Aadhar Update : మీ పిల్లల ఆధార్ అప్డేట్ చేయాలా? ఏపీలో చాలా ఈజీ ప్రాసెస్-follow these information to update finger prints to aadhar card easily know more details inside ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Aadhar Update : మీ పిల్లల ఆధార్ అప్డేట్ చేయాలా? ఏపీలో చాలా ఈజీ ప్రాసెస్

Aadhar Update : మీ పిల్లల ఆధార్ అప్డేట్ చేయాలా? ఏపీలో చాలా ఈజీ ప్రాసెస్

HT Telugu Desk HT Telugu
Jul 27, 2022 07:30 PM IST

ఆధార్ అప్ డేట్ చేయించేందుకు వెళ్తున్నారా? అబ్బా.. లైన్లో నిలుచునేందుకే సరిపోతుంది అనుకుంటున్నారా? కానీ ఏపీలో మాత్రం అలాకాదు. ఆధార్ అప్ డేట్ చాలా ఈజీగా చేయోచ్చు. అది ఎలాగా అంటారా? అయితే ఈ వార్త చదవండి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (unplash)

ఆధార్ అనేది అందరికీ తప్పనిసరి. పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఇప్పుడు ఆధార్ ఉండాల్సిందే. అన్నింటికి ఆధారే.. ఆధారం మనకు. అంతకుముందు ఉన్న పొరబాట్లు, లేదా మీ పిల్లల ఆధార్ అప్ డేట్ చేయాలంటే.. ఆధార్ కేంద్రానికి వెళ్తుంటారు. అక్కడ లేట్ అవుతుంటే.. చిరాకు పడతారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం.. సులువుగా ఆధార్ అప్ డేట్ పని అయిపోతుంది. ప్రభుత్వం అలాంటి ప్లాన్ తీసుకొచ్చింది.

మనిషికి గుర్తింపు ఆధార్. ప్రతిదానికీ ప్రామాణికం అదే. విద్య, ఉద్యోగం, ప్రభుత్వ పథకాలు, వైద్య సేవలు, ఎక్కడికైనా వెళ్లాలన్నా.. మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి అంటూ అడుగుతారు. మరి అలాంటి ఆధార్ లో తప్పులు ఉండకుండా చూసుకోవాలి కదా. ఇక చిన్నపిల్లలకు అయితే.. ఐదుళ్లు వస్తే.. వేలిముద్రలు అప్ డేట్ చేయాలి. కానీ ఆధార్ సెంటర్లకు వెళ్తే.. లైన్లతో ఇబ్బందులు అని.. కొంతమంది అనుకుంటారు. ఇక అలాంటి బాధ ఉండదు. ఏపీ ప్రభుత్వం ఇందుకోసం ఓ కొత్త ఆలోచన చేసింది.

ఏపీ ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు ఇవి ఉపయోగపడుతున్నాయి. లబ్ధిదారుల లిస్ట్ కూడా.. అక్కడే పెడతారు. అయితే ఇప్పుడు ఆధార్ సేవలు కూడా గ్రామ సచివాలయాల్లో అందనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇక పిల్లల ఆధార్ అప్ డేట్ కోసం.. ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటోంది. ఐదేళ్లు దాటాక వేలిముద్రలు గ్రామ సచివాలయానికి వెళ్లి ఈజీగా అప్ డేట్ చేయోచ్చు. గంటకు 15 మంది వేలిముద్రలు అప్ డేట్ చేసేలా టైమ్ స్లాట్ ఇస్తున్నారు.

సుమారు.. మూడు వేల గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్ సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్త ఆధార్ తో పాటు ఆధార్ వేలిముద్రలను అప్ డేట్ చేసే సేవలు కూడా ఉచితంగా అందిస్తోంది. చిరునామా మార్పులు, తప్పులను సరిదిద్దడంలాంటి వాటికి కొంచెం ఫీజు తీసుకుంటారు. పిల్లలకు ఆధార్ అప్ డేట్స్ కోసం ప్రభుత్వం ప్రతి నెల ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తోంది. ఈ నెల 27, 28వ తేదీల్లో గ్రామ, వార్డు సచివాలయాల్లో సేవలను ఉన్నాయి. ఏపీలో సుమారు కోటి మందికిపైగా.. వ్యక్తుల చిన్నప్పటి వేలిముద్రలే ఉన్నాయి.

ఐదేళ్ల లోపు వార్డు ఆధార్ కార్డు పొందితే.. ఐదేళ్ల తర్వాత తప్పనిసరిగా వేలిముద్రలు అప్ డేట్ చేయాలి. 15 ఏళ్ల తర్వాత మరోసారి వేలిముద్రలను అప్ డేట్ చేసుకోవాలి. ప్రభుత్వం ప్రతి నెల గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తోంది. వాలంటీర్ల ద్వారా ఈ సమాచారం అందిస్తోంది.

IPL_Entry_Point