తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Google Pixel 7 Price Leaked : గూగుల్​ పిక్సెల్​ 7 ప్రైజ్​ లీక్​- ఎంతంటే..

Google Pixel 7 price leaked : గూగుల్​ పిక్సెల్​ 7 ప్రైజ్​ లీక్​- ఎంతంటే..

Sharath Chitturi HT Telugu

25 September 2022, 17:04 IST

    • Google Pixel 7 price leaked : గూగుల్​ పిక్సెల్​ 7 ప్రైజ్​ ఆన్​లైన్​లో లీక్​ అయ్యింది. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
గూగుల్​ పిక్సెల్​ 7 ప్రైజ్​ లీక్​..!
గూగుల్​ పిక్సెల్​ 7 ప్రైజ్​ లీక్​..!

గూగుల్​ పిక్సెల్​ 7 ప్రైజ్​ లీక్​..!

Google Pixel 7 series price leaked : గూగుల్​ పిక్సెల్​ 7.. అక్టోబర్​ 6న అమెరికాలో లాంచ్​ కానుంది. ఈ సిరీస్​లో పిక్సెల్​ 7, పిక్సెల్​ 7 ప్రో మోడల్స్​ ఉండనున్నాయి. టెన్సార్​ జీ2 చిప్​సెట్​తో ఈ గూగుల్​ పిక్సెల్​ 7 స్మార్ట్​ఫోన్లు పనిచేస్తాయి. ఆండ్రాయిడ్​ 13 వర్షెన్​ వీటిల్లో ఉంటుంది. ఇవి ఇప్పటివరకు అందుబాటులో ఉన్న సమచారం. తాజాగా.. గూగుల్​ పిక్సెల్​ 7 సిరీస్​ ప్రైజ్​ ఆన్​లైన్​లో లీక్​ అయ్యింది!

ట్రెండింగ్ వార్తలు

Rishi Sunak net worth : కింగ్​ చార్లెస్​ కన్నా.. రిషి సునక్​- అక్షతా మూర్తులే ధనవంతులు!

Naturals Ice Cream : నేచురల్స్​ ఐస్​క్రీమ్​ వ్యవస్థాపకుడు రఘునందన్​ కామత్​ కన్నుమూత..

Thief Lawyer: కి‘‘లేడీ లాయర్’’.. కోర్టులోనే దర్జాగా దొంగతనాలు; ఎట్టకేలకు అరెస్ట్

COVID-19: మళ్లీ కోవిడ్-19 కలకలం; సింగపూర్ లో వారం రోజుల్లో 25,900 కేసులు నమోదు

ఆన్​లైన్​ నివేదికల ప్రకారం.. పిక్సెల్​ 7.. 599 డాలర్లు(రూ. 48,000) ఉండొచ్చు. పిక్సెల్​ 7 ప్రో ధర 899డాలర్లు (అంటే రూ. 73,000)గా ఉండే అవకాశం ఉంది. గతేడాది విడుదలైన గూగుల్​ పిక్సెల్​ 6 సిరీస్​లోని స్మార్ట్​ఫోన్లకి కూడా ఇదే ధర ఉండటం గమనార్హం.

Google Pixel 7 series :  మరోవైపు గూగుల్​ స్టోర్​ పేజ్​లో పిక్సెల్​ 7, పిక్సెల్​ 7 ప్రోకి సంబంధించిన ఫొటోలు దర్శనమిచ్చాయి. ఒబ్సిడియన్​, స్నో కలర్​ ఆప్షన్స్​లో ఈ ఫోన్లు ఉన్నాయి. అయితే.. గూగుల్​ పిక్సెల్​ 7 ప్రో హాజెల్​ రంగు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. పిక్సెల్​ 7 వేరియంట్​ లెమన్​గ్రాస్​ రంగులో రావొచ్చు.

ఇండియాలో గూగుల్​ పిక్సెల్​ 7 ఎప్పుడంటే..

Google Pixel 7 in India : పిక్సెల్​ 7, పిక్సెల్​ 7 ప్రో స్మార్ట్​ఫోన్స్​.. ఇండియాలో లాంచ్​ అవుతాయని గూగుల్​ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ట్విట్టర్​ వేదికగా వెల్లడించింది.

చివరిగా పిక్సెల్​ 3 సిరీస్(3, 3ఎక్స్​ఎల్​, 3ఏ)​ మొత్తాన్నీ.. ఇండియాలో లాంచ్​ చేసింది గూగుల్​. ఆ తర్వాత పిక్సెల్​ 4ఏ, 5ఏ, 6ఏ మోడల్స్​ని మాత్రమే విడుదల చేసింది. మూడేళ్ల తర్వాత పిక్సెల్​ 7 సిరీస్​ మొత్తం ఇండియాలోకి రానుంది.

ఫ్లిప్​కార్ట్​లో గూగుల్​ పిక్సెల్​ 7, పిక్సెల్​ 7 ప్రో అందుబాటులోకి వస్తాయి.

తదుపరి వ్యాసం