస్తాయి. బ్యాంకు ఖాతా వాలిడేట్​ చేసే సమయంలో లోపాలు ఉండొచ్చు.. లేదా బ్యాంకు ఖాతాకు పాన్​ లింక్​ అయ్యి ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఐటీఆర్​ రీఫండ్​ ఆలస్యమవుతుంది.

గత ఆర్థిక సంవత్సరాల్లో 'ఔట్​స్టాండింగ్​ డిమాండ్​' పెండింగ్​లో ఉంటే మీకు రీఫండ్​ రాకపోవచ్చు. ఈ మేరకు మీకు సెక్షన్​ 143(1) కింద సమాచారం అందుతుంది.

ఐటీఆర్​ రీఫండ్​ ఎలా చెక్​ చేసుకోవాలో తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం