E-verify ITR: ఐటీఆర్ ఈ వెరిఫై చేశారా? ఇలా చేయండి-everify itr 30 day window still open know steps to do it online and offline ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  E-verify Itr 30-day Window Still Open Know Steps To Do It Online And Offline

E-verify ITR: ఐటీఆర్ ఈ వెరిఫై చేశారా? ఇలా చేయండి

Praveen Kumar Lenkala HT Telugu
Aug 10, 2022 09:30 AM IST

E-verify ITR: ఐటీ రిటర్నులు దాఖలు చేయడానికి గడువు తేదీ జూలై 31 ముగిసింది. తరువాత రిటర్న్ దాఖలు చేసిన వారు ఈవెరిఫికేషన్ కూడా విధిగా చేయాలి.

ఐటీఆర్ ఈవెరిఫికేషన్‌కు గడువు కుదించిన ఐటీ డిపార్ట్‌మెంట్
ఐటీఆర్ ఈవెరిఫికేషన్‌కు గడువు కుదించిన ఐటీ డిపార్ట్‌మెంట్ (HT_PRINT)

E-verify ITR: 2022-23 అసెస్‌మెంట్ సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్‌లను (ITR) ఫైల్ చేయడానికి జూలై 31 గడువు తేదీ. గడువు తేదీ తర్వాత రిటర్న్‌ను దాఖలు చేసే వారు తమ ఐటీఆర్‌ను వీలైనంత త్వరగా వెరిఫై చేయాలి, ఎందుకంటే ఆగస్ట్ 1 నుండి ఆలస్యంగా ఫైల్ చేసేవారికి కాలపరిమితి తగ్గించింది. ఈమేరకు మార్పులు చేస్తున్నట్లు జూలై 29న ఆదాయ పన్ను శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.

ట్రెండింగ్ వార్తలు

ITR యొక్క ఇ-వెరిఫికేషన్ ఎందుకు?

ఇ-వెరిఫై చేస్తేనే ఐటీఆర్ రిటర్న్ ఫైలింగ్ ప్రక్రియ పూర్తయినట్టు లెక్క. అది కూడా నిర్ణీత సమయంలో పూర్తి చేయకపోతే ఆ ఐటీఆర్ చెల్లనిదిగా పరిగణిస్తారు.

ఆదాయపు పన్ను శాఖ ఐటీఆర్ ఇ-వెరిఫికేషన్ లేదా హార్డ్ కాపీ సబ్మిట్ చేయడం వంటి ప్రక్రియకు గడువు ఇదివరకు 120 రోజులు ఉండేది. ఇప్పుడది కేవలం 30 రోజులకు పరిమితం చేశారు.

జూలై 31లోపు దాఖలు చేసిన ఐటీఆర్‌ల వెరిఫికేషన్‌కు కాలపరిమితి

జూలై 31కి ముందు దాఖలు చేసిన రిటర్న్‌ల కోసం, ఐటీఆర్ వెరిఫికేషన్‌కు గడువు తేదీ నుండి 120 రోజుల వరకు ఉంటుంది. అయితే ఆగస్టు 1న లేదా ఆ తర్వాత రిటర్న్‌ను దాఖలు చేసినట్లయితే పన్ను శాఖ దానిని దాఖలు చేసిన తేదీ నుండి 30 రోజులకు తగ్గించింది.

ఇప్పటి వరకు ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) ఫైల్ చేసిన తర్వాత ఐటీఆర్ ఇ-వెరిఫై చేయడానికి లేదా ఐటీఆర్-Vని పోస్ట్ ద్వారా పంపడానికి సమయం ఐటీఆర్ అప్‌లోడ్ చేసిన తేదీ నుండి 120 రోజులుగా ఉంది.

ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ఎలా ధృవీకరించాలి

రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత మీరు మీ ఐటీఆర్ ఇ-వెరిఫై చేసుకోవచ్చు. మీరు దీన్ని ఆఫ్‌లైన్‌లో కూడా చేయవచ్చు.

ఐటీఆర్-Vని హార్డ్ కాపీలో పంపాలనుకునే వారు స్పీడ్ పోస్టులో ‘సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్, ఆదాయపు పన్ను శాఖ, బెంగళూరు-560500, కర్ణాటక..’ అనే అడ్రస్‌కు పంపాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్‌లో అయితే ఐటీ రిటర్న్ పూర్తయిన వెంటనే ఓటీపీ ద్వారా ఈవెరిఫికేషన్ చేసేయొచ్చు. పాన్ కార్డు-ఆధార్ కార్డు లింకై ఉండాలి. ఆధార్ నుంచి ఓటీపీ వచ్చే సౌకర్యం కలిగి ఉండాలి.

IPL_Entry_Point

టాపిక్