తెలుగు న్యూస్ / ఫోటో /
Google Pixel 6a Review | పిక్సెల్ 6a ఫోన్ కొనుగోలు చేయటం మంచి ఆప్షనేనా?
Google Pixel 6a ద్వారా మళ్లీ పిక్సెల్ లైనప్ స్మార్ట్‌ఫోన్లు భారత మార్కెట్లోకి పునరాగమనం చేయబోతున్నాయి. కొత్త డిజైన్‌తో, ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో వస్తున్న ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయటం మంచిదేనా? రివ్యూ చదవండి.
Google Pixel 6a ద్వారా మళ్లీ పిక్సెల్ లైనప్ స్మార్ట్‌ఫోన్లు భారత మార్కెట్లోకి పునరాగమనం చేయబోతున్నాయి. కొత్త డిజైన్‌తో, ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో వస్తున్న ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయటం మంచిదేనా? రివ్యూ చదవండి.
(1 / 6)
Google Pixel 6a స్మార్ట్‌ఫోన్ సరికొత్త Pixel 6 డిజైన్‌తో వస్తుంది. డ్యూయల్-టోన్ రంగులు, బోల్డ్ కెమెరా విజర్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ రిఫ్రెష్‌గా కనిపిస్తుంది. వెనుకవైపు మెటల్ ఫ్రేమ్, ముందున గొరిల్లా గ్లాస్ 3తో నాణ్యమైనదిగా కనిపిస్తోంది. ఈ ఫోన్ వాటర్, డస్ట్ నిరోధకత కోసం IP67 రేటింగ్ కలిగి ఉంది.(Amritanshu / HT Tech)
(2 / 6)
Google Pixel 6a పిక్సెల్ స్మార్ట్‌ఫోన్ కూడా దాని ముందు మోడల్ 4aలో ఉన్నట్లుగానే వెనకవైపు డ్యూయల్ 12MP కెమెరాలను కలిగి ఉంది. పాత కెమెరా సెన్సార్లు ఉన్నప్పటికీ, Pixel 6aలో స్టిల్ ఫోటోగ్రఫీ ఫీచర్స్ రాత్రివేళలో కూడా స్పష్టమైన చిత్రాలు తీయగలదు. సెల్ఫీ కెమెరా కూడా స్మార్ట్ ఫీచర్లతో నిండి ఉంది. వీడియో రికార్డింగ్ బాగానే ఉంది. అయితే iPhone SE కంటే సామర్థ్యం తక్కువగానే ఉంటుంది.(Amritanshu / HT Tech)
(4 / 6)
Google Pixel 6aలో 4410 mAh సామర్థ్యం కలిగిన బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. అయితే బాక్స్‌లో ఛార్జర్ లేదు, విడిగా కొనుగోలు చేయాలి. దీనికి అందించే 18W ఛార్జింగ్ సపోర్టుతో ఫోన్ ఫుల్ ఛార్జ్ అవటానికి రెండు గంటలకు పైగా పడుతుంది.(Amritanshu / HT Tech)
(5 / 6)
Google Pixel 6a స్మార్ట్‌ఫోన్ FHD+ రిజల్యూషన్‌తో కూడిన 6.1-అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. అయితే 60Hz రిఫ్రెష్ రేట్ తక్కువగా ఉంది. ఆప్టికల్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ పనితీరు బాగుంది.(Amritanshu / HT Tech)
ఇతర గ్యాలరీలు