తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Google Pixel 6a : ఇండియాలో గూగుల్ పిక్సెల్ 6a ధర రూ. 40,000 లోపే.. మరి లాంచ్ ఎప్పుడంటే..

Google Pixel 6a : ఇండియాలో గూగుల్ పిక్సెల్ 6a ధర రూ. 40,000 లోపే.. మరి లాంచ్ ఎప్పుడంటే..

20 July 2022, 10:05 IST

google News
    • Google Pixel 6a : గూగుల్ పిక్సెల్ 6a జూలై చివరి నాటికి భారతదేశంలో లాంచ్ అవుతుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఫ్లీప్​కార్ట్​లో వీటిని కొనుగోలుచేయవచ్చు అంటున్నారు కానీ.. ఈ విషయాన్ని అధికారికంగా ఇంకా వెల్లడించలేదు. అయితే యూఎస్​లో రేపటినుంచే.. ప్రీఆర్డర్లు మొదలైపోతున్నాయి. అసలు భారతదేశంలో Google Pixel 6a ధర ఎంతనే ప్రశ్న వస్తే.. రూ. 40,000 లోపు ఉండవచ్చు అంటున్నారు. ఇంతకీ నిజమేంటి?
గూగుల్ పిక్సల్ 6a ధర
గూగుల్ పిక్సల్ 6a ధర

గూగుల్ పిక్సల్ 6a ధర

Google Pixel 6a : మే 11న జరిగిన Google I/O ఈవెంట్‌లో Pixel 6aని ప్రకటించింది. Pixel 6a పిక్సెల్ 6 సిరీస్‌కు సమానమైన డిజైన్‌ను కలిగి ఉంది. ఇది USతో సహా కొన్ని మార్కెట్లలో లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. అయితే Google Pixel 6a ఇండియా లాంచ్ తేదీని మాత్రం ఇంకా వెల్లడించలేదు. యూఎస్‌లో Google Pixel 6a కోసం ప్రీ-ఆర్డర్‌లు జూలై 21 నుంచి ప్రారంభం కానున్నాయి. షిప్పింగ్ జూలై 28 నుంచి చేస్తారు.

అయితే గూగుల్ తన పిక్సెల్ 6ఎని త్వరలోనే భారతదేశంలో కూడా లాంఛ్ చేస్తుందని భావిస్తున్నారు. జూలై చివరి నాటికి భారతదేశంలో కూడా విడుదల చేయాలనుకుంటున్నారు. త్వరలో లాంచ్ కానున్న ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 40,000 లోపు ఉండవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే Pixel 5a తర్వాత వచ్చిన Pixel 6a.. Flipkart ద్వారా ఈ నెలాఖరులో విక్రయిస్తారని నివేదికలు పేర్కొంటున్నాయి.

ధర ఎంతంటే..

ఇదిలా ఉండగా.. టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ పిక్సెల్ 6ఎ ధరను ట్విట్టర్‌లో వెల్లడించారు. టిప్‌స్టర్ ప్రకారం.. భారతదేశంలో Pixel 6a ధర సుమారు రూ. 37,000. మరో నివేదిక దాని ధర రూ. 40,000 అని పేర్కొంది. పిక్సెల్ 6a యొక్క లాంచ్ తేదీని గూగుల్ ధృవీకరించనప్పటికీ.. ఈ నెలాఖరులో స్మార్ట్‌ఫోన్ లాంచ్ కచ్చితంగా జరుగుతుందని నివేదికలు చెప్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్ ద్వారా దీనిని విక్రయిస్తారని పేర్కొంటున్నాయి.

Pixel 6a స్పెసిఫికేషన్స్

Pixel 6a అనేది గత సంవత్సరం ప్రారంభించిన Pixel 6కి ట్రిమ్-డౌన్ వెర్షన్. డిజైన్ కూడా పిక్సెల్ 6కి చాలా పోలి ఉంటుంది. ఫోన్ పిక్సెల్ 6 నుంచి కెమెరా బార్‌ను రూపొందించారు. ఇది చాక్, చార్‌కోల్, సేజ్‌తో సహా మూడు రంగు ఎంపికలలో అందిస్తున్నారు.

ఇది Google ప్రీమియం ఫోన్లు-Pixel 6, Pixel 6 Proల సమ్మేళనంతో తీర్చిదిద్దారు. ఇది ఫోన్ Google Tensor చిప్‌సెట్‌తో ఆధారితమైనది. అంతేకాకుండా శక్తివంతమైన కెమెరాలతో వస్తుంది. పిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరాలను కలిగి ఉంది. ప్రధాన లెన్స్, అల్ట్రావైడ్ లెన్స్​తో వచ్చింది. Pixel 6aలో సెల్ఫీ కెమెరా విషయానికొస్తే.. ఇది Pixel 6 వలె గొప్ప కెమెరా.

Google Pixel 6a స్మార్ట్‌ఫోన్ 6GB LPDDR5 RAM, 128GB UFS 3.1 స్టోరేజ్‌తో వస్తుంది. ఇది అండర్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, టైటాన్ M2 సెక్యూరిటీ చిప్, మరిన్ని ఫీచర్లను కూడా కలిగి ఉంది. Google Pixel 6a 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.1-అంగుళాల FHD+ OLED డిస్‌ప్లేతో అమర్చారు. ఇది స్క్రీన్ రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 కోటింగ్‌ను కలిగి ఉంది.

టాపిక్

తదుపరి వ్యాసం