Google Pixel 6a : ఈనెల 28 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లోకి రానున్న గూగుల్ పిక్సెల్ 6a.. ధర, ఫీచర్లివే..
రెండేళ్ల విరామం తర్వాత గూగుల్ భారతదేశంలో పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టింది. Pixel 4a (2020లో విడుదలైంది) ఇదే ఇక్కడ ప్రారంభమైన చివరి పిక్సెల్ పరికరం. అప్పటి నుంచి గూగుల్ పిక్సెల్ 5, పిక్సెల్ 6 సిరీస్‌లను పరిచయం చేసింది. కానీ వాటిని ఇండియాలో ప్రారంభించలేదు. అయితే Google Pixel 6aను ఇప్పుడు ఇండియాకు తీసువచ్చింది. మరి దీని ఫీచర్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Google Pixel 6a ఇప్పుడు భారతదేశంలో అధికారికంగా విడుదలైంది. ఇది జూలై 28 నుంచి వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. రెండేళ్ల విరామం తర్వాత గూగుల్.. Google Pixel 6aను ఇండియాకు తీసుకువచ్చింది. Google Pixel 6a రాకతో దేశంలోని పిక్సెల్ అభిమానులు ఇప్పుడు సంతోషిస్తున్నారు. అయితే మీరు దీన్ని కొనుగోలు చేయాలనుకుంటే.. దాని ఫీచర్స్, ధర, ఎక్కడ దొరుకుతుంది అనే అంశాలపై క్లారిటీ తెచ్చుకోవాలి. అయితే మీకోసమే ఇది. ఈ కొత్త పిక్సెల్ స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Google Pixel 6a డిజైన్
Google Pixel 6a డ్యూయల్-టోన్ వెనుక ప్యానెల్‌ను కలిగి ఉంది. Pixel 6a స్లిమ్ బెజెల్స్‌తో టాప్-సెంటర్డ్ పంచ్-హోల్ కట్-అవుట్, అండర్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంది. వెనుకవైపు, ఇది బ్లాక్-అవుట్ ఫుల్-వెడల్పు కెమెరా బార్‌తో, డ్యూయల్-టోన్ డిజైన్‌ను ప్రదర్శిస్తుంది.
Google Pixel 6a 60Hz రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణతో 6.1-అంగుళాల పూర్తి-HD+ (1080x2400 పిక్సెల్‌లు) OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇండియాలో చార్కోల్, చాక్ షేడ్స్‌లో ఇది లభ్యమవుతుంది.
Google Pixel 6a కెమెరా
Google Pixel 6a 12.2MP (f/1.7) ప్రైమరీ స్నాపర్, 12MP (f/2.2) అల్ట్రా-వైడ్ సెన్సార్‌ను కలిగి ఉన్న డ్యూయల్ రియర్ కెమెరా అమరికను కలిగి ఉంది. ముందు భాగంలో 8MP (f/2.0) సెల్ఫీ షూటర్‌ని కలిగి ఉంది.
హ్యాండ్‌సెట్‌కు Google Tensor SoC మద్దతు ఉంది. Pixel 6a టైటాన్ M2 కోప్రాసెసర్, 6GB RAM, 128GB అంతర్గత నిల్వతో జత చేయచేసిన Google Tensor చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది Android 12ని బూట్ చేస్తుంది. పరికరం 18W ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 4,410mAh బ్యాటరీ నుంచి శక్తిని తీసుకుంటుంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, Wi-Fi 6E, బ్లూటూత్ 5.2, GPS, NFC, టైప్-సి పోర్ట్ ఉన్నాయి.
Google Pixel 6a ధర
Google Pixel 6a మీకు రూ. 43,999కు లభ్యమవుతుంది. దీనిని జూలై 28 నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. యాక్సిస్ బ్యాంక్ కార్డ్ హోల్డర్లు డెబిట్, క్రెడిట్, EMI లావాదేవీలపై రూ.4,000 తగ్గింపు పొందుతారు.
కొనుగోలుదారులు కూడా పాత Pixel పరికరానికి బదులుగా రూ. 6,000 తగ్గింపు, పిక్సెల్ కాని స్మార్ట్‌ఫోన్‌కు బదులుగా రూ.2,000 తగ్గింపు పొందుతారు.
సంబంధిత కథనం