తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ganga Pushkaralu 2023 : నేటి నుంచి గంగా పుష్కరాలు.. ఏర్పాట్లు ముమ్మరం

Ganga pushkaralu 2023 : నేటి నుంచి గంగా పుష్కరాలు.. ఏర్పాట్లు ముమ్మరం

Sharath Chitturi HT Telugu

22 April 2023, 7:21 IST

google News
    • Ganga pushkaralu 2023 : పవిత్ర గంగా పుష్కరాలు నేడు ప్రారంభంకానున్నాయి. మే 3 వరకు కొనసాగే ఈ పుష్కరాలో కోసం అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు.
నేటి నుంచి గంగా నది పుష్కరాలు..
నేటి నుంచి గంగా నది పుష్కరాలు.. (Rameshwar Gaur)

నేటి నుంచి గంగా నది పుష్కరాలు..

Ganga pushkaralu 2023 : హిందువులు అత్యంత పవిత్రంగా భావించే గంగా పుష్కరాలు నేడు ప్రారంభంకానున్నాయి. 12ఏళ్లకి ఒకసారి వచ్చే ఈ పుష్కరాలు మే 3 వరకు కొనసాగనున్నాయి. కోట్లాది మంది ప్రజలు గంగా నదిలో పుణ్యస్నానాలు ఆచరించనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు ముమ్మరం చేశారు.

గంగా పుష్కరాలు.. ఇప్పుడే ఎందుకు?

" బృహస్పతి.. సంవత్సరంలో ఒక రాశిలో ప్రవేశిస్తాడు. అంటే.. ఒక రాశిలో ప్రవేశించిన తర్వాత, తిరిగి అదే రాశిలో సంచరించాలంటే 12ఏళ్లు పడుతుంది. ఈ నేపథ్యంలో శనివారం మేషరాశిలోకి బృహస్పతి ప్రవేశిస్తాడు. ఇది హిందువులకు అత్యంత పవిత్రం. దీనినే గంగా పుష్కరాలు అని పిలుస్తారు. బృహస్పతి.. సంబంధిత రాశిలోకి ప్రవేశించిన తొలి 12రోజులను ఆది పుష్కరాలని, చివరి 12 రోజులు అంత్య పుష్కరాలుగా పిలుస్తారు," అని ఆధ్యాత్మిక గురువు చెబుతున్నారు.

ముమ్మరంగా ఏర్పాట్లు..

Ganga pushkaralu 2023 dates : ఉత్తరాఖండ్​లో జన్మించిన గంగా నది.. పలు రాష్ట్రాల్లో ప్రవహించి, చివరికి సముద్రంలో కలుస్తుంది. ఈ మార్గంలో అనేక పుష్కర ఘాట్​లు ఉన్నాయి. కాగా.. వారణాసి, గంగోత్రి, హరిద్వార్​, బద్రీనాథ్​, కేదార్​నాథ్​, ప్రయాగ, అలహాబాద్​ వంటివి ప్రముఖంగా ఉన్నాయి. గంగా పుష్కరాల వేళ వీటిల్లో స్నానాలు చేస్తే అత్యంత పుణ్యం అని ప్రజలు విశ్వసిస్తారు.

ఈ నేపథ్యంలో గంగా నది పుష్కరాల కోసం అధికారులు పటిష్ఠ చర్యలు చేపట్టారు. ఉత్తరాఖండ్​, ఉత్తర్​ ప్రదేశ్​, పశ్చిమ్​ బెంగాల్​లో భద్రతను మరింత పటిష్ఠం చేశారు. ఎండా కాలం వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కలిగించే రీతిలో అధికారులు చర్యలు తీసుకున్నారు. అనేక పుష్కర ఘాట్​లలో మంచి నీటి కేంద్రాలు ఏర్పాటు చేశారు. మరుగుదొడ్లు, స్నానాల గదులు, బట్టలు మార్చుకోవడం కోసం ప్రత్యేక రూమ్​లు సిద్ధం చేశారు.

ఇదీ చదవండి:- Ganga Pushkaram 2023 । పవిత్ర గంగా పుష్కరాలు జరిగే రోజులు, పుణ్యస్నానాలు, ఆచరించాల్సిన నియమాలు!

Ganga pushkaralu 2023 schedule : స్నానాలకు వెళ్లి గంగా నదిలో ప్రమాదవశాత్తు పడిపోతే.. వెంటనే రక్షించే విధంగా ఆయా ఘాట్​లలో రెస్క్యూ బృందాలను సిద్ధం చేశారు అధికారులు. అదే సమయంలో వైద్య బృందాలు సైతం గంగా పుష్కరాల వేళల్లో సేవలు అందించనున్నాయి. పోలీసు విభాగాలు నిత్యం నిఘా ఉంచనున్నాయి.

Ganga pushkaralu places list : హిందువులకు అత్యంత పవిత్రంగా భావించే కాశీలో గంగా పుష్కరాల కోసం మరింత ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రజల తాకిడి అనుకున్న దాని కన్నా ఎక్కువగా ఉంటే.. ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టారు. సాధారణ సదుపాయాలతో పాటు స్థానిక స్కూళ్లు, వసతి గృహాలు, ఆశ్రమాల్లో పూర్తి ఏర్పాట్లు చేశారు. రైల్వే స్టేషన్​, బస్టాండ్​ల నుంచి ప్రజలు పుష్కర ఘాట్​లకు చేరుకునేందుకు వీలుగా ప్రత్యేక రవాణా వ్యవస్థను రూపొందించారు.

Ganga pushkaralu 2023 tour packages from Hyderabad : మరోవైపు.. గంగా పుష్కరాల్లో పాల్గొనేందుకు దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు భారీ సంఖ్యలో వెళ్లే అవకాశం ఉంది. వీరి కోసం ఇప్పటికే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది భారతీయ రైల్వే. మరోవైపు ఆయా ప్రాంతాల్లో నివాసాలు, భోజనం వంటి వాటికోసం స్థానికంగా ఉండే దక్షిణాది హోటల్స్​, సత్రాలు.. ఇప్పటికే ప్రకటనలు సైతం చేశాయి.

తదుపరి వ్యాసం